Ad Code

హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి - Hanuman junction Anjaneya Swamy

హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి


విజయవాడ - ఏలూరు హైవేలో ప్రయాణం చేస్తున్నప్పుడు హనుమాన్ జంక్షన్ రాగానే మన అందరం వెతుక్కునేది ఆంజనేయ స్వామి విగ్రహం. 

అలా కారులోనో, బస్సు లో నో వెళ్తూ, ఆ విగ్రహానికి నమస్కారం చేస్తాం. 

హనుమాన్ జంక్షన్ కే ఒక ఐకాన్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం. 

అంత పేరు ఉంది ఈ విగ్రహానికి. 

కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలను సరిహద్దులో ఉంది ఈ విగ్రహం. 

స్వామి పాదాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి. 

గర్భగుడి పశ్చిమగోదావరి జిల్లాలో, మెట్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయి.

ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాలకంటే మానవ ముఖం లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. 

ఇంకో స్పెషల్ ఏంటి అంటే, నాలుగు ప్రధానమైన రోడ్డుల కూడలి కనుక, దీన్ని జంక్షన్ అని కూడా అంటారు. 

ఏలూరు రోడ్,

గుడివాడ రోడ్, 

నూజివీడు రోడ్, 

విజయవాడ రోడ్, 

ఈ నాలుగు రోడ్డులు ఇక్కడే కలుస్తాయి. 

స్వామి వారి విగ్రహాన్ని 1938వ సంవత్సరం లో ప్రతిష్టించారు.

ఈ విగ్రహం ఎవరు ప్రతిష్టించారు? హనుమాన్ జంక్షన్ కు ఆ పేరు ఎలా వచ్చింది?

పూర్వం ఈ ప్రాంతాన్ని, నూజివీడు జమిందారు శ్రీ ఎం.ఆర్ అప్పారావు గారు పరిపాలించేవారు. 

ఆయన తండ్రి, శ్రీ మేకా వెంకటాద్రి బహద్దూర్ గారు 1938వ సంవత్సరం లో, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

జమిందార్ మేకా వెంకటాద్రి బహద్దూర్ హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు.

అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయడం తో ఆహారం కోసం వెతికారు. 

ఎటుచూసిన బీడు భూములు, డొంకల, ముళ్ళు పొదలతో నిండి అక్కడ అంతా నిర్మానిష్యముగా ఉంది. 

జమిందార్ కి ఆకలి బాధ ఎక్కువ అయింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. 

హటాత్తుగా అక్కడకు ఒక కోతి వచ్చి జమిందార్ చేతి లో అరటిపండు పెట్టి అదృశ్యమైపోయింది. 

ఆకలితో ఉన్న జమిందార్ ఆ పండును భుజించగానే అతనికి ఎంతో శక్తి వచ్చినట్లయింది.

సాక్షాత్తు ఆంజనేయుడే కోతి రూపంలో వచ్చి అరటిపండు ను ఇచ్చి వెళ్ళాడని గ్రహించి, 

భక్తపారవశ్యం తో తన్మయత్వం చెంది శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అక్కడ ప్రతిష్టించాలని భావించారు. భక్తులను దుష్టగ్రహ పిడముల బారి నుండి రక్షించే నిమిత్తం ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహాన్నితయారు చేయించి నాలుగు రోడ్ల కూడలి అయిన హనుమాన్ జంక్షన్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

అనాడు దండకారణ్యం లో శ్రీ రాముడికి ఆకలివేయగా, ఆంజనేయస్వామి వచ్చి అరటి పండు ఇచ్చి స్వామి ఆకలి తీర్చాడు. 

అదే విధంగా ఈ జంక్షన్ లో ఆంజనేయ స్వామి "రామా, ఆగు ఇవిగో అరటిపండ్లు" అంటున్నట్లుగా ఉన్న ఆంజనేయ విగ్రహన్ని, ఆంజనేయస్వామి గుడి ఎదురుగా రోడ్డు అవతల రామాలయాన్ని నిర్మించారు.


జై శ్రీరామ్

జై హనుమాన్ 

సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ



Hanuman junction Anjaneya Swamy

While traveling in Vijayawada-Eluru highway, as soon as Hanuman junction comes Anjaneya Swamy statue is what we all are searching for.

Going by car or bus like that

We will salute that idol.

This Anjaneya Swamy statue is an icon for Hanuman junction.

This statue has so much name.

This statue is located in the border of Krishna district and West Godavari districts.

Swamy feet are bordering West Godavari and Krishna districts.

Garbhagudi in West Godavari district,

The steps are in Krishna district.

In Anjaneya Swamy's statue, human face features are more visible than monkey characteristics.

Another special thing is,

As the four major roads are conjoined,

This is also known as a junction.

Eluru road,

Gudivada Road,

Nuziveedu Road,

Vijayawada Road,

These four roads meet here.

Swamy's statue was installed in the year 1938.

Who installed this statue ?

How did Hanuman junction get that name?

Formerly this area, Nuziveedu was the landowner Sri M. R Apparao garu used to rule.

His father, Sri Meka Venkatadri Bahadur garu in the year 1938,

Anjaneya swamy statue was installed here.

Jamindar Meka Venkatadri Bahadur visits Hanuman junction area.

Then he was so hungry and searched for food.

Wherever you see, there are full of Beedu lands, Donkala, Thorny bushes, everything is destructed there.

Landlord's hunger has increased.

Meanwhile a miracle has happened.

Suddenly a monkey came there and put a banana in the hands of the landlord and disappeared.

The hungry lander seems to have gained a lot of energy after eating the fruit.

Realizing that Anjaneya himself came in the form of a monkey and gave a banana and left,

It was thought that the idol of Sri Anjaneya Swamy should be installed there with devotional devotion. Anjaneya Swamy made a vertical statue and installed at Hanuman Junction, which is a four-road intersection to protect the devotees from evil insects.

On that day in Dandakaranyam, when Sri Ram was hungry, Anjaneya Swamy came and gave him banana and satisfied his hunger.

Similarly in this junction Anjaneya Swamy "Rama. Anjaneya statue is like saying "Wait, here are the bananas".

In front of Anjaneya Swamy temple, a Ramalayam was built on the road. Victory to Sriram!

May the whole world be happy!

Victory to Hanuman






Post a Comment

0 Comments