Ad Code

శివ పంచాక్షరి స్తోత్రం మరియు అర్ధము - Shiva Panchakshari Stotram And Meaning

శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన
శివ పంచాక్షరి స్తోత్రం మరియు అర్ధము



నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ |

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై “న” కారాయ నమః శివాయ || 1 ||

అర్దము:

నాగేంద్రున్ని హారముగా ధరించినవాడు, మూడుకన్నులవాడు, భస్మము వంటినిండా పూసుకున్నవాడు, మహేశ్వరుడు, నిత్యమయినవాడు, పరిశుద్ధుడు, దిగంబరుడు, "నమశ్శివాయ" అను మంత్రము నందలి 'న' అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము.

మందాకినీ సలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మై “మ” కారాయ నమః శివాయ || 2 ||

అర్దము:

ఆకాశగంగాజలమనే చందనము పూయబడినవాడు, నందీశ్వరుడు మొదలైన ప్రమథ గణములకు నాయకుడు మందారము మొదలైన అనేక పుష్పములచే పూజింపబడిన వాడు,  "నమశ్శివాయ" అను మంత్రము నందలి   'మ ' అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము.

శివాయ గౌరీ వదనాబ్జ బృంద

సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |

శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ

తస్మై “శి” కారాయ నమః శివాయ || 3 ||

అర్దము:

మంగళకరుడు, పార్వతీ ముఖమనే పద్మసముదాయమును వికసింపచేయు సూర్యుడు, దక్షుని యాగము నాశనము చేసినవాడు, నల్లని కంఠము కలవాడు, జండాపై ఎద్దు చిహ్నమున్నవాడు, "నమశ్శివాయ" అను మంత్రము నందలి   'శి' అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము.

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య

మునీంద్ర దేవార్చిత శేఖరాయ |

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మై “వ” కారాయ నమః శివాయ || 4 ||

అర్దము:

వశిష్టుడు, అగస్త్యుడు, గౌతముడు, మొదలైన మునీంద్రులచేత పూజింపబడు జటాజూటము కలవాడు, చంద్రుడు - సూర్యుడు - అగ్ని మూడు కన్నులుగా కలవాడు, "నమశ్శివాయ" అను మంత్రము నందలి   'వ' అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము.

యఙ్ఞ స్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ |

దివ్యాయ దేవాయ దిగంబరాయ

తస్మై “య” కారాయ నమః శివాయ || 5 ||

అర్దము:

యక్షస్వరూపుడు, జటలను ధరించినవాడు, " పినాకము " అను ధనస్సును చేతిలో పట్టుకున్నవాడు, సనాతనుడు, ఆకాశమునందుండు దేవుడు, దిగంబరుడు,  "నమశ్శివాయ" అను మంత్రము నందలి   'య' అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము.


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ





Shiva Panchakshari stotram and meaning
(
Written by Sri Adishankaracharyulu)

Nagendraharaaya Trilochanaya

Lord Maheshwara, who is the one who is the king of ashes.

Everlasting purification Digambaraya

Lord Shiva || 1 ||

Meaning :

The one who wore Nagendra as a garland, the one who has three eyes, the one who is covered with ashes, the Maheshwara, the one who always has the mantra of Nagendra, the one who spells "Na" and has the letter "Na" is the one who has the name of Nandali is the one who is filled with ashes, Namaskar to Agu Shiva.

Mandakini Salila Chandana discusses

Nandeeswara Pramadhanatha Maheshwaraya |

Mandara's main multi flower Supujitaaya

Lord Shiva || 2 ||

Meaning :

He is the one who is the water of the sky and is the sandalwood, the leader of the Pramatha Ganas like Nandeshwara, the one who is worshipped with many flowers such as Mandaram, the one who chants "Namashivaya" and Nandali 'Ma' as the letter, Namaskaram to Agu Shiva.

Sivaya Gowri Vadanabja team

Suryaya Dakshadhwara destroyer |

Sri Neelakanthaya Vrushabhadhwajaya

Tasmai "Shi" Karaya Namah Shivaaya || 3 ||

Meaning :

Mangalakar, Parvati's face is the sun that makes the Padma community bloom, the one who destroyed Dakshu's Yagam, the one with black voice, the one who has the symbol of bull on the flag, the one who chants "Namashivaya" and Nandali 'Si', the one who is the one who has written the mantra, Namaskar to Agu Shiva.

Vasista Kumbhodbhava Gautamarya

Munindra Devarchitha Sekharaaya |

Chandrarka Vaishwanara Lochanaya

Tasmai "Va" Karaya Namah Sivaaya || 4 ||

Meaning :

Vasishtudu, Agasthudu, Gautam, etc. will be worshipped by Munindras, the one who has Jatajuta, the one with moon-sun-fire as three eyes, the one who chants "Namashivaya" and spells Nandali 'Va', the one who has the letter, Namaskar to Agu Shiva.

Jatadharaya in the form of memory

Pinaka Hastaya Sanatanaya |

Divine Goddess Digambaraya

Tasmai "Ya" Karaya Namah Sivaaya || 5 ||

Meaning :

He is the form of Yaksha, the one who wears the jata, the one who holds the bow named "Pinakam" in his hand, the one who is the god in the sky, Digambaru, the one who chants "Namashivaya" Nandali 'Ya', Namaskaram to Agu Shiva.





Post a Comment

0 Comments