Ad Code

శ్రీ రామ జయ రామ జయ జయ రామ - Sri Rama Jaya Rama Jaya Jaya Rama

శ్రీ రామ జయ రామ జయ జయ రామ



వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ:

నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్

శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్

త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్


ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు.

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

కానీ అదే శ్రీ రామ అనే నామం లో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోడం పొరపాటు.

శ్రీ రామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అట.

రామ అంటే రాముడు పలుకుతాడు తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ హనుమంతుడే

శ్రీ అంటే లక్ష్మి

రా అంటే విష్ణువు (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)

మ అంటే శివుడు (ఓం నమః శివాయ అనే నామంలో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)

శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అంటే అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహమచర్యాని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపం లో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. మరి రామ అన్నపుడు హనుమ వస్తే పార్వతీ కూడా వచ్చింది కదా.

రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ

ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు.

అలాంటి నామ పారాయణం చేయడం మరువకండి.


శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే,

సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే

శ్రీ రామ నామ వరానన ఓం నమ ఇతి

శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష


జై శ్రీరామ్


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ





Post a Comment

0 Comments