దీపావళి రోజున మహాలక్ష్మీ పూజా వైశిష్ట్యం
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే పర్వదినాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వీయుజ మాస బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశిగాను, అమావాస్యను దీపావళిగా ఘనంగా జరుపుకుంటున్నారు. నరకాసురుడు అనే రాక్షసుడి నుంచి దేవతలకు విముక్తి లభించిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ. దీపావళి రోజున దీపాలంకరణలు చేసి బాణసంచా కాల్చడం ఆనవాయితీ.
"దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వకమోపహమ్
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప న్నమోస్తుతే"
జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అందుకే దీపావళి రోజున మహాలక్ష్మీ పూజ చేసి గృహాల్లో దీపాలను అలంకరించుకుంటారు.
దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడాని ఓ విశిష్టత ఉంది. అదేమిటో తెలుసా? పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడైన ఇంద్రుని ఆతిథ్యానికి పరవశించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ఇంద్రునికి ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కరించే రీతిలో, తన వద్ద నున్న ఐరావతమైన ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కి వేస్తుంది. దానిని చూసిన దుర్వాస మహర్షి కోపగ్రస్థుడై దేవేంద్రునిని సర్వసంపదలు కోల్పోదువుగాక అని శపిస్తాడు.
దుర్వాస మహర్షి శాపానికి గురైన ఇంద్రుడు రాజ్యం, సంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ స్థితిని గమనించిన శ్రీహరి దేవేంద్రుని ఓ జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు.
దేవేంద్రుని పూజకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి దేవేంద్రుని అనుగ్రహించి దుర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి కలిగిస్తుంది. శ్రీహరికి ధర్మపత్నిగానే కాకుండా నన్ను కొలిచే భక్తులకు అష్టలక్ష్మీ దేవిగా అనుగ్రహిస్తానని తెలుపుతుంది.
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
Mahalakshmi Pooja speciality on Diwali
In the festival days that mirror Indian culture Deepavali is the most glorious festival to celebrate. Naraka Chaturdashi and Amavasya are being celebrated grandly as Deepavali on the occasion of Ashwiyuja month Bahula Chaturdashi. Expressing happiness on the release of the goddesses from the demon called Narakasurudu. On the day of Diwali, it is illegal to do lamp decorations and fire crackers.
Lamp is the light of the lamp, the lamp of the Lord Brahma is the universal light.
Everything is possible with the lamp. If the lamp is done in the evening."
Jyothi is considered as Parabrahma as an example of mental development, happiness and good quality wealth. That is why on the day of Diwali, Mahalakshmi Pooja is done and decorated with lamps in houses.
There is a peculiarity of celebrating Mahalakshmi pooja on the day of Diwali. Do you know what it is? Former Durvasa Maharshi once hosted Indru the Devendra and bestowed a glorious garland to Indru. In a way that Indra rejected it, he put the steamy elephant on his neck. She stamped that necklace with her foot. Seeing that Durvasa Maharshi angrily curses Devendra for losing all his wealth.
Indrudu who was cursed by Durvasa Maharshi, will pray to Sri Hari by losing his kingdom and wealth. After observing this situation, Sri Hari Devendra suggests to light a lamp and worship it in the form of Mahalakshmi.
Lakshmi Devi satisfied with Devendra pooja will bless Devendra and free her from the curse of Durvasa Maharshi. Not only as Dharmapatni to Sri Hari, but also to the devotees who measure me as Ashtalakshmi Devi, she says that she will bless me.
0 Comments