సర్వరోగాస్త్రానికి విరుగుడు నమత్రేయాస్త్రం
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయనమః,
శ్రీ గోవిందాయనమః
ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు.
వీటిలో అనేకరకాలు
వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు.
ఆ రోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు.
దానిపేరు సర్వారోగాస్త్రం.
దీనికి విరిగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం.
కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది.
దానిపేరు నామత్రేయాస్త్రం.
నామత్రయం అంటే మూడు నామాలు.
అవి:
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయ నమః,
శ్రీ గోవిందాయ నమః
ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి, కలి ప్రేరితమైన రోగాలు రావు.
జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి.
ఈ నామాలు ఒక దివ్యౌషధం మీరు స్మరించండి.
అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ:
సాధు పరిత్రాణం కొరకుా,
దుష్టవినాశం కొరకుా,
ధర్మసంస్థాపన కొరకుా
పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తుా ఉంటానని చెప్పాడు.
భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది.
అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి.
అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు
అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.
సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా
ఓం అచ్యుతాయ నమః,
ఓం అనంతాయ నమః,
ఓం గోవిందాయ నమః
అని ఆచమించి ఆరంభిస్తాం.
క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేదవైద్య విద్యకు రాయనే ప్రధమ స్థానం.
అచ్యుతానంత గోవింద
నామెాచ్ఛారణ భేషజాత్
నశ్యంతి సకలారోగాః
సత్యం సత్యం వదామ్యహ!
ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి.
ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను".
ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా
శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట.
వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే
ఇంకొక ప్రమాణం అవసరమా" !
ఇది పరమ ప్రమాణం.
పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది.
పార్వతీదేవి అడుగగా శంకరులవారు శ్రీమన్నారయణుని లీలలను వివరిస్తుా, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు.
పార్వతీ పాలకడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతింస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.
ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు.
పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని
నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను.
అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించ సాగారు.
అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని
అచ్యుత, అనంత, గోవింద .
అన్న మహా ముాడు మంత్రాల్ని స్మరించుకుంటుా
ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని యెుక్క ఆ నామత్రయం యెుక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను.
ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది.
కనుక ఈ మంత్రములతో ఆచమించేటపుడు ఈ మహిమంతా జ్ఞాపకముంచుకుని,
విశ్వాసం పెంచుకుని అందరుా భగవత్ కృపకు పాత్రులగుదురు గాక!
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
Namatreyaastra is the antidote to all diseases
Sri Achyuthaya Namaha,
Sri Ananthayanama,
Sri Govindayanama
In this Kaliyuga, Kalipurushudu will attack us in many forms.
So many different ones of these..
Creates a lot of diseases especially physically.
He will turn all those diseases into a weapon.
It's called a universal weapon.
The solution to this is going to any major hospital as far as we know and losing thousands and millions.
But in our science, Lalitamata has created a weapon against this weapon.
It's name is my weapon.
Namathrayam means three names.
Those are the ones..
Sri Achyuthaya Namaha,
Sri Ananthaya Namaha,
Sri Govindaya Namaha
For those who read these three names daily
Kali induced diseases will not come
If there are any diseases, they will be cured in the near future.
These names are divine medicine, you should remember them.
Wonderful glory in the names Achyuta, Anantha, Govinda:-
For the sake of saint's transformation,
For the sake of destruction,
For the sake of establishing dharma
God has said that he will be incarnated in this world.
Bhagavannamala has many wonderful powers. There's a wonder of glory.
That's why some names are so special.
The most special names among the most special names
Achyuta, Anantha, Govinda are there.
Any Vaidika karma is done starting from the evening
Om Achyutaya Namaha,
Om Ananthaya Namaha,
Om Govindaya Namaha
Let's start by starting with that.
Sri Dhanvantari is the great man who has incarnated during the Ksheerarnava Madhana. Writing is in the first place for Ayurvedic medical education.
Achyuthanantha Govinda
The name chanting is Bheshajat
Nasyanthi Sakalaro ga
Truth is truth!
All diseases will be destroyed by chanting these names.
"It's the truth, I'm telling the truth".
By saying the truth twice like this
Sri Dhanvantari has said this after swearing in.
More than the verses of the rich medical teacher Dhanvantari
Do we need another oath " !.
This is the ultimate oath.
The glory of this name is greatly described in Padmapuranam.
Shankar's people explained the actions of Srimannarayana and on the occasion of Kurmavatara, I will tell the story of Ksheera Sagaramadhana on the occasion of Karmavatara.
Parvathi! Goddess Lakshmi incarnate in the milky sea. Goddesses and ancestors praising Lakshmi Narayana. And on that occasion, a terrible commotion emerged from the Milky Way.
Seeing that noise, the gods and the gods got scared and ran away towards their heads.
Stop the fleeing gods and demons, tell them not to be afraid, that time lapse
I dare you to blink.
All went to my feet and worshiped me.
At that time, I meditated on Srimannarayana who is the most sorrowful, and recited his names
Achyutha, Anantha, Govinda
Remembering Anna Maha Mudu Mantras
Drank that deadly poison of time. Lord Vishnu who is omnipresent
I drank that poison which is the killer of the whole world because of the glory of that name.
That poison ain’t got me no good
So while practicing with these spells
Remembering all this glory,
By increasing the confidence, everyone should be the characters of Bhagavath's grace!
0 Comments