Ad Code

ఆశ్వయుజ బహుళ చతుర్థశి - నరకచతుర్దశి - Aashwayuja Multiple Chaturthi - NarakaChaturdashi

ఆశ్వయుజ బహుళ చతుర్థశి - నరకచతుర్దశి



ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః

నరక భావాలు అంటే దుర్భావాలను, కృష్ణభక్తి అనే చక్రాయుధంతో ఖండింప చేసి, జీవుడు భవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది ఇందులోని అంతరార్ధం.

నరకుడు భూదేవి కొడుకు.

హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్ట చుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు.

ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు.

అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. 

నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు.

తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు.

స్వయాన తన తల్లే తనను చంపదని అతని ధీమా. 

విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు.

దేవమాత అదితి కర్ణాభరణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వందయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు.

వీరూ వారను విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇతనికొక వ్యసనం.

ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీకృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు.

అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు.

అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది.

యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే.

ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు సంభవించింది.

తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు.

నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేల మంది రాజకన్యలు విడిపించబడ్డారు.

ధ్రర్మం సుప్రతిష్టమైంది.

నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు.

కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.

ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. 

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది.

కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం.

ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు.

కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.

దీపావళిపండుగ జీవితాలలో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే పండుగ. అటువంటి దీపావళి పండుగను హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు.

భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళికి ఒక విశేషమైన స్థానం ఉంది.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి

ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలోదీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, అంధకారాన్ని తొలగించి వెలుగులను తీసుకువచ్చే సంకేతంగా భావిస్తారు. దీపావళి నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దీవాలి అని , దీపావళి అని పిలుస్తారు. దీపావళి పండుగనాడు అందరూ ఇల్లంతా దీపాలను వెలిగించి సంపదకు, అదృష్టానికి, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.

దీపావళికి ఇంట్లోకి సానుకూల శక్తి ఆహ్వానం

దీపావళి పండుగకు ముందు ఇల్లంతా శుభ్రం చేసి ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులను బయటకు పంపి, సానుకూల శక్తిని ఇంటిలోకి ఆహ్వానించి ఆపై ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆపై లక్ష్మీ దేవిని విశేషంగా పూజిస్తారు. దీపావళి పండుగ అంటేనే సరదా పండుగ. కుటుంబ సభ్యులందరూ కలిసి, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకునే పండుగ. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. బాణాసంచా ప్రకాశాలతో, దీపాల వెలుగులతోఅందరూ సుఖ సంతోషాలతో జీవించాలని జరుపుకునే పండుగ.

అక్టోబర్ 24వ తేదీన దీపావళి పండుగ.

అటువంటి దీపావళి పండుగ ఈ సంవత్సరం 24వ తేదీ సోమవారం నాడే జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాల నుండి అమావాస్య మొదలవుతుందని ఇక మంగళవారం సాయంత్రం అమావాస్య ఘడియలు పూర్తవుతున్నాయి అని చెబుతున్నారు. అయితే ఈసారి దీపావళి పండుగ మొదటి 25వ తేదీగా భావించిన క్రమంలో ఆ రోజు సూర్య గ్రహణం రావడంతో గ్రహణం నాడు పండుగ జరుపుకోకూడదని, అందుకే 24 వ తేదీ సోమవారం పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇక సోమవారం నాడు సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకోవడానికి అనువైనదిగా చెబుతున్నారు.

ప్రదోష కాలంలోనే దీపావళి పూజ లక్ష్మీ పూజతో ఐశ్వర్యం

అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం లక్ష్మీపూజ మరియు గణేశ పూజనిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు. దృక్ పంచాంగ్ ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత దీపావళి పూజప్రదోష కాలంలోనే నిర్వహిస్తారు.ఆ సమయంలో పూజ చేస్తేనే శుభాలు కలుగుతాయని పంచాంగం చెబుతోంది.



సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ


Aashwayuja Multiple Chaturthi - NarakaChaturdashi


Om Sri Mahalakshmi Devi Namaha

The meaning in this is that the feelings of hell are to be condemned with the chakra weapon of Lord Krishna and to be happy with the attainment of Bhavadarshan.

Narakudu is the son of Bhudevi.

When Hiranyaksha wrapped the Bhudevi in the sea as a threat to the world, Vishnu Murthy raised the Varaha Avatar, killed the demon and raised the Bhudevi.

On that occasion, due to Vishnu Murthy's gift offering to Bhudevi, a son named Bhimudan was born.

He himself is the evil bastard.

Narakudu was under the influence of Asura and got many blessings by performing penance.

He also got a boon that he should not die except in the hands of his mother.

His confidence is that his own mother will not kill him.

He tortured the gods by hating Vishnu.

When devamata aditi's Karnabharana and Varuna chatra were kidnapped, Sri Krishna defeated him in a duel and handed them back to aditi.

It is his addiction that these people are forcibly abducting Gandharva, Deva, human virgins and keeping them in their inner city cage.

Gopaludu attacked Narakuni under the shelter of Sri Krishna, the savior of Indrudu from danger.

But for a moment SriKrishna was subdued by Narakasuru's poisonous arrow.

Noticed that, his wife Satyabhama, who was also with him, killed her with her fierce arrow.

Coincidentally, Narakasu's death in the form of Satyabhama in the hands of his mother Bhudevi...

Ashwayuja multiple quadurdashinadu has occurred.

As Satyabhama prays to make his son's name remain forever, Sri Krishna gives a boon that day he will be called as Naraka Chaturthi.

Sadhus and sixteen thousand Rajakanyas were freed from the foothills of Narakuni.

Dharma has prevailed.

People will celebrate on the next day with the happiness that Narakasuru's nightmare is over. As Amavasya is the day of this celebration, people lit toras with lamps and celebrated by lighting fireworks to avoid darkness.

Same Diwali has become a festival in the timeline.

Indians believe that those who light lamps and do charity work on this Chaturdasi evening will be relieved of hell for their paternal gods.

On the night of Ashwayuja Bahula Chaturdasi, in the second jam, Narakasura massacre took place.

So, in the third jam, the fear of hell will be over for those who take abhyam bath.

It is said that Lakshmi Devi in oil and Ganga Devi in water on this Chaturdashinadu.

Therefore, it is better to take bath before sunrise in Naraka Chaturdashinadu. It is auspicious to do lamp worship in the temple of God or any temple in the evening.

Diwali festival The festival that removes the darkness of life and fills the light. Hindus celebrate such Diwali in a very auspicious way.

Diwali has a special place among the festivals celebrated most pious and fondly by Indians.

Diwali is the symbol of the victory of good over evil

Deepavali festival will be celebrated in the side of Krishna in the month of Ashwayuja. Diwali is considered to symbolize the victory of good over evil, removing darkness and bringing in light. Diwali is a festival that symbolizes the victory of hope over disappointment. Deepavali means row of lamps. This is called as Diwali and Deepavali. On the occasion of Diwali, everyone lights lamps throughout the house and worship Lakshmi Devi in a special way, the symbol of wealth, luck and prosperity.

Invitation of positive energy into the house on the occasion of Diwali

Before Diwali, the whole house is cleaned and sent out negative energies in the house, inviting positive energy into the home and then celebrate the festival grandly. Then Goddess Lakshmi will be worshipped in a special way. Deepavali festival means fun festival. The festival where all the family members get together and celebrate happily with relatives and friends. Deepavali means festival of lights. This festival is to celebrate that everyone should live happily with fireworks and lighting of lamps.

Diwali festival on 24th October.

Pandits suggest that such Diwali festival should be celebrated on Monday 24th of this year. It is said that the new moon will start from 4:15 pm on Monday and the new moon will end on Tuesday evening. However, this time Diwali festival is thought to be on the first 25th, as there is solar eclipse on that day, it is suggested that the festival should not be celebrated on Monday the 24th. It is said that it is suitable to worship Lakshmi on Monday evening.

Deepavali pooja during Pradosa period itself Auspiciousness with Lakshmi pooja

Pandits say that Lakshmi Pooja and Ganesha Puja should be performed on the evening of October 24th. According to Druk Panchang, Diwali pooja pradosa is performed after sunset. Panchangam says that good things will happen only if you do pooja at that time.





Post a Comment

0 Comments