జంధ్యాల పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ ప్రాశస్త్యం
శ్రావణ పూర్ణిమను "జంధ్యాల పూర్ణిమ" అని కూడా అంటారు. ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి, జప, అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతము అనే పదము "యజ్ఞము" "ఉపవీతము" అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే "యాగము" "ఉపవీతము" అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే "యాగకర్మ చేత పునీతమైన దారము" అని అర్థము.
యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి.
యజ్ఞోపవీతాననే జంధ్యమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు.
శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి. ఇది వేదాధ్యయానికి సంబంధించినది. ప్రాచీన సంస్కృత నిఘంటువైన "అమరకోశాన్ని" రచించిన అమరసింహుడు "సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శ్రుతేః" అన్నాడు. సంస్కారం అంటే ఉపనయనం, వేదాన్ని అధ్యయనం చేయడం "ఉపాకరణం". సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ.
మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి. సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాటవాలను, జ్ఞానాన్ని ఉపదేశించి ఉపదేశిస్తాడు. ఉపనయన సంస్కారం పొందినవారిని "ద్విజుల" అని అంటారు. ఉపనయన సందర్భంలోనే యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఎడమ భుజంపైనుండి ధరిస్తారు కాబట్టి దీనిని ఉపవీతమంటారని అమరకోశం చెబుతుంది. ఉపనయనం చేసుకుని జంధ్యాన్ని వేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు, గాయత్రీపూజ చేయుటకు, ఇతర పూజలు చేయుచుటకు అర్హుడవుతాడు. యజ్ఞోపవీత ధారణకు అర్హులైనవారందరూ ఈ రోజు పాత జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) ధరించవలెను. "సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్ తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి సృతమ్" బ్రహ్మతత్వాన్ని సూచించడానికి, వేద తత్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే ఉపవీతము అంటే రక్షణ వస్త్రం. యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. అందుకే ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినవారు అని, ఒకటి అమ్మ కడుపునుంచి పుట్టడం జన్మ అయితే, ఈ గాయత్రి దేవిని ఉపాసించి యజ్ఞోపవీతం ధరిండం ఆ తల్లి అనుగ్రహం పొందడం రెండవ జన్మ అన్నమాట.
ఋగ్వేదులైనవారు శ్రావణమాసంలో ఏ రోజు శ్రవణా నక్షత్రం ఉంటుందో ఆ రోజే ఆచరించాలి. "యజుర్వేదులకు పౌర్ణమి ప్రధానం. వారు పౌర్ణమినాడు దీన్ని ఆచరిస్తారు. సామవేదులు మాత్రం హస్తా నక్షత్రము" రోజున ఆచరించవలసి వుంటుంది. ఇలా ఆయా వేదాలు వారు వారికి నియమించిన తిథి నక్షత్రాలను బట్టి ఉపాకర్మను ఆచరిస్తారు. ఆదిదేవుడు, సర్వమంగళా (పార్వతీ)పతి, సర్వమంగళ కారకుడైన శివుడు కూడా మంగళం కలిగేందుకు ఉపవీతాన్ని ధరిస్తాడని యజుర్వేదంలోని "నమో హరి కేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః" అనే మంత్రం మనకు చెబుతోంది. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని, యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో అనగా తొమ్మిది దారపు పోగులతో నిర్మించాలని, ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం. మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులవో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలూ ఉంటారు.
యజ్ఞోపవీతం తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని వశిష్ఠస్మృతి ప్రమాణంగా తెలియజేసింది. నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించారు. ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే తొంభై ఆరు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్ని, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను, ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. బాలురకు ఒంటి ముడి వున్న అంటే మూడు పోగుల జంధ్యాన్ని ధరింపజేస్తారు. ఈ మూడు పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు.
బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమినాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. పూర్వం వేదాధ్యయనాన్ని ప్రారంభ దినంగా శ్రావణ పూర్ణిమను పరిగణించేవారు. వేద విద్యార్థులు, అధ్యాపకులు, గృహస్థులు నిత్య కర్మలు ముగించుకుని గాయత్రీ జపాలు చేస్తారు. ఈ రోజున తప్పనిసరిగా నూతన యజ్ఞోపవీతాలను ధరించాలి. "జంధ్యాల పౌర్ణమిగా శ్రావణ పూర్ణిమ" అలా ప్రసిద్ధి చెందింది.
ఈ రోజున మంత్రదష్టలైన సప్తఋషులను పూజించాలి. జంధ్యంలోని బ్రహ్మముడులను అరచేతిలో ఉంచుకుని గాయత్రీ జపం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఉపాకర్మలోని విశేషం ఇది. ఇంతటి మహిమాన్వితమైన యజ్ఞోపవీతాన్ని మొట్టమొదటగా బ్రహ్మ తయారుచేశాడంటారు. అలా బ్రహ్మ తయారుచేసిన జంధ్యాన్ని శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టాడని, లయకారుకుడు సకల శుభకరుడైన రుద్రుడు ముడివేశాడని అంటారు. ఆ తర్వాత సకల సౌభాగ్యదాయిని, సకల జ్ఞానరాశి అయిన సావిత్రీదేవి అభిమంత్రించింది. దానివల్లనే ఈ యజ్ఞోపవీతానికి అంతటి పవిత్రత చేకూరింది.
యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ముందు ఆచమనం, సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత యజ్ఞోపవీతాన్ని పూజించాలి. ఆ తర్వాత రెండు చేతుల యొక్క బొటనవ్రేళ్లతోనూ, యజ్ఞోపవీతాన్ని చేసుకుని "యజ్ఞోపవీతం పరమం పవిత్రం" అనే శ్లోకాన్ని పఠించి, మొదటి కుడిచేయి ఉంచి ముడి ముందుగా వచ్చునట్లుగా ధరించాలి. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత (జిగి) యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి.
అశౌచాలవల్ల, ఆప్తుల జనన మరణ సమయంలో, గ్రహణం పట్టి వదిలిన తర్వాత ఇతర అమంగళాలు కల్గిన సందర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.
ఉపాకర్మ సందేశం:
ఉపాకర్మ సామూహికంగా ఆచరించే కర్మ. అన్ని రోజులలో ఎవరి కార్యక్రమాలలో హడావుడిగా వుంటారు. ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అందరూ ఒకచోట చేరి సామూహికంగా, పూజాదులు నిర్వహించడంవల్ల సమిష్టితత్వం పెరుగుతుంది. నదీతీరాలలో ఆచరించే స్నానాదులవల్ల నదులను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన పెంపొందుతుంది. శారీరక, మానసిక పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమ్ దివ్యౌషధమని పెద్దలు చెబుతారు.
Jandhyala Purnima, Sravana Purnima premises
Sravana Purnima is also known as Jandhyala Purnima On this day, they will perform new yajnopavita and chants and archanads. The word Yajnopaveetam is formed by the combination of the two words "Yagna" "Upaveetamu" Yagna means "Yagamu" "Upaveetamu" means Daramu. Yajnopaveetam means the path that is blessed by Yagakarma.
Yajnopaveetam is the symbol of Gayatri Devi. Vedokti says that the most sacred yajnopavita dharana will develop knowledge and the result of practicing yagna will come. Yajnopaveetan is called Jandhyam and Brahma Sutrama.
Upakarma special fate on the day of Sravana Pournami. It's about the Vedas. Amarasimhu who wrote an ancient Sanskrit dictionary "Amarakoshani" said Pre-Sanskara eclipse is the svadupakaranam sruthe Culture means upanayana, studying vedas is 'upakaranam'. To do vedas with culture is upakarma.
Uponayana is one of the sacraments that the Maharshis have imposed to us. This is the most important of all culture. Through the upanayana, the teacher teaches his student the talent and knowledge. Those who have received Upanayana rituals are called as Dwijula Yajnopavita will be worn on the occasion of Upanayana. Amarakosham says this is called upavita because it is worn from the left shoulder. The person who has done upanayana and has worn Jandhyan is eligible to do trikala evening salutations, Gayatri pooja and other pooja. All those who are eligible to wear Yajnopavita should remove the old birth today and wear the new birth (Yajnopaveetam). 'Suchanath Brahmatattvasya Vedatattvasya Suchanath Tatsutramupavitatvat Brahma Sutramiti Sutam' Dharma Sastra says to wear Brahmasutra (Yajnopavita) to indicate Brahmatatatatva, to indicate Veda philosophy. That's what fasting means protection cloth. Memories say that Yajnopavita and Shikhan should be worn. That is why two people are born with two births, if one is born from mother's womb, then worship this Gayatri Devi and wear Yajnopavitam and get the blessings of that mother is second birth.
Rigvedas have to observe the day of Shravana star in the month of Sravana. Full moon is important for Yajurvedas. They're full moon and will celebrate this. Samvedas have to follow Hasta Nakshatram on the day. This is how the Aya Vedas will follow the Upakarma based on the date stars appointed to them. "Namo Hari Keshayopavitine Pushtanam Pataye Namaha" in Yajurveda tells us that Adi Deva, Sarvamangala (Parvati) Pathi, Lord Shiva who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the Yajnopaveetam is the most sacred. It is a story of memories that it was born with Prajapati Brahma, that the Yajnopavita should be built with the new rituals, that is, with nine threads, every single mother has a goddess. Onkaram in the first tantuvu, in the second tantu, fire god in the third, Naga goddess in the third, Somadevata in the fourth, Father in the fifth, Sixth pillar Brahma in the sixth, Seventh tantu is the air God, Sun in the eighth tantu, and the rest of the gods in the ninth.
Vasishthasmruti has said that the yajnopaveetam should be with ninety-five sizes. Gayatri Mantra was taught in 24 letters in all four Vedas. For the number of letters in that mantra, it is advised to build and wear the yajnopavita as ninety-six tits. The bachelor should wear one yajnopavita, the housewife should wear two yajnopavitas, as an alternative to the north, in addition to another yajnopavita. If the boys have a single raw, they will be made to wear three pogula jandhyan. These three pogus will be called as a symbol for Brahma, Vishnu and Maheshwar.
Brahmachars will start Vedadhyayana wearing new yajnopavita on Sravana Pournami. They used to consider Sravana Purnima as the inauguration day of Vedadhyayana. Veda students, teachers, housewives finish their daily karma and perform Gayatri Japas. Must wear new yajnas on this day. Sravana Purnima as Jandhyala Pournima is famous like that.
On this day we should worship the mantradasta saptaishu. If you keep the Brahmamudus in your hands and chant Gayatri, all the good things will be done. This is the speciality in upakarma It is said that Brahma has first created such a glorious Yajnopavita. It is said that Srimannarayana has kept the Jandhyan made by Brahma, and the Layakaarukudu has covered all the good people. After that, Savitri Devi, who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the That's why this yajnopavita has been so sacred.
Before wearing Yajnopavita, you have to tell your determination and determination. Then you have to worship the Yajnopavita. After that, with the toes of both hands, you should make a sacrifice and read the chant "Yajnopaveetam Paramamatram" and put the first right hand and wear it as the raw comes first. After wearing the new yajnopavita, the old (jigi) yajnopavita should be removed.
Due to unacceptable, at the time of birth and death of close ones, after leaving the eclipse, the sacrifices have to be changed.
The message of upakarma:
Upakarma is the karma that is celebrated collectively. Whose events are you rushing all days. At least once in a year, everyone joins together and performs collectively and worships will increase in coalition. Baths on the banks of the rivers will increase the idea of keeping the rivers clean. Elders say that Yajnopavitam is divine medicine for physical, mental maturity and purity.
0 Comments