రామ మందిరం వెయ్యేళ్లు పదిలం
తిరుగులేని నాణ్యతతో నిర్మాణానికి ఏర్పాట్లు అబ్బురపరిచే ఆకృతిలో నిర్మించనున్న అయోధ్య రామ మందిరం నాణ్యతలోనూ దానికదే సాటిగా నిలవనుంది. ఎంతలా అంటే వెయ్యేళ్లయినా ఆలయం చెక్కుచెదరదని నిపుణులు చెబుతున్నారు. భూకంపం సంభవించినా, రిక్టర్‌స్కేల్‌పై 10 తీవ్రత నమోదైనా ఆలయానికి ఏమీకాని విధంగా ప్రఖ్యాత ఆర్కిటెక్ట్, చంద్రకాంత్ సోమ్‌పుర డిజైన్ చేశారు.
ప్రధాన ఆలయాన్ని రెండెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మిగతా స్థలంలో అనేక రకాల చెట్లు పెంచడంతో పాటు మ్యూజియమ్, ఆలయానికి సంబంధించిన భవనాలను నిర్మిస్తారు.
ఆలయం ఎన్నటికీ చెక్కుచెదరని రీతిలో ఉండేందుకు గాను ఇక్కడి భూసారాన్ని 200 అడుగుల లోతు వరకు తవ్వి పరీక్షించారు. ఆలయ రూపలావణ్యం, ఆకృతిలోని సౌందర్యం గానీ వెయ్యేళ్ల వరకు అలాగే నిలుస్తుందని నిర్మాణ పనుల సూపర్‌వైజర్ అన్నుభాయ్ సోమ్‌పుర తెలిపారు. ఒకేసారి 10 వేలమంది భక్తులు దర్శించుకొనేందుకు వీలుగా డిజైన్ చేశారు.
మూడు లక్షల దీపాల కాంతులు:
రామ మందిరం భూమిపూజ సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో అయోధ్యలో 3 లక్షల దీపాలు వెలిగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5, 2020న భూమిపూజ జరగనున్న నేపథ్యంలో 3, 4 తేదీల్లో అయోధ్యలోని అన్ని ప్రధాన ఆలయాలు, మఠాల్లో ఈదీపాలను వెలిగిస్తారు. విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అందరూ ఇందులో పాలుపంచుకుంటున్నారు. తొలుత లక్షా 22 వేల దీపాలు వెలిగించాలని అనుకున్నా. తర్వాత నగరమంతా భారీఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకుగాను డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రపంచ పర్యాటక హబ్:
అయోధ్య అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ మనోజ్ దీక్షిత్ ‘ఈటీవీ భారత్’కు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక పరమైన అనేక ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అయోధ్య ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. డజను దాకా పెద్ద హోటళ్లు, అతిథిగృహాలు, అంతర్జాతీయ బస్ టెర్మినళ్లు వంటివన్నీ వస్తాయన్నారు. అయోధ్య నుంచి అనేక చారిత్రక నగరాలు, పట్టణాలను కలిపేందుకు ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణానికి గాను ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
రామ జన్మభూమి ట్రస్టుకు 67 ఎకరాల బదలాయింపు.
అయోధ్య: భారీస్థాయి రామ మందిరం నిర్మాణం నిమిత్తం అయోధ్య చట్టం కింద సమీకరించిన 67 ఎకరాల భూమిని "శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు" కు శనివారం లాంఛనంగా బదలాయించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈ ట్రస్టును 15 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
రామ్‌లల్లాను సందర్శించనున్న మొదటి ప్రధాని మోదీయే
ఈనాడు, లఖ్‌నవూ: అయోధ్యకు గతంలోనూ పలువురు ప్రధానమంత్రులు వచ్చినా రామ్‌లల్లాను సందర్శించబోతున్న తొలి ప్రధాని మాత్రం నరేంద్రమోదీయే. ఎన్నికల ప్రచారంలో భాగంగానూ మోదీ అయోధ్యకు వచ్చినా రామ్‌లల్లాను సందర్శించలేదు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ఏబీ వాజ్‌పేయీల విషయంలోనూ అలాగే జరిగింది.
ఆడ్వాణీ, జోషిలకు ఆహ్వానంపై అస్పష్టత.
అయోధ్య: రామజన్మభూమి ఉద్యమంతో సంబంధం ఉన్న కొందరు ముఖ్య నేతల్ని రామాలయం భూమి పూజకు ఆహ్వానిస్తున్నారా లేదా అనే విషయమై అస్పష్టత తొలగడం లేదు. భాజపా సీనియర్ నేతలైన ఎల్.కె.ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలను తప్పకుండా ఆహ్వానిస్తామని ఆలయ ట్రస్టుకు చెందిన కొందరు ప్రతినిధులు వెల్లడించారు. ఒకవేళ వారిద్దరినీ ట్రస్టు పిలిచినా వయోభారం దృష్ట్యా వారు హాజరుకావడం కష్టమేనని, మహా అయితే వీడియో కాన్ఫరెన్సులో వీక్షిస్తారని మరికొందరు అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి, యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌లకు శనివారం ఆహ్వానాలు అందాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో, పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కొందరు కరసేవకుల కుటుంబ సభ్యులను ట్రస్టు తరఫున పిలుస్తున్నారు.
Arrangements for construction with non-rebellious quality:
The Ayodhya Rama Mandir which is going to be constructed in an amazing shape is going to stand equal to it in quality. Experts say that the temple will not be checked even after thousand years. Despite the earthquake. The famous architect, Chandrakant Sompura designed the temple with 10 intensity registered on the Richter scale.
The main temple will be constructed in a two-acre area. In addition to growing many types of trees in the rest of the place. the museum and the temple buildings will be built. The land is dug and tested up to 200 feet deep to make the temple remain in a never-checked way. Anubhai Sompura said that the beauty of the temple design and shape will last for thousands of years. 10 thousand devotees designed to visit at a time.
On the occasion of Rama Mandir Bhoomi Pooja, arrangements are being made to light 3 lakhs of lamps in Ayodhya. All the major temples and mutts in Ayodhya will be lit on August 3, 5 with the background of the land pooja. Students, people's representatives, social activists are all participating in this. First I thought of lighting 22 lakhs of lamps. then the whole city decided to take this program in a huge scale. This is why Dr. Ram Manohar Lohia Avadh University is making huge arrangements.
Dr. Ram Manohar Lohia Avadh University Vice Chancellor Dr. Manoj Dixit told 'ETV Bharat' that a new chapter in the development of Ayodhya is about to begin. Central and state governments have revealed that they are going to carry out many tourist projects.
Ayodhya is going to develop as a world famous tourist hub. Up to a dozen of big hotels, guest houses, international bus terminals, etc. The proposals are being prepared for the construction of roads specifically to unite many historic cities and cities from Ayodhya.
67 acres transferred to Rama Janmabhoomi Trust
Ayodhya: The 67 acres of land equipped under the Ayodhya Act was transferred to 'Sri Ramajanmabhoomi Theerthakshetra Trust' on Saturday for the construction of a heavy-level Rama Mandir. According to the Supreme Court verdict, this trust has been arranged by the central government with 15 members.
Modi is the first prime minister to visit Ram Lalla
Eenadu, Lakh Navu: Narendra Modi is the first Prime Minister to visit Ram Lalla even after many Prime Ministers came to Ayodhya. As a part of election campaign, even if Modi came to Ayodhya, he did not visit Ram Lalla. The same happened in the case of Indira Gandhi, Rajiv Gandhi, AB Vaj Payi.
Clarity on the invitation to Advani and Joshi
Ayodhya: There is no clarity on whether some important leaders who are related to the Ramajanmabhoomi movement are invited to the Ramalayam Bhoomi pooja or not. BJP senior leader L. K. Some representatives of the temple trust have revealed that they will definitely invite Advani, Murali Manohar Joshi. Others say it's difficult to attend if the trust called them both, but will watch the video conference. Former Union Minister Uma Bharati, Former UP Chief Minister Kalyan Singh got invitations on Saturday. Trust is calling on family members of some of the workers who lost their lives in the Babri Masjid demolition, police shooting.
0 Comments