Ad Code

ఆడవాళ్లు ఏ నియమాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది

ఆడవాళ్లు ఏ నియమాలు పాటిస్తే
ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది



ఆడవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఏ పని చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందో మనం తెలుసుకుందాం. అసలు ఇంట్లో స్త్రీలు అంటేనే లక్ష్మీస్వరూపం.

ఆడవాళ్లు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. రోజు రాత్రిపూట ఆడవాళ్లు నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా అన్నం ముద్దను ఉంచాలి. మర్నాడు ఉదయం ఆ అన్నాన్ని మూగజీవులకు ఆహారంగా వేయాలి.

ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇలా రోజు చేయడం వీలుకాకపోతే కనీసం శుక్రవారం రోజు రాత్రి పూట అయినా సరే ఆడవారు గిన్నెలన్నీ కడుక్కొని సర్దుకున్న తర్వాత ఒక గిన్నెలో అన్నం కొద్దిగా ఉంచి మూత పెట్టి నిద్రపోవాలి, మర్నాడు అంటే శనివారం ఉదయం పూట ఆ అన్నాన్ని మూగజీవులకు కుక్కలకు ఆహారంగా వేయాలి. దీనికి కారణం ఏమిటంటే శుక్రవారం రాత్రి పూట పితృదేవతలు అదృశ్య రూపంలో ఇంట్లోకి వస్తారు వారికి అన్నం కనిపించాలి. అలా కనిపిస్తే ఇంట్లో వాళ్లనే అనుగ్రహిస్తారు అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే ఆడవారు రోజు కాకపోయినా కనీసం శుక్రవారం రాత్రిపూట అయినా సరే ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత గిన్నెలో కొద్దిగా అన్నం ఉంచాలి, మర్నాడు శనివారం మూగజీవులకు దాన్ని ఆహారంగా వేయాలి.

ఇలా చేస్తే పితృ దోషాలు పోతాయి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే ఆడవారు రాత్రిపూట గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోకూడదు, ఇలా చేసినట్లయితే లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది. వంట గదిలో బొద్దింకలు తిరిగితే జేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి, బొద్దింక తిరిగితే మాత్రం జేష్ట దేవి ఇంట్లోకి వస్తుంది అలాగే ఆడవారు తప్పకుండా పాటించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే పాత్రల మీద మూతలు ఉంచాలి.

చాలామంది ఆడవారు వంట చేశాక పాత్రల మీద మూతలు ఉంచారు మూతలు కచ్చితంగా పెట్టాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ఆడవారు కాళ్లు అటు ఇటు కదిలిస్తూ ఉండకూడదు కూర్చున్నప్పుడు కాళ్లు అటు ఇటు ఊపుతూ ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. ఇంట్లో మగవాళ్లు మంగళవారం రోజు గడ్డం గీసుకోకుండా, ఆడవారు చూసుకోవాలి. పిల్లలు కానీ భర్తగానే మంగళవారం గడ్డం గీసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలా గడ్డం గీసుకోకుండా ఆడవారు జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా సరే కొబ్బరికాయను పుట్టినప్పుడు ఆ కొబ్బరికాయ తాంబూలంలో ఎదుటి వారికి ఇచ్చేటప్పుడు ఆ కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ కళ్ళు ఉన్న భాగం మీరు ఉంచుకోవాలి.

మిగిలిన చిప్ప వేరేవారికి ఇవ్వాలి. చాలామంది ఆడవారు ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉన్నటువంటి చిప్పను ఎదుటివారికి ఇచ్చేస్తూ ఉంటారు అలా ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఎప్పుడు కూడా ఆడవారు కొబ్బరి చిప్పకు మూడు కళ్ళు ఉన్న చిప్పను మీరు ఉంచుకోవాలి మరొక చిప్పను వేరే వారికి ఇవ్వాలి అప్పుడు లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే ఆడవారు రోజు స్నానం చేసిన తర్వాత ఎర్రటి కుంకుమ తీసుకుని ఇంటి మెయిన్ డోర్ మీద స్వస్తిక్ గుర్తు వేయండి అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది.


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ






Post a Comment

0 Comments