Ad Code

పూజ - జప నియమాలు - Prayer - Chanting Rules

పూజ  - జప నియమాలు


పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.

నేతి దీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.

ఎడమ చేతితో ఉద్ధరిణె నీళ్ళు తీసుకొని కుడిచేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి.

ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మీసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.

గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకును ఎట్టి పరిస్థితులలోనూ నేలపై ఉంచరాదు.

పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు.

పూజలో వీలైనంతవరకు ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది.

తూర్పు, ఉత్తర దిక్కుల అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది.

ఒంటి చేయిచాచి తీర్థాన్ని స్వీకరించరాదు. చేతిక్రింద వస్త్రాన్నుంచుకొని, శ్రద్ధగా స్వీకరించాలి. వస్త్రం లేని పక్షంలో చేతికింద చేతినుంచాలి. సాధ్యమైనంతవరకు నిలబడి తీర్థ ప్రసాదాలను స్వీకరించరాదు. తీర్థం స్వీకరించేటప్పుడు చప్పుడు కాకుండా చూసుకోవాలి. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని తలపై రాసుకోరాదు.

పూజలకు, జపానికి వినియోగించే ఆసనం అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీయాలి. ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు.

జపం చేసేటప్పుడు మాల మధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం కూడనివి.

నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపులా కొసలకు పసుపుపెట్టి ఇవ్వాలి.

అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి, ముగ్గుపెట్టి అన్న పాత్రను ఉంచాలి.

వట్టి నేలపై కూర్చొని జపించరాదు. పూజించరాదు. భుజించరాదు.

"పూజ" అంటే "భోగములను ప్రసాదించునది" అని అర్థం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతా శక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు.

మనం పలికే స్తోత్రశబ్దాలు, దీప, ధూపాలు, కుసుమాు దేవతలకు ప్రీతికరాలు. శుచిప్రియులు దేవతలు. అందుే శుచి, శుభ్రత పూజాజప ప్రాంతాలలో ఉండాలి.

బహిష్ఠు స్త్రీలు మసలే చోట, వారి దృష్టిపడే చోట దేవతా పూజ, అనుష్ఠానం, దీపారాధన జరుగరాదు. మనకు తెలియని సూక్ష్మజగత్తులో ఆ స్థితిలో చాలా దుష్ప్రకంపనలు జరుగుతాయి.
ఈ నియమాలు వేదాలలో కూడా చెప్పబడ్డాయి.


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ






Prayer - Chanting Rules

Pooja materials should be in our right hand side.

The lamp of the head should be placed at the right side of God. If oil is a lamp, it should be on the left side of God.

Take the boiling water from left hand and pour it in right hand and do the practice.

No sound when walking. That water will not hit the mustache and beard.

The bell should be offered with flower and then wither. But bell, conch and palm leaf should not be kept on the ground under any circumstances.

Flowers should not be worshipped by spreading their wings.

It is better not to use left hand as much as possible during puja

It is good to worship and perform rituals facing east-north directions.

Pilgrimage should not be accepted single handedly. Should be undressed and taken with care. Hands down on the side of no cloth. As far as possible, one should not accept theertha prasadas. While taking the pilgrimage, make sure that there is no sound. After taking the pilgrimage, that hand should not be rubbed on the head.

The asana that is used for pujas and japa has to be taken by everyone after the program. If someone else takes away one's asana, their japa fruit will infect them. Wife can take the asana used by husband.

Do not stop in the middle of the garland while chanting. The talking and the sighs are done.

When giving new clothes to someone, the clothes should be given yellow on the four sides.

When Anna is reporting, he has to report cleanly cooked Anna Anna. A vessel should be kept on wiping with water and covering the floor.

You should not pray sitting on the floor. Should not be worshipped. Should not be eaten.

'Pooja' means "offering pleasures". By understanding the rituals used during the pooja, the divine powers will bless us with happiness.

The hymns that we recite, lamp, incense, kusumu are likelihood to the goddesses. Pure lovers are goddesses. That is why cleanliness and cleanliness should be in the places of worship.

Where foreign women are masquerading, where they are focused, goddess puja, ritual, lamp worship should not happen. There are many side vibrations happening in that state in a micro universe that we don't know. These rules are also mentioned in the Vedas.






Post a Comment

0 Comments