తిరుమలలో అన్నప్రసాద వితరణ ఎప్పుడు ప్రారంబమైంది?
అన్నదాన ట్రస్టులో రోజు ఎంతమంది తింటారో తెలుసా?
అన్నదాన ట్రస్టులో ఎన్ని కోట్లు ఉన్నాయి?
దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలి అనేది తెలియకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు అల్పాహారాలు, అన్నప్రసాద వితరణ చేస్తూ వస్తోంది. ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యజ్ఞాన్ని నిరాఘాటంగా సాగిస్తోంది.
మరి తిరుమలలో తొలినాళ్లలో పరిస్థితులు ఎలా ఉండేవి. పూర్తిగా దట్టమైన అడవి మధ్యన ఉండే ఆలయానికి వచ్చే భక్తుల ఆకలిని ఎవరు తీర్చేవారు. మొదట ఎందరో రాజులు, చక్రవర్తులు, స్వామివారి నైవేద్యానికి భూరివిరాళాలు ఇచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే భక్తులకోసమే ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ చేసిన ఘనత మాత్రం తరిగొండ వెంగమాంబకే దక్కుతుంది.
17వ శతాబ్దంలోనే నాంది
శ్రీవారి అపరభక్తురాలైన ఈ తెలుగు కవయిత్రి 17వ శతాబ్దంలో తిరుమలలో భక్తులకు అన్నపసాద వితరణ చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఏటా వైశాఖమాసంలో తిరుమలలో నృసింహజయంతి జరిపే వెంగమాంబ పదిరోజులపాటు అన్నప్రసాద వితరణ, చలివేంద్రాలు ఏర్పాటుచేసేవారట. ఈ పవిత్ర కార్యక్రమానికి ఆనాటి రాజులు దిండిగల్లు మొదలుకొని ఉత్తారాదిన గోల్కొండ వరకు ఎందరో భూదానాలు చేసినట్టు శాసనాలు చెబుతున్నాయి.
గతంలో స్వల్ప ధరలకు భోజనం
1933లో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడిన మూడు దశాబ్దాల తరువాత స్వల్పధరలకే అల్పాహారాన్ని అందించే ఓ క్యాంటీన్‌ను ప్రారంభించారు. అంటే 1965కు పూర్వం ప్రస్తుతం అఖండ హరినామసంకీర్తన జరిగే మండపంలో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. అప్పట్లో ఇడ్లీ 10 పైసలు, వడ 15 పైసలు, టీ, కాఫీలు 25 పైసలు, మసాలా దోశ 40 పైసలు, భోజనం రూపాయిపావలాకు విక్రయించేవారు.
1970 నుంచి 1980వరకు ఏఎన్‌సి ప్రాంతంలోని ఓ కాటేజీలో ఎస్వీసీసీ పేరుతో అంటే శ్రీవేంకటేశ్వర క్యాంటీన్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఇక్కడ కూడా స్వల్పధరలకే ఆహారపదార్థాలు విక్రయించేవారు. తరువాత 1971లో ప్రముఖులు, భక్తులకోసం మార్చి 31, 1971లో ఎస్వీ గెస్ట్ హౌస్‌ను అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.
ఇందులో టిటిడి ప్రత్యేకంగా క్యాంటీన్‌ను ఏర్పాటుచేసి తక్కువ ధరలకు అల్పాహారాన్ని అందించడంతోపాటు తక్కువ ధరకే భోజన సదుపాయాన్నీ కల్పించింది. ఇక 1981 నుంచి 1984వరకు ఆర్టీసీ బస్టాండ్‌లోని టీటీడీ సెంట్రల్ క్యాంటీన్ ఏర్పాటుచేసి ప్లేట్‌మీల్స్ రూపాయి 75పైసలకు, ఫుల్‌మీల్స్ మూడు రూపాయలకు విక్రయించేవారు.
ఈ క్రమంలోనే పాత అన్నప్రసాద భవనాన్ని 1980 జూన్ 5వ తేదీన అప్పటి ఇఓ శ్రీ పీవీఆర్‌కె ప్రసాద్ ప్రారంభించారు. ఈ భవనంలో ప్లేట్ మీల్స్ రూపాయి 75 పైసలు, ఫుల్‌మీల్స్ మూడురూపాయలు, స్పెషల్ భోజనం 4.50 రూపాయలకు విక్రయించేవారు. అప్పట్లో ప్రతినిత్యం ఐదువేల భోజనాలను విక్రయించేవారు.
కొండకు వచ్చే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో ఉచిత అన్నప్రసాద వితరణకు టిటిడి శ్రీకారం చుట్టింది. 1985లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఎల్వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన పది లక్షల రూపాయల భూరివిరాళంతో టిటిడి ఉచిత అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది.
అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఉచితభోజనం లభించేది. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలో ఉచితభోజనం టోకెన్లు అందించేవారు. తొలుత రెండువేలమందికి మాత్రమే భోజనం అందిస్తుండగా క్రమంగా ఈ సంఖ్య 14 వేలకు, అక్కడ నుంచి 20 వేల మందికి పెరిగింది.
ఇలా ప్రారంభమైన అన్నప్రసాద వితరణ క్రమంగా భక్తుల సంఖ్య ప్రతినిత్యం లక్షకు చేరుకుంటున్న నేపథ్యంలో 2008లో సర్వభోజన పథకానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి తిరుమలకు వచ్చిన భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సేవలో తరిస్తోంది.
పలు ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌తోపాటు నాలుగు చోట్ల అన్నప్రసాదాలు తయారు చేస్తారు. వెంగమాంబ కాంప్లెక్స్‌లో కూర, చట్నీ, సాంబార్, రసం, మజ్జిగ, చక్కెర పొంగలి అందిస్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ -1, 2, వెలుపలి క్యూలైన్లు, పిఏసి-2, ఫుడ్ కౌంటర్లలో సాంబార్ బాత్, ఉప్మా, పొంగలి, పులిహోర అందిస్తారు.
అన్నప్రసాదాల తయారీకి ప్రతిరోజూ దాదాపు 10 నుండి 12 టన్నుల బియ్యం, 7 నుండి 8 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు. ఇక్కడ శ్రీవారి సేవకులు కూరగాయల తరగడం, సరుకులను శుభ్రం చేయడం, యాత్రికులకు ఆహారం అందించడం తదితర సేవలు అందిస్తున్నారు.
ప్రస్తుతం సాధారణ రోజుల్లో రోజుకు 55 వేల నుండి 60 వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. పర్వదినాలు, రద్దీ రోజుల్లో ఈ సంఖ్య లక్ష వరకు చేరుతుంది. అన్నదాన ట్రస్టులో ప్రస్తుతం 1502 కోట్ల నిధులున్నాయి. 2018వ సంవత్సరంలో ఈ ట్రస్టు స్వయంసమృద్ధి సాధించడంతో టిటిడి గ్రాంటు ఆగిపోయింది.
భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు అందించాలని దాతలను టిటిడి కోరుతోంది. సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదవితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుండి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తారు. గరుడసేవనాడు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.
శ్రీ గోవింద నామాలు - Sri Govinda Namavali (Namalu)
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా |
శ్రీ శ్రీనివాసా గోవిందా |
శ్రీ వేంకటేశా గోవిందా |
భక్తవత్సలా గోవిందా |
భాగవతప్రియ గోవిందా || ౧
నిత్యనిర్మలా గోవిందా |
నీలమేఘశ్యామ గోవిందా |
పురాణపురుషా గోవిందా |
పుండరీకాక్ష గోవిందా || ౨
నందనందనా గోవిందా |
నవనీతచోర గోవిందా |
పశుపాలక శ్రీ గోవిందా |
పాపవిమోచన గోవిందా || ౩
దుష్టసంహార గోవిందా |
దురితనివారణ గోవిందా |
శిష్టపరిపాలక గోవిందా |
కష్టనివారణ గోవిందా || ౪
వజ్రమకుటధర గోవిందా |
వరాహమూర్తి గోవిందా |
గోపీజనలోల గోవిందా |
గోవర్ధనోద్ధార గోవిందా || ౫
దశరథనందన గోవిందా |
దశముఖమర్దన గోవిందా |
పక్షివాహన గోవిందా |
పాండవప్రియ గోవిందా || ౬
మత్స్య కూర్మ గోవిందా |
మధుసూదన హరి గోవిందా |
వరాహ నరసింహ గోవిందా |
వామన భృగురామ గోవిందా || ౭
బలరామానుజ గోవిందా |
బౌద్ధకల్కిధర గోవిందా |
వేణుగానప్రియ గోవిందా |
వేంకటరమణా గోవిందా || ౮
సీతానాయక గోవిందా |
శ్రితపరిపాలక గోవిందా |
దరిద్రజనపోషక గోవిందా |
ధర్మసంస్థాపక గోవిందా || ౯
అనాథరక్షక గోవిందా |
ఆపద్బాంధవ గోవిందా |
శరణాగతవత్సల గోవిందా |
కరుణాసాగర గోవిందా || ౧౦
కమలదళాక్ష గోవిందా |
కామితఫలదా గోవిందా |
పాపవినాశక గోవిందా |
పాహి మురారే గోవిందా || ౧౧
శ్రీముద్రాంకిత గోవిందా |
శ్రీవత్సాంకిత గోవిందా |
ధరణీనాయక గోవిందా |
దినకరతేజా గోవిందా || ౧౨
పద్మావతిప్రియ గోవిందా |
ప్రసన్నమూర్తీ గోవిందా |
అభయహస్త గోవిందా |
అక్షయవరద గోవిందా || ౧౩ [మత్స్యావతారా]
శంఖచక్రధర గోవిందా |
శార్ఙ్గగదాధర గోవిందా |
విరజాతీర్థస్థ గోవిందా |
విరోధిమర్దన గోవిందా || ౧౪
సాలగ్రామధర గోవిందా |
సహస్రనామా గోవిందా |
లక్ష్మీవల్లభ గోవిందా |
లక్ష్మణాగ్రజ గోవిందా || ౧౫
కస్తూరితిలక గోవిందా |
కాంచనాంబరధర గోవిందా |
గరుడవాహన గోవిందా |
గజరాజరక్షక గోవిందా || ౧౬
వానరసేవిత గోవిందా |
వారధిబంధన గోవిందా |
సప్తగిరీశా గోవిందా | [ఏడుకొండలవాడ]
ఏకస్వరూపా గోవిందా || ౧౭
శ్రీరామకృష్ణా గోవిందా |
రఘుకులనందన గోవిందా |
ప్రత్యక్షదేవా గోవిందా |
పరమదయాకర గోవిందా || ౧౮
వజ్రకవచధర గోవిందా |
వైజయంతిమాల గోవిందా |
వడ్డికాసులవాడ గోవిందా |
వసుదేవతనయా గోవిందా || ౧౯
బిల్వపత్రార్చిత గోవిందా |
భిక్షుకసంస్తుత గోవిందా |
స్త్రీపుంరూపా గోవిందా |
శివకేశవమూర్తి గోవిందా || ౨౦
బ్రహ్మాండరూపా గోవిందా |
భక్తరక్షక గోవిందా |
నిత్యకళ్యాణ గోవిందా |
నీరజనాభ గోవిందా || ౨౧
హథీరామప్రియ గోవిందా |
హరిసర్వోత్తమ గోవిందా |
జనార్దనమూర్తి గోవిందా |
జగత్సాక్షిరూప గోవిందా || ౨౨
అభిషేకప్రియ గోవిందా |
ఆపన్నివారణ గోవిందా |
రత్నకిరీటా గోవిందా |
రామానుజనుత గోవిందా || ౨౩
స్వయంప్రకాశా గోవిందా |
ఆశ్రితపక్ష గోవిందా |
నిత్యశుభప్రద గోవిందా |
నిఖిలలోకేశ గోవిందా || ౨౪
ఆనందరూపా గోవిందా |
ఆద్యంతరహితా గోవిందా |
ఇహపరదాయక గోవిందా |
ఇభరాజరక్షక గోవిందా || ౨౫
పరమదయాళో గోవిందా |
పద్మనాభహరి గోవిందా |
తిరుమలవాసా గోవిందా |
తులసీవనమాల గోవిందా || ౨౬
శేషసాయినే గోవిందా |
శేషాద్రినిలయా గోవిందా |
శ్రీనివాస శ్రీ గోవిందా |
శ్రీ వేంకటేశా గోవిందా || ౨౭
గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా |
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
When did Anna prasadam distribution start in Tirumala?
Do you know how many people eat daily in Annadana Trust?
How many crores are there in Annadana Trust?
Tirumala Tirupati Devasthanam has been distributing snacks and annaprasada regularly without knowing the hunger of the devotees. This yagnam is going on without any problem even if thousands of devotees come.
Then how were the situations in Tirumala in the early days. Who will satisfy the hunger of the devotees who come to the temple in the middle of a dense forest. There are historical evidences that first many kings, emperors, swamiji have donated land for offering. But the credit for distributing Anna prasada specially for the sake of devotees goes to Tarigonda Vengamamba only.
As early as the 17th century
There are evidences that this Telugu poet who is a non-devotees of Srivari distributed Annapasada to devotees in Tirumala in 17th century. Vengamamba used to distribute Annaprasadam and arrange cooling centers for ten days in Tirumala during the Vaisakha month of the year. Statutory states that many Bhudanas performed for this sacred program from Dindigallu to Uttar Pradesh Golkonda.
Back in the day cheap meals
Three decades after Tirumala Tirupati Devasthanams were established in 1933. A canteen serving low-cost breakfast was opened. Means before 1965, this canteen was arranged in the hall where Akhanda Harinama Sankirtana is being conducted. In those days idly was 10 paise, vada 15 paise, tea, coffees 25 paise, masala dosa 40 paise, meals were sold for rupees.
Sri Venkateswara Canteen Complex was opened in a cottage in ANC area from 1970 to 1980 in the name of SVCC. Here also they used to sell food items at low prices. Later in 1971 SV Guest House was inaugurated by the then Chief Minister Sri Kasu Brahmananda Reddy on March 31, 1971 for celebrities and devotees.
TTD has a unique canteen that offers low-cost breakfast and low-cost dining facilities. From 1981 to 1984, TTD Central Canteen in RTC bus stand used to sell plate meals for Rs 75 and full meals for Rs 3.
In this order, the old Annaprasada Bhavan was inaugurated by the EO Sri PVRK Prasad on June 5th 1980. In this building they used to sell plate meals for Rs. 75, full meals for Rs. 3, and special meals for Rs. 4.50. Back then they used to sell five thousand meals a day.
As the number of devotees coming to the hill is increasing day by day, TTD has started the distribution of free Anna Prasada. In 1985, the then Chief Minister Sri NT Ramarao started the distribution of Anna Prasada. TTD has started distributing free Anna Prasada with a land donation of Rs. 10 lakh donated by a devotee named LV Ramayya.
Back then, only a limited number of free meals were available. Free food tokens were given only to the devotees who had darshan of Srivari. The number has increased to 14 thousand and 20 thousand, while only the first two thousand people were provided meals.
Sarvabhojana scheme was started in 2008, in the wake of the number of devotees reaching one lakh per day, the distribution of Annaprasada started. Tirumala Tirupati Devasthanam is in the service of devotees by continuing Srivari Annaprasada distribution free of charge to all the devotees who have come to Tirumala since then.
Annaprasada distribution in various places
In Tirumala, along with Matrusri Sri Tarigonda Vengamamba Anna Prasadam Complex, Anna Prasadas are prepared at four places. Curry, chutney, sambar, juice, buttermilk, sugar pongali will be served in Vengamamba complex. Vaikuntam Qcomplex-1,2,outside qlines,pac-2,food counters provide sambar bath,upma,pongali,pulihora.
Almost 10 to 12 tonnes of rice and 7 to 8 tonnes of vegetables are consumed every day for the preparation of Annaprasadas. Here Srivari Sevakas are providing services such as cutting vegetables, cleaning goods, providing food to pilgrims.
At present on normal days, Annaprasadas are being offered to 55 thousand to 60 thousand devotees per day. This number will reach up to one lakh during festive and rush days. There are currently 1502 crores funds in the Annadana Trust. The TTD grant came to an end as the trust achieved self-sufficiency in 2018.
TTD is asking donors to provide future vegetables grown through organic farming. On normal days, the distribution of food will be from 9 am to 11 pm at Matrishri Tarigonda Vengamamba Anna Prasada Bhavan. On the days of Brahmotsavams, Annaprasada will be distributed from morning 8 to night 11.30 On the day of Garuda sevan, food prasada will be distributed to devotees till 1 o'clock in the night.
0 Comments