Ad Code

శివలింగాన్ని ఏయే ద్రవ్యాలతో చేసి పూజిస్తే ఏయే ఫలితాలు పొందవచ్చు - In Garudapuranam, if you worship it with many liquids, what are the fruits you can get

శివలింగాన్ని ఏయే ద్రవ్యాలతో చేసి పూజిస్తే
ఏయే ఫలితాలు పొందవచ్చు


గరుడపురాణంలో అనేక ద్రవ్యాలతో చేసి పూజిస్తే ఏయే ఫలాలు పొందవచ్చో చెప్పబడినది.

రెండుపాళ్ళు కస్తూరి, నాలుగు పాళ్ళు చందనం, మూడుపాళ్ళు కుంకుమ కలిపి శివలింగాన్ని చేసి పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.


వాసన గల పుష్పాలతో లింగం తయారుచేసి పూజిస్తే భూమినీ, రాజ్యాన్ని పొందవచ్చు.


స్వచ్ఛమైన ప్రదేశంలో కపిల గోవుల పేడతో శివలింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దీనిని గోశకలింగం అంటారు.


నాలుకా లింగం అనగా ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం తదుపరి శివసాయుజ్యం కలుగుతుంది.


యవగోదూమశాలిజలింగం అనగా జొన్నలు, గోధుమలు, బియ్యం కలిపి పిండి పట్టించి ఆ పిండితో లింగాన్ని చేసి పూజిస్తే పుత్రలాభం కలుగుతుంది, ధనం వర్ధిల్లుతుంది.


సీతాఖండలింగం:
పటిక బెల్లం తో లింగం చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది.

తిలపిష్టలింగం: నువ్వులను రుబ్బి ముద్దతో లింగం చేసి పూజిస్తే కోరికలు నెరవేరుతాయి.

భస్మలింగం: భస్మలింగ పూజ సర్వ ఫలప్రదం.

గుడలింగం: బెల్లముతో కాని,చక్కెరతో కాని చేసి పూజిస్తే సుఖాలన్ని కలుగుతాయి.

వంశాంకురలింగం: వెదురు చిగుళ్ళతో లింగం చేసి పూజిస్తే వంశం నిలుస్తుంది.

పిష్ఠలింగం: పిండిలింగం విద్యాప్రదం.

దధిదుగ్ధలింగం:పెరుగులో నీళ్ళు వత్తి లింగం చేసి పూజిస్తే సంపద, సుఖం వస్తాయి.

ధాన్యలింగం: ధాన్యప్రదం.

ధాత్రీలింగం: ఉసిరికాయలతో లింగం చేసి పూజిస్తే మక్తిప్రదం.

ఫలలింగం: ఫలప్రదం.

నవనీత(వెన్న)లింగం: కీర్తి,సౌభాగ్యకరం.

దూర్వాకుండజ(గరిక)లింగం: అపమృత్యునివారకం.

కర్పూరలింగం: ముక్తిప్రదం.

అయస్కాంతలింగం: అయస్కంతాన్ని లింగాకారంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తుంది.

మౌకికలింగం: ముత్యాల భస్మంతో చేసిన లింగం సౌభాగ్యాన్నిస్తుంది.

సువర్ణలింగం: బంగారు లింగం మహాముక్తిప్రదం.

రజతలింగం: వెండిలింగం సంపత్కరం.

పిత్తలలింగం: కాంస్యలింగం(ఇత్తడి, కంచు లింగాలు) ముక్తినిస్తాయి.

త్రపులింగం: ఆయసలింగం,

సీసలింగం: (తగరం, తుత్తం, ఇనుము) శతృనాశకాలు.

అష్టధాతులింగం: సర్వసిద్ధిప్రదం.

అష్టలోహలింగం: కుష్ఠు వ్యాధిహరం.

వైఢూర్యలింగం: శతృగర్వ నివారకం.

స్ఫటికలింగం: సర్వకామప్రదం.

పాదరసలింగం: మహైశ్వర్యప్రదం.

రాగి, సీసం, శంఖం, ఇనుము, గాజు మన్నగువాటితో తయారు చేసిన లింగాలు కలియుగంలో వాడరాదు.


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ



In Garudapuranam, if you worship it with many liquids, what are the fruits you can get.

If you worship Shiva Linga by mixing two teeth of Kasturi, four teeth of Sandalwood, three teeth of Saffron and three teeth of Sivalinga, you will get Shiva's help.

If you make Lingam with fragrant flowers and worship, you can get the land and kingdom.

In a pure place, if you worship Shiva Lingam with Kapila cows peda, you will get wealth. This is called a cow lingam.

Tongue Lingam means, if you worship with sand by doing Lingam, education will be the next Shiva's help.

If you mix corns, wheat, rice and make a flour with flour and worship it, you will get profit and wealth.

Seetakhandalingam - If you worship Lingam with jaggery, you will be healthy.

Tilapishtalingam - If you ruby sesame seeds and worship them, your wishes will be fulfilled.

Bhasmalingam - Bhasmalinga Pooja is very fruitful.

Gudalingam - If you worship it with jaggery or sugar, you will get all the happiness.

Vamshankuralingam - If you worship Lingam with bamboo shoots, the dynasty will stand.

Pisthalingam - Pindlingam is educational.

Dadhidugdhalingam-yogurt if you put water in it and worship it with lingam, you will get wealth and happiness.

Cereal gender - Grainy.

Dhatrelingam - If you worship with lingam with lentils, it is powerful.

Fruitful - Fruitful.

Navneetha (butter) Lingam - fame, fortunate.

Durvakundaja (Garika) Lingam - the path of immortality.

Camphor gender - liberating.

Ayaskantha Lingam- If you worship Ayaskantha in Linga, it will bring Siddhi.

Maukikalingam- Lingam made of pearl ashes will bring good luck.

Golden lingam-Golden lingam is very liberating.

Silver Lingam - Silver Lingam is the wealthiest.

Brass Lingam - Bronze Lingam (Bronze, Bronze Lingam) will set you free.

Trapplingam - Aayasalingam,

Sesalingam (Algae, straw, iron) destroyers of enemies.

Ashtadhatalingam - The Most Achievable.

Ashtalohalingam - Leprosy disease.

Vaishuryalingam - Prevention of enemy pride.

Crystal Linga - All-Sexual.

Padarasalingam - The Most Wealthy.

Lingas made of copper, sesam, conch, iron, glass clay should not be used in Kaliyuga.







Post a Comment

0 Comments