Ad Code

గాయత్రి మంత్ర విశిష్టత - Gayatri Mantra is the Most Powerful

గాయత్రీదేవి


ఓం నమో గాయత్రీ మాత్రే

నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే

వ్యాహృత్యాది మహా మంత్ర రూపే ప్రణవ రూపిణి

భక్త కల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం

తుర్వాతీత స్వరూపాం చ సచ్చిదానంద రూపిణీం


గాయత్రీ మంత్రం:

ఓం భూర్భువస్సువ:

తత్ సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి,

ధియోయోన: ప్రచోదయాత్


గాయత్రి మంత్ర విశిష్టతను తెలియజేసే కథ:

పూర్వం ఒకప్పుడు "అరుణుడు" అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు.

అతడు దేవతలను ద్వేషించేవాడు.

దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది.

ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి.

దేవతలు కలతచెంది బ్రహ్మదేవుడిని శరణు వేడారు

బహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. 

'మరేదైనా వరం కోరుకో' అన్నాడు.

అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళ గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి"మ్మని కోరాడు. బ్రహ్మ "తథాస్తు” అన్నాడు.

బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధడయ్యాడు.

ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడుమని కబురు చేశాడు.

ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు.

బ్రహ్మ అతన్ని వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా, విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యాముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని, ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో, మరచిపోవడమో చేస్తే తప్ప, అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి, అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్ధించ వలసిందిగా సూచించాడు.

బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు.

మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది.

ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి, బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు.

వచ్చిన బృహస్పతిని చూచి, అరుణుడు అతిథి సత్కారాలు చేసి, "మునీంద్రా నేను రాక్షసుడను కదా! మీరు దేవగురువులు. దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని? మీరాకకు కారణం ఏమిటి! అని అడిగాడు.

అందుకు బృహస్పతి నవ్వి, "రాక్షసరాజా! నీవిలా అనడం భావ్యం కాదు.

మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ, ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావు. కనుక, ఆ రీత్యా మనం మిత్రులమే కాని, శత్రువులం కాదు"అని సమాధాన మిచ్చాడు.

ఈ మాటలు విన్న అరుణునితో దురభిమానము, దురహంకారము విజృంభించాయి.

తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు.

వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి, అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు.

గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు, దుర్భలుడు అయిపోయాడు, ఎందుకూ కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా, ఆమె వారికి సాక్షాత్కరించింది.

నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్వంతకారిణి

నమః కమల వ్యతాక్షి నర్వాధారే నమాన్తుతే

భ్రమరై ర్వేష్టితా యస్త్యాత్‌ భ్రామరీ యా తత స్స్మృతా

త స్మై దేవ్యై నమా నిత్యం నిత్వమేవ నమో నమః

అని పలువిధములుగా ఆమెను ప్రార్థించగా, ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది.

అంతట పరాశక్తి తన మాయా విలాసంచేత భ్రమరాలను ప్రేరేపించింది.

కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి, భూమ్యాకాశాలను కప్పివేసి, రాక్షసుల శరీరాలను ఆక్రమించి, చెవుల్లో భరించరాని రొదచేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి , వినడానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి.

దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి, అరుణుని, అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే, శస్తాస్తాలతో పని లేకుండా సంహరించాయి.

ద్విపాద. చతుష్పాద ప్రాణులవల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షట్పది (ఆరు పాదాలు గలది తుమ్మెద) వల్ల మరణించాడు.

తమను కనికరించి, రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను అనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి, ఆమె అనుగ్రహం పొందసాగారు.


విశ్వామిత్ర తపఃఫలాం

ప్రియతరాం విప్రాలిసంసేవితా

నిత్యానిత్య వివేకదాం స్మితముఖీం

ఖండేందు భూషోజ్జ్వలాం

తాంబూలారుణ భాసమాన 

వదనాం మార్తాండమధ్యస్థితాం

గాయత్రీం హరివల్లభాం 

త్రినయనాం ధ్యాయామి పంచాననాం.

విశ్వామిత్రుని తపఃఫలముగా వచ్చి,

బ్రాహ్మణులు, ఋషులచే పూజించబడి,

అనంతమైన, నిత్యమైన వివేకాన్ని ఇచ్చే,

నెలవంకను ఆభరణముగా 

కలిగి శోభిల్లుతున్న, 

ఎర్రని వదనముతో భాసిల్లుతున్న, 

సూర్యుని మధ్యలో నివసిస్తున్న, 

శ్రీహరికి ప్రియమైన, 

మూడు నేత్రములు, 

ఐదు ముఖములతోనున్న 

గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ


The result of unfaithful friend

With love Vipralisamsevita

Let us be wise forever Smitha Mukhim

Landslide in the continent

The speech of Tambularuna

Vandanam Martanda's situation

Gayathreem Harivallabham

Trinayanam is a meditative Panchananam..

Came as a result of a faithful friend,

worshipped by brahmins and sages,

the giver of infinite and everlasting wisdom,

As an ornament of the month

Glowing up having,

Blazing with the red salute,

Living in the middle of the sun,

Dear to Sri Hari,

The three eyes, the one who is the one who is in the world.

The one with the five faces

Meditating on the Goddess Gayatri.





Post a Comment

0 Comments