ఎక్కడ రామనామం వినిపిస్తుందో
అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారు
అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారు
ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులవారు తప్పక ఉంటారు.
శ్రీరాముని పేరు వినగానే మనకు ఆంజనేయస్వామి తప్పక గుర్తువస్తారు. హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడనీ, మారుతి అనీ ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తుంటారు. రామాయణంలో రామునికున్నంత ప్రాముఖ్యం హనుమకూ ఉంది. హనుమాన్ అంజనాదేవి, కేసరిల సుతుడు. చైత్ర శుధ్ధపౌర్ణమినాడు, మూలానక్షత్రాన, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం లో జన్మించినట్లు ఒక కథనం. వేదాల కథ ఆధారంగా, అంజనాదేవి ఒక అప్సరస అనీ, శాపవశాన భూలోకంలో వానర వంశంలో జన్మించిందనీ, రుద్రదేవుడైన శివుని వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలు అవుతుందని చెప్పబడింది. అందువల్ల ఆమె భర్తతో కూడి శంకరుని అతిభక్తితో ధ్యానించి, ఆ రుద్రుని వరంతో, ఆయన అంశతో ఆంజనేయుని పుత్రునిగా పొందింది. హనుమకు 28 మహిమలు లభించాయి, ఆకాశగమనం, శరీరాన్ని పెంచడం, కుంచించడం వంటివి.
మరొక చారిత్రక కధనం ప్రకారం కర్ణాటకలోని, హంపీవద్ద గల "గుంలవ్య తోట" అనే గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని "అంజని గుహ" లో పంపానదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది. వాల్మీకి రామాయణంలోని యుధ్ధకాండలో కేసరి బృహస్పతి కుమారుడనీ, రామరావణ యుధ్ధసమయంలో ఆయన రాముని సేనలో చేరి యుధ్ధంచేసినట్లు ఉంది. అయోధ్యలో దశరధ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు, యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని, మహారాజు ముగ్గురు రాణులకూ పంచగా, సుమిత్రభాగమున్నపాత్రను ఒక గ్రద్ద తన్నుకుని ఆకాశంలో వెళుతూ విడచి వేయడంతో అదివెళ్ళి శివుణ్ణి భక్తితో ప్రార్ధిస్తున్న అంజనాదేవి దోసిట్లోపడినట్లూ, ఆమె దాన్ని దైవప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా, ఆమెకు ఆంజనేయస్వామి జన్మించినట్లు రామాయణంలో ఉంది. అందుకే శ్రీరాముడు హనుమంతుణ్ణి తన నాల్గవ సోదరునిగా ఆదరించారు.
ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగా భావించి నోట కరుచుకోగా, దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి చెంప ఉబ్బడంతో "హనుమ" అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు.
సూర్యుణ్ణి హనుమంతుడు తన గురువుగా భావించి సేవించి, ఆ సూర్యదేవుని నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది, గురుదక్షిణగా సూర్య కుమారుడైన, సుగ్రీవుని సేవించడానికి అంగీకరిస్తాడు.
ఇది ఆయన సత్య వాక్ దీక్షకూ, గురుభక్తికీ తార్కాణం. మహిరావణుడు యుధ్ధసమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినపుడు, ఆoజనేయస్వామి వెళ్ళి, మహిరావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసివచ్చి పంచముఖాలతో అనగా వరాహ ముఖంతో ఉత్తర దిశన, నరసింహ ముఖంతో దక్షిణ దిశన, గరుడముఖంతో పడమర దిశన, హయగ్రీవముఖంతో ఆకాశంవైపు, తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు 'పంచముఖ ఆంజనేయుని'గా రూపుదాల్చారు. ఇది ఆయన స్వామి కార్య దీక్షకు నిదర్శనం.
యుధ్ధానంతరం హనుమంతుడు హిమాలయ పర్వతం మీద నివసిస్తూ "హనుమద్రామాయణాన్ని" తన గోళ్ళతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి, ఆ రామాయణాన్నిచదివి, అసంతృప్తిని వ్యక్తపరచగా, హనుమంతుడు కారణం అడుగుతాడట. అప్పుడు వాల్మీకి మహర్షి "ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రించక పోవడం వల్ల అది అసంపూర్తిగా వుంది కాబట్టి తనకు అసంతృప్తికలిగించినదని" చెప్పారు. అప్పుడు హనుమంతుడు తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు. ఎంత నిరాడంబరత.
అందుకే హనుమంతుడిని ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని, గర్వాహంకారాలు పోతాయనీ అంటారు. అందుకే అందరూ హనుమంతుణ్ణి పూజిస్తారు రామునితో సమానంగా అందుచేత భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విరాజిల్లుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఐన "సిమ్లా" లోని "జాఖూ" హనుమాన్ ఆలయం ప్రసిధ్ధి చెందినది. ఈ కొండపై యక్ష, కిన్నర గంధర్వ కింపురుషులు నివశించేవారనీ, హనుమ ఆకాశం పైకి ఎగరడానికి అనుకూలంగా ఆ కొండసగానికి భూమిలోకి దిగిపోయిందని, హనుమంతుడు కాలుపెట్టిన చోట ఆలయం వెలిసిందనీ చెప్తారు.
క్రీ.శ. 883 నాడు ఖుజరహోలో ఆజనేయ ఆలయం ఉన్నట్లు శిలాశాసనాల వలన తెలుస్తోంది. "సంకటమోచన హనుమాన్ మందిరం" పంజాబ్ లోని "ఫిల్లూర్" లో ఉంది. తమిళనాడులోని ’నమ్మక్కళ్ 'లో ఉన్నఆంజనేయ విగ్రహంఎత్తు 18 అడుగులు.
తూర్పుముఖంగా ఉన్న ఈ ఆంజనేయ విగ్రహం ఎదురుగా ఉన్నలక్ష్మీ నారాయణ స్వామికి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటుంది. ఈవిగ్రహం స్వయంభువు అయినందున పెరుగుతూనే ఉన్నారనీ, అందువల్ల పైన కప్పువేయడానికి వీలుకాలేదని ఆలయ కథనం వలన తెలిస్తోంది.
వెల్లూరు జిల్లాలోని ఆర్కోణానికి 30 కిలోమీటర్ల దూరంలో "యోగ నరసింహ" ఆలయానికి సమీపంలో "యోగాంజనేయ" ఆలయం చిన్నకొండ మీద ఉంది. ఆలయాన్ని చేరుకోడానికి 480 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఆంజనేయమూర్తి చతుర్భుజాలతో, రెండు చేతులతో శంఖచక్రాలు, మరో రెండు హస్తాలతో జపమాల ధరించి "యోగ నరసింహస్వామి" ని వీక్షిస్తున్నట్లు ఉంటుంది. "యోగ నరసింహస్వామి", యోగామృతవల్లి ఉండే ఆలయంలోనికి పెరియవై కొండ మీదకు1305 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. భక్తులు ఎంత శ్రధ్ధగా శ్రమపడి ప్రార్థిస్తారో దేవుని అనుగ్రహం అంత అధికంగా లభిస్తుందనేది భక్తులనమ్మకం.
కర్ణాటక రాష్ట్రం రాజధాని బెంగుళూరులోని జె.పి.నగర్లో వెలసి ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఒక గుట్టపై ఉంది. దీనిని మహామహిమాన్వితమైన ఆలయంగా భక్తులు సేవిస్తారు.
మహారాష్ట్ర రాజధాని ముంబాయ్ లోని ఎస్.ఐ ఇ.ఎస్ కాంప్లెక్స్ లోని హనుమాన్ విగ్రహం ఎత్తు 33అడుగులు [10.మీటర్లు] 12.అ.ఎత్తైన ప్లాట్ ఫాం మీద ప్రతిష్టించబడి ఉంది. మొత్తం విగ్రహం ఎత్తు భూమినుండి 456.అడుగులు [14.మీ]. వెండి కవచంతో ఈ మారుతీ విగ్రహం కప్పబడి ఉంది.
1989 లో చెన్నయ్ లోని నంగనల్లూర్ లో ఒకే రాతితో చెక్కబడిన 32 అడుగులు[10.మీ] ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం చెప్పుకోదగినది.
ఒరిస్సాలోని రూర్కెలాలో హనుమాన్ వాటిక ఆలయ కాంప్లెక్స్ లో 72 .అ. హనుమాన్ విగ్రహం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరులో 30 అడుగులు అంజనేయస్వామి విగ్రహం భక్తులకు కొంగు బంగారంగా వెలసి ఉంది. అవధూతదత్త పీఠాధిపతి "గణపతి సచ్చిదానందస్వామి" వారిచే 85 అడుగులు [26.మీ] ఎత్తైన ఆంజనేయస్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేయబడి ఉంది.
135 అడుగులు ఎత్తైన ఆంజనేయ విగ్రహం హైదరాబాద్ వెళ్ళే దారిలొ పరిటాలలో 2003 లో ప్రతిష్టింపబడింది.
సాగరపురంలో ప్రతిష్టింపబడిన ఆంజనేయ విగ్రహం దుష్టగ్రహాలను దూరం చేసేదిగా ప్రసిధ్ధి పొందినది. ప్రతిష్ఠాసమయంలో సజీవంగా కదిలిందని చెప్తారు.
తమిళనాడులోని కన్యాకుమారికి సమిపంలో 8 అడుగులు ఎత్తైన మారుతీ విగ్రహం ఉంది. కేరళ తిరువళ్ళుర్ కు 5, 6 కి.మీ. దూరంలోఉన్న"చిన్నకవియూర్లో" ని శివాలయంలో వంద సంవత్సరాల క్రితం పంచ లోహాలతో నిర్మించబడిన హనుమాన్ విగ్రహం ఉంది.
కుంభకోణంలో 40 అడుగులు ఎత్తైన [12.మీ] పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం గ్రానైట్ రాతితో మలచబడింది. తిరువళ్ళూర్లో పంచముఖ ఆంజనేయ విగ్రహం భక్తుల భయాలు దూరంచేసే అభయమూర్తిగా నిలచిఉంది.
హనుమాన్ ఒక్కడే శని ప్రభావం సోకని వానిగా చెప్తారు. రావణుని నుండి విముక్తి పొందిన శనిదేవుడు, హనుమాన్ పట్ల కృతజ్ఞతగా మారుతిని పూజించే వారికి తన దృష్టి సోకదని వాగ్దానం చేశాడట.
కేరళ రాష్ట్రంలోని తిరువళ్ళూర్ వద్దగల, మల్లాపురం జిల్లాలో వశిష్ఠులవారిచే 3 వేల సం. క్రితం. [1,000.బి.సి} ప్రతిష్టింపబడిన హనుమాన్ మూర్తి అతిప్రాచీనమైనదిగా గుర్తింపబడి ఉంది. అలధియూర్ లోని హనుమాన్ ఆలయంలోఒక పెద్ద వేదికపైనున్నఒక గ్రానైట్ రాతిపై సముద్రచిత్రం చిత్రించి ఉండగా భక్తులు దూరం నుండీ పరుగుతీస్తూ వచ్చి హనుమాన్ సముద్రాన్ని లంఘించినదానికి చిహ్నంగా ఈ రాతిపైనుండి దూకుతారు. దీని వల్ల ఆ భక్తుల బాధలు, కష్టాలు తీరిపోయి, ఆరోగ్యం, భాగ్యం, దీర్ఘాయువు కల్గి, అదృష్టం కలసి వస్తుందని విశ్వాసం. ఈ 'అలధియూ హనుమాన్' ఆలయదర్శనం భక్తుల మానసిక శారీరక రుగ్మతలు బాపడమేగాక వారి సర్వకోరికలూ ఈడేరుతాయనే సంపూర్ణ నమ్మకం ఉంది. అందువల్లే భక్తులు తప్పక జీవితంలో ఒక్క సారైనా ఈ 'అలధియూర్ హనుమంతుడి'ని దర్శించి తరిస్తారు.
అహమ్మదాబాద్ లోని కంటోన్మెంట్ ప్రాంతంలో "షహీబాగ్" సమీపంలోని క్యాంప్ హనుమాన్ ఆలయం పండిట్ గజాననప్రసాద్ వందసంవత్సరాల క్రితం కట్టించారు. భారత ప్రధానులైన, అటల్ బిహారీ వాజ్ పేయ్, ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చెప్తారు.
రామ చరిత మానస్, హనుమాన్ చాలీసా వ్రాసిన తులసీదాస్ [1532-1623] ఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 24 గంటలూ 'శ్రీరామ జయ రామ జయజయ రామ' అనే మంత్రాన్ని1964 ఆగస్టు ఒకటవ తేదీ నుండి నిరాటంకంగా జరుగుతూ వుండటం విశేషం.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన "బరాక్ ఒబామా" అధ్యక్షునిగా పోటీ చేస్తున్న సమయంలో, ఈ ఆలయమూర్తి అయిన హనుమంతుడి విగ్రహాన్ని, ఆయన శ్రేయోభిలాషులు ఆయన విజయాన్ని కాంక్షించి ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు మనం వార్తాపత్రికల్లో చదివాం. 15 కె.జిల బరువైన, బంగారు పూతతో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని పవిత్రంగా పూజించి ఆయనకు అందజేశారు. ఆయన దాన్ని భక్తితో స్వీకరించడం, విజయం సిధ్ధించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని "గొడుగుపేట" లోని ప్రసన్నాంజనేయ ఆలయం ప్రసిధ్ధి చెందిన మరో ఆంజనేయుని ఆలయం.
ఆగమశాస్త్ర ప్రకారం దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయస్వామి వారిని దర్శించిన వారి కోర్కెలు తీరుతాయని నమ్మిక. ఈ ఆలయ సంప్రోక్షణ సమయంలో 19వ శతాభ్ధిలో కుర్తాళం మఠాధిపతి పూజ చేస్తున్న సమయంలో వర్షం అతిగా కురిసి, అలయం చుట్టూ ఉన్న వీధులు వరద తాకిడికి గురైనా, ఆలయం లోపల మాత్రం ఒక్కనీటి చుక్కైనా పడలేదట.
మరొక యోగాంజనేయ ఆలయం చెన్నయ్ లోని "క్రోంపేట" దగ్గర ఉంది.1930లో ఈ ప్రాంతంలో నివసించే 13 సంవత్సరాల బాలికకు కలలో ఆంజనేయస్వామి కనిపించి ఆ ప్రాంతంలో తనకు ఆలయం నిర్మించమని ఆదేశించారట. ఆమె తన తల్లి దండ్రులకు చెప్పింది. తరువాత కంచి మఠపీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతీ స్వామీజీవారు ఆ ప్రాంతానికి వచ్చినపుడు ఆ బాలిక స్వామిజీతో తన స్వప్నం విషయం చెప్పింది. స్వామీజీ తన భక్తులతో, ఆలయ ప్రాంతంలో వెదికించగా, ప్రస్తుతం ఆలయం నిర్మించబడి ఉన్న ప్రాంతంలో ఆంజనేయ విగ్రహం లభించినట్లు, ఆ తర్వాత "తిరుమల తిరుపతి దేవస్థానం" వారు ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.
భక్తులెవరైనా కష్టాలూ, మానసిక రుగ్మతలూ కలిగినా, పసిపిల్లలకు దడుపు, అనారోగ్యం వంటివి కలిగినా, కార్యసిధ్ధికి ముందుగా పూజించేది హనుమంతుడినే. హనుమాన్ చాలీసా పారాయణం, రామరక్షా కవచం, సుందరాకాండ పారాయణ ఇవన్నీ హనుమద్ భక్తుల పాలిటి కల్పవృక్షమనీ, ఆయన కోరిన వెంటనే అండగానిల్చే ఇలవేల్పు అని భావిస్తాం. ఇలాంటి హనుమదాలయాల దర్శనం మనకందరికీ సుఖశాంతుల యివ్వాలని కోరుకుంటూ.
జై శ్రీరామ్
జై హనుమాన్
Wherever Raamanaam is heard, there that Anjaneya Swamy will appear. We believe. Wherever Hanuma is there, Sri Rama Chandra people will be there for sure. As soon as we hear the name of Sri Rama, we will definitely remember Anjaneya Swamy. All Hindus praise Hanuman with Anjaneya, Maruti and many other names. Hanuman also has as much importance as Rama's thought in Ramayana. Hanuman Anjana Devi, Kesari's son. Chaitra Sudhapournaminadu, MolaNakshatrana, an article that was born in Trayambakeswaram in Maharashtra. Based on the story of Vedas, Anjana Devi is an Apsarasa and was born in a Vanara clan on the cursed earth, by the blessing of Lord Shiva, it is said that her curse will be free after giving birth to a son. So, she meditated Shankar with her husband with devotion, with the blessing of Rudru, with his part, she got Anjaneya's son. Hanuma has got 28 glory, the sky, the body is enhanced, and the body is crushed.
According to another historic story - It looks like Anjaneya Swamy was born 18 km away from the 'Gunlavya Thota' village near Hampi, Karnataka, in the ' Anjaneya cave 'on the coast of Pampanadi. It seems like the son of Kesari Brihaspati and Ramaravana joined the army during the war in Valmiki Ramayana. In Ayodhya, when Dasharadha Maharaj performed Putrakameshti Yagam for his offspring, the payasan given by the Yagna man, the Maharaj, the vessel of the three queens, the vessel that has been given to the three queens and the vessel that has been left in the sky and went to the sky and was praying to Lord Shiva with devotion, she accepted it as a divine prasad and with devotion, it is in Ramayana that Anjaneya Swami was born to her. That is why Sri Rama honored Hanuman as his fourth brother.
When Anjaneya thinks it is a sun's fruit in their childhood, it is also said that the name 'Hanuma' has come after the slap of Devendra's diamond weapon. Lord Hanuman considers the sun as his teacher, gets all the science from that sun god, and agrees to serve Sugrivu, who is the son of Surya. This is the reason for his Satya Vak Deeksha and Guru's devotion. When Mahiravana hid Ramalakshmana in the underworld during the war, that o Janeya Swamy went and offer five unlimited lamps lit by Mahiravana with five faces - that is north with the face of Varaha, south with Narasimha face, west side with the face of Garudamara, towards the sky with the face of Hayagriva, to offer five lamps on the east side with his Hanuman face at once. They have made a form of 'ga. This is the proof of his Swami's work strike.
After the war, when Hanuman lives on the Himalaya mountain and wrote 'Hanumadramayana' with his nails, Valmiki Maharshi came and read that Ramayana, expressing dissatisfaction, Hanuman asks for reason! Then Valmiki Maharshi said 'it was unsatisfied because he was not painting the role of Hanuma in this Ramayana as it was incomplete'. Then Hanuman withdrawn his Ramayana! What a humility!! That is why it is said that if you meditate on Hanuman, you will get good qualities and you will lose your arrogance. That is why everyone worships Hanuman equally with Rama! That's why Hanuman temples are being shaken not only in India or in the world.
'Jakhu' Hanuman temple in 'Shimla', the capital of Himachal Pradesh is famous. On this hill, Yaksha, Kinnara Gandharva Kimurushulu live, it is said that Hanuma has landed into the earth in favor of flying up to the sky, the temple was lit at the place where Hanuman has set foot.
Cree. It is known due to the stone rules that there is a Ajaneya temple in Khujaraho on 883 'Sankatamochana Hanuman Mandir 'is located in 'Fillur', Punjab. Anjaneya statue in 'Nammakkal' in Tamilnadu is 18 feet high. This Anjaneya statue on the east face will be in the pose of praying to Lakshmi Narayana Swamy. The temple story shows that the statue is growing because it is autonomous, so it could not be covered.
' Yoganjaneya ' temple is located on Chinnakonda, near ' Yoga Narasimha ' temple, 30 kilometers away from Arkonam in Vellore district. It takes 480 steps to reach the temple. It looks like Anjaneya Murthy is watching 'Yoga Narasimha Swamy' wearing a rosary with square pellets, two hands with conch chakra, and two other hands. 'Yoga Narasimha Swamy', You need to climb 1305 steps to the Periyavai hill in the temple where Yogamruthavalli. Devotees believe that the more hard the devotees pray, the more the grace of God will be received.
J in Bangalore, the capital of Karnataka state. P. P Anjaneya swamy statue which is found in the city is on a hut. This will be served as a great temple by the devotees. S I E in Maharashtra capital Mumbai. Hanuman statue in S Complex is 33 feet height [10. meters] 12. A. The tall platform is installed on the farm. The entire statue is 456. a.[14. m from the height of the earth.[ This Maruti statue is covered with silver shield.
In 1989, in Nanganallur, Chennai, 32. a.[10. m] tall Anjaneya Swamy statue carved with a single stone can be recited. Hanuman Vatika temple complex in Rurkela, Orissa 72. A. There is a statue of Hanuman.
30. A in Ponnur, Guntur district of Andhra Pradesh. Anjaneya swamy statue has been lit as gold for the devotees. Avadhutadatta Peethapathi 'Ganapathi Sachidananda Swamy' by 85. A. [26. m] The statue of Lord Anjaneya has been installed.
135. A. Highest Anjaneya statue was installed in Paritala near Hyderabad in 2003 Anjaneya statue installed in Sagarapuram is famous for removing evil planets. They say it moved alive during the prestige.
8 A near Kanyakumari in Tamilnadu. There is a tall Maruti statue. Kerala to Tiruvallur for 5, 6 Yours. In the Shiva temple in the distance 'Chinnakaviyur', there is a Hanuman statue built with five metals hundred years ago. 40. a in the scandal. The tallest [12. m] five faced Anjaneya Swamy statue is decorated with granite stone. In Tiruvallur, Panchamukha Anjaneya statue stands as a shelter to remove the fears of the devotees.
Hanuman is the only one who does not have the effect of Saturn. Shani Deva, who was freed from Ravana, has promised that his vision will not be sad for those who worship Maruti with gratitude towards Hanuman.
Near Tiruvallur in Kerala state, Mallapuram district, 3 thousand years by Vasishthula. Back in the day. [1,000. B Hanuman Murthy, installed by CI, is identified as the ancient. While the sea was painted on a granite stone on a large stage in the Hanuman temple in Aladhiyur, the devotees will run from a distance and jump from this night as a symbol of violating the Hanuman Sea. I believe that due to this, the problems of the devotees will be solved and will give them health, wealth, long life and luck. This 'Aladhiyu Hanuman' temple visit is a complete belief that the devotees will be fulfilled after the mental and physical illnesses. That is why devotees will visit this 'Aladhiyur Hanuman' at least once in a lifetime.
Camp Hanuman temple near 'Shahibagh' in the cantonment area of Ahmedabad was constructed hundred years ago. Celebrities like Indian Prime Minister, Atal Bihari Vajpaye, Indira Gandhi, say they have visited this temple.
Rama Charita Manas, Tulsidas written by Hanuman Chalisa [1532-1623] There are records of visiting Hanuman Temple in Delhi. In this temple, for 24 hours, the mantra 'Sri Rama Jaya Rama Jayajaya Rama' will be held in this temple without any reason from 1964th August.
While competing for president of the current US president 'Barack Obama', we read in the newspapers that this temple idol of Hanuman and his well-wishers wished for his victory and gifted him. 15 k. Hanuman statue which is heavy and golden coated with district was worshiped and handed over to him. He accepted it with devotion and achieved success.
Another famous Anjaneya temple of Prasannanjaneya temple in 'Godugupeta' near Machilipatnam of Krishna district of Andhra Pradesh. According to Agamashastra, it is believed that those who have visited Anjaneya Swamy in the south will be fulfilled. During the visit of this temple, in the 19th century, during the Kurtalam Mahadipati Pooja, it was raining heavily, the streets around the temple were flooded, but not a single drop of water fell inside the temple.
Another Yoganjaneya temple is located near 'Chrompeta' in Chennai. In 1930, a 13-year-old girl living in this area saw Anjaneya Swamy in the dream and ordered to build a temple for her in that area. She told her parents. Later, when the Kanchi Maupitadipatulu Chandrashekhara Saraswati Swamiji came to that area, the girl told about her dream with Swamiji. Swamiji with his devotees, found anjaneya statue in the area where the temple is currently built, and then the 'Tirumala Tirupati Devasthanam' has built the temple.
Whoever is a devotee, having difficulties, mental illness, infants are suffering, sickness etc. Hanuman is the one who worships before the work. Hanuman Chalisa recitation, Rama Raksha Kavacham, Sundara Kanda recitation are all the things of Hanuman devotees, we think that they are the ones who support as soon as he wishes. I wish that this kind of Hanumadalayas darshan will give us all happiness and peace.
Jai Sri Ram
Jai Hanuman
0 Comments