కార్తీక మాసంలో ద్వార లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?
ఇంటి గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే కానీ,
ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపుని కొలుచుకోవడం రెండు ఇంటి ప్రధాన గుమ్మం "గడప"కు పూజ చేయడం.
ఇంటి గడపను సింహ ద్వారమని లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియక పోయినా పెద్దవారి నుండి సంప్రదాయంగా ఆచరిస్తున్నారు.
గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవడం.
ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం.
పెళ్లి కాని అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసిన కుదరక జాతకాల విషయంలో అంతరాయాలు ఏర్పడే వాటికి కట్న, కానుకల విషయంలోను ఏదో ఒక ఆటంకంతో ఆలస్యం అవుతున్న అమ్మాయిలు 16 రోజులు ఇంటి ప్రధాన గడపకు పూజ చేయాలి.
పూజ విధానం:
ఉదయం 3 గంటలకు ఈ పూజ చేయాలి 16 రోజులు పాటు ఆటంకం లేకుండా అదే సమయంలో చేయాలి.
మొదట గడపను నీటితో మూడు సార్లు కడగాలి. తర్వాత పాలుపోసి కడగాలి అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దీ పాలతో పోసి చేతితో గడపను పాలతో తుడవాలి. తర్వాత చివరిగా ఇంకోసారి నీటితో గడపను శుభ్రం చేయాలి.
గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి.
చిన్న పళ్లెంలో మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవునైయి కానీ నూనె కానీ పోసి వెలిగించాలి.
ఇంకో పళ్లెంలో బెల్లం అటుకులు, తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకునే మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకుని వెంకటేశ్వరస్వామి అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరం చదువుకుని హారతి ఇవ్వాలి.
గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి కొండ ఎక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి.
పూజ అయిన వెంటనే వెళ్లి నిద్రపోకూడదు, ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయిన పర్వాలేదు.
ఆ పదహారు రోజులు పూజ గదిలో దీపం వెలిగించిన చాలా శుభం.
పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం 3 గంటలకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకోవాలి. లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబందించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకుని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకుని పదహారు రోజులు ఈ గడప పూజ చేయవచ్చును.
ఇంట్లో సమస్య ఇంటిపైన అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్టు గొడవ ఇంటి పైన ఉన్నను ఆ ఇంటి యజమాని కానీ భార్య భర్తలు ఇద్దరు కలసి కానీ భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకుని ఇంటి సమస్య తీరాలి అని వేడుకుని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మి నారాయణ అష్టోత్తరం, మణి ద్వీపవర్ణన చదువుకుని హారతి ఇవ్వాలి. ఆ ఇంటిలో ఉన్న సమస్య తీరిపోతాయి. ఈ విధంగా గడపకు పూజలు చేసి ఎన్నో సమస్యలు పరిష్కరించే వారు మన పూర్వీకులు.
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
Why Dwara Lakshmi Pooja should be done in Karthika month?
Many people know that turmeric, saffron, flowers are kept at the doorstep of the house but..
Two of the most important rituals for the safety of a family is to measure the family's house and two is to pray at the main door "door".
The doorstep of the house is called Lion's door, Lakshmi door, Dwaralakshmi. Even turmeric, saffron, flowers were kept traditionally from the elders, although they do not know why to do what most people know.
They tie toranam to the doorsteps and send invitations to the deities. Putting a toran to the door means inviting the goddesses into the house with respect. What a misfortune that they should not come through this door.
Now let us find out the solution to some problems with this ritual on the doorstep.
Unmarried girls cannot do any number of relationships. Due to horoscope interruptions and delays in dowry and gifts should perform pooja at the main house for 16 days.
The ritual of ritual:
This puja has to be done at 3 in the morning. It has to be done without any interruption for 16 days.
First wash the house three times with water. Later, if you want to wash it with milk, just like the abhishekam, pour it with some milk and wipe it with your hands with milk. Then last one more time to clean the house with water.
The house should be decorated with yellow saffron flowers.
In a small village, three lamps were kept in a single lamp and became cow or oil should be poured and lit.
In another village, by putting jaggery atuku, tamboolam and offering namaskar to Lord Ganesha should be possible. Venkateswara Swamy should read eightottaram and Lakshmi eightottaram and give harathi.
By saluting the lamp kept near the door step, it should be kept till you climb the hill and then remove it.
You should not go to sleep immediately after puja, it is okay to sleep even after waiting for half an hour.
It is very auspicious to light a lamp in the pooja room for those sixteen days.
Unmarried boys should also do pooja at 3 in the morning and wish for a good girl to come as their wife. Or that child's mother can be worshipped for sixteen days by wearing any cloth belonging to his son and wishing that the daughter-in-law should step into that house.
The problem in the house is debt on the house, but the documents of the house are in mortgage, any court dispute is on the house. But the owner of the house, the wife and the husband are together, but in a state that the husband's health is not cooperating, the wife put his cloth on her shoulder and begged to solve the problem of the house. By doing pooja to the house like me, by reading Lakshmi Narayana Ashtottaram, Mani Deepavarnana Haarathi has to be given. The problem in that house will be solved. Our ancestors used to solve many problems by performing poojas at the doorstep like this.
0 Comments