Ad Code

మనిషి చెప్పకూడని 9 విషయాలు - Stay Away From Sharing These Details Of Your Life With Anyone

మనిషి చెప్పకూడని 9 విషయాలు

మనిషి తన వయస్సు గురించి గానీ, ధనం గురించి గానీ, ఆయుస్సు గురించి గానీ ఇతరులకు ఎవరితోను పంచుకోకూడదట. ఎన్నో అనర్ధాలు తెచ్చిపెడుతుందట.
ఆయువు, అంటే వయస్సు చెప్పకూడదు అని ఒక అర్థం. పురాణాలు మరియు ఋషులు ప్రకారం అయ్యుష్హు ఎంతో తెలిసినా చెప్పకూడదు. 

ఇద్దరు కలిసి ఇష్టపడి పంచుకున్న ప్రేమను మరియు యింటిలోని కలతలు, బయటి వారికి చెప్పకూడదు. మీరు చేసిన దానము కూడా నేనింత చేశానని చెప్పుకోకూడదట. మనకు జరిగిన అవమానమును కూడా ఎవరికీ చెప్పకూడదట.

ఇద్దరు ఎంతో మంచి హృదయంతో కలిసిన సంగమము గురించి కూడా చెప్పకూడదట. 
మంత్రమును, ఔషధము ఎలాగ తయారు చేసినదీ కూడా గోప్యముగానే చుకొనవలయును. 
ఈ తొమ్మిదింటినీ గోప్యముగా వుంచవలయునని పురాణాలు మరియు ఋషులు యొక్క భావము.

ఆయువు:

భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ "వివేకము" అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. ఈమూడు కారణాలవల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు. మరుక్షణంలో మనిషి ఛస్తాడని తెలిస్తే, ముందు ఆ క్షణమే విపరీతంగా ఆలోచనతో చావడం ఖాయం. నిజంగా నీ ఆయుఃప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై వాడిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్తక్రారుడు.

విత్తం - ధనం:
ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయని . 
ఎంత ధనం ఉన్నా, ఆ మనిషి జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో నీతి నిజాయితీ గా భగవంతుని దీవెనలు ఆశీస్సులతో ఆయన బిడ్డ గా మంచి ఆలోచనలతో ఉన్నపుడు 
మనకు నష్టం జరుగదట. "లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు" అన్నట్లు అతి సాదారణ నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. 
అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం. అయినా మన దగ్గర ధనం ఉన్నవిషయం (భార్య భర్తలు మధ్య మాత్రమే ఉండాలట) 
అలాకాకుండా ఇతరులకు చెప్పి, (భార్య భర్తలు కాకుండా) నేను, చాలా గొప్ప అని అనిపించుకోవడం కోసం, లేదా పొగడ్తల కోసం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం.

ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, వారి కోరిక మేరకు వారు ఆశించిన పనులు తప్పక చేయాలట. ఎందుకంటే మొదటి ధైవం తల్లిదండ్రులు కనుక వారి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ బిడ్డలకు ఉండాలని భగవంతుని కోరికట. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే, నీతి నియమాలు పాటించకపోతే దాన్ని ఇతర దుర్మార్గమైన వ్యక్తులు స్వాధీనపరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో స్వంత రక్త సంబంధం వారే మోసం చేయడమో జరుగుతుందట.

గృహచ్చిద్రం - ఇంట్లోని గొడవలు:
ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దానినే "ఇంటిగుట్టు" అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. అయినా సరే, వాటిలో రహస్యాలను ఇతరులకు అంటే మూడో వ్యక్తికి వారు ఎంత పెద్ద వారైనా సరే బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని. 
దాని వల్ల కలిగే నష్టాలను అంచనా వేయలేరట. ఆ ప్రేమ బంధం ఆ ఇద్దరు సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు. అందుకే మన పెద్దలు అనేవారు ఇంట్లో గొడవ ఉంటె ఇల్లెక్కి అరవొద్దు, కంట్లో నలుసు పడితే కన్నును పోడుచుకొవద్దు, అని అన్నారు.

మంత్రం:
"‘మననం చేసేది మంత్రం" మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం 
మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.

ఔషధం:
ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలు ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరచి ఎవ్వరంటే వారు తయారుచేయకూడదు. 
ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.

సంగమం - శృంగారం:
సంగమం అంటే కలయిక. మనుషులు భార్య భర్త మధ్య జరిగిన కలయిక సంగమము గురించి ఒక్క కన్న తల్లి తప్ప మరో ఏ ఇతర వ్యక్తులకు ఆ అందమైన అనుభవం గురించి చెప్పకూడదట. ఆ రహస్యమైన భగవంతుని దీవెనలు ఆశీస్సులతో రెండు మనసులు కలిసి ఎంతో పవిత్రమైన కార్యం జరుపుతారట. అటువంటి కార్యాన్ని ఏ ఇతర మూడో వ్యక్తి కి 
ప్రాణం పోయినా చెప్పకూడదట. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న ఒక్క భగవంతుని క్షమాపణలు అడిగి తప్పు తెలుసుకుని వాటి నుండి మంచి మార్గంలో పయనించాలి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై 
మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం (భార్య భర్తలు) రహస్యంగా ఉంచడం మంచిది.

దానం:
దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది. 
దానినే గుప్త దానం అంటారు. గొప్పలు చెప్పుకుంటున్న భగవంతుని ఆగ్రహం తప్పదట. మనది కాదు అని తెలిసిన మరుక్షణం అది మన వద్ద ఉంచుకోకూడదట. దాని వల్ల మన వద్ద ఉన్న మన స్వంత సంపదను దేవుడు మరింత తీసివేస్తాడట. ఈ విధంగా పురాణాలు ధైవ గ్రంధాలలో రాశారు.

మానం:
అంటే శరీరం. శరీరాన్ని బహిర్గతం చేయకూడదు. ఒళ్ళును ఎప్పుడూ దాచుకోవాలి.
ఒక భార్య భర్తలు తప్ప మరో ఏ ఒక్క వ్యక్తి కి నీ శరీరాన్ని చూపిన లేదా ఆ వ్యక్తి తో శృంగారం జరిపిన దేవుని కి వ్యతిరేకంగా జీవించడమే కాకుండా ఘోరంగా శిక్ష ఉంటుందట. 
రవి కాంచని చోటు కవి కాంచున్ అంటారు. అంటే శరీరం అవయవాలు సూర్యుడు కూడా 
చూడడు అంట. అంత గుప్తంగా ఒళ్ళును దాచుకోవాలి.  నేడు విదేశ సంస్కృతికి అలవాటుపడి ఆహార్యంలో అనేక వింత ధోరణులు చోటుచేసుకున్నాయి, ఇది మంచిది కాదు.

అవమానం:
తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి మోసం చేస్తున్నారని ఆ అవమానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగుతుందట. 
తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి అని వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలట. దీని వల్ల దేవుని ఆశీస్సులు దీవెనలతో వీరికి మంచి జరుగుతుందట. 
ఆ వ్యక్తిని భగవంతుడు తన బిడ్డగా చేరతీస్తారట. భార్య భర్తల మద్య లేదా దేవుని ఆశీస్సులు తో ఇద్దరు కలిసి ఇష్టపడి జరిగిన ఎటువంటి సంభాషణలు కూడా ఎవరితో చర్చలు జరపకూడదట. దాంతో పగ అలా అంతే ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మనం చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం.
ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం 
విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధ.


9 things that a man should not say


A man is about his age but, 
About money but, About life but for others
Don't share with anyone. It seems that it will bring so many misunderstandings.
Life means age should not be told. According to mythology and sages, Ayushhu should not be told much known. The love that the two have shared together and the troubles in the house should not be told to the outside. You should not say that I have done this much for your donation. Even the insult that happened to us Don't tell anyone. The two together with the best heart Should not even talk about the meet. Mantra and medicine should also be kept secret. The sense of myths and sages that these nine should be kept secret.

the life of life:

As God has given to all animals Despite giving the body, he has given the great character of 'wisdom' to a man. In the same way, if you remember the thing that happened yesterday, you will not remember it. You can't understand what is happening now unless you think about it. What is going to happen tomorrow, don't know anything. For these three reasons, man is able to be happy without getting mad. If you know that a man will come in the next moment, That moment was the first one with a lot of thought The death is for sure. If you know this is really your lifespan, you have to keep it a secret. Otherwise it's a public secret and hurt him. So life is the main role in future knowledge. Even after knowing that, the scientist said to keep it secret.

Wealth:
No matter how much money is, it should be kept secret. There are so many accidents due to that. No matter how much money you have, That man's lifestyle is orderly and disciplined With honesty, God's blessings and blessings, when he is with good thoughts as a child We won't get a loss. You have to get used to living a very common humbled life as if you are a millionaire or a salty rice but a better gold mingabodu '. Money is like salt. It's more or less both are difficult. Too much sensation will not come down ' Nithi Chandrika's statement
Hundreds of truth in the matter of money. Even though we have money
(Wife should only be between husbands it seems) And also by telling others,
Me, very great (wife and husband) To feel like that, Or it's dangerous to unnecessarily exposed for praises.

The four heirs called Dharma, King, Fire, Thief for money. In this, the elder heir is dharma. He is the brother to all four. Elder brother should get a big share in his father's money. That means more money should be used for Dharma. In order to take forward the expectations of parents, they must do what they expect as per their wish. Because first god is parents I pray to God that their blessings and blessings should always be there for the children. If the money is not used for righteousness, If you don't follow the rules of moral, other evil people will take over it, Loss due to fire accidents, Thieves stealing or cheating by their own blood relation.

House picture - house fights:
So many problems in the house. That's what they call ' house secret '.
Lovely weather in the family Need to be built. Sometimes those love are obstructed and conflicts happen. Well, it's stupid to want to reveal the secrets to others, no matter how big they are to a third person. The losses caused by it are unrealized. It is wise to find a solution to that love relationship and those two harmony. There will be fights between father-son, wife husband, brothers and sisters. Personal pride, selfishness to live alone, personality to be good to us - all destroyed our family system today. Whatever happens, the secret of the house has to be known to the God. But it is not right to reveal it. That's why we call our elders. If there is a fight at home, don't shout at home. Don't touch your eyes if you have a peel in your eyes. They said that.

the mantra:
"What we do is mantra" - Mantra secretly preaching in the ear Our tradition.
Not telling the speciality of mantra to those who know It's purpose will be fulfilled but It feels like a loss by telling the father. If you say to a person who doesn't have devotion on it That's going to be abusive. There should be unreal faith in mantra.

the medicine:
Every plant in the world is medicine. Using terrible chemicals as medicines today. This should not be made publicly to everyone. Good to keep the medicine a secret.

Meeting - Sex:
Meet is a combination. Except one mother about the meeting between men, wife and husband No other people should be told about that beautiful experience.
With the blessings of the secret God Two hearts together do a very sacred thing.
Such a thing to any other third person Should not tell even if life is lost.
Best to keep a secret. And in the lives of those who think great One who has many secrets should ask for forgiveness and find mistakes and walk through them in a good way. On their personalities when they are exposed The scar is going to be made. So the meet we do (wife and husband) It's better to keep a secret.

Donation:
Donation is the greatest of all. Better do it in secret. Donation done will not be rewarded if you say it for nothing. If our donation is kept secret
Will give the result immediately. That's what is called secret donation. The anger of the God who is saying great things will not go away. The moment we know that it is not ours, we should not keep it with us. That's why we have our own wealth God will remove more it seems. This is how myths are written in the divine books.

Respect:
That means the body. The body should not be exposed. Always have to hide the body. A wife is not only living against God for showing your body or having sex with that man but husband is a worst punishment. The place where Ravi Kancha is not called Kavi Kanchun. Means body organs and sun too He won't see it it seems. Need to hide the body so secretly. Today in food as a habit of foreign culture A lot of strange trends have taken place. This is not good.

Shame on you:
He should forget the insult that happened to him Anger will increase if you don't let the insults of the girl or boy who you loved are cheating. Forgive the mistakes done unknowingly Special prayers should be done for them.
God's blessings and blessings because of this Good will happen to them it seems. God will take that man as his child. Wife between husband or with God's blessings No conversations that two people like together should be discussed with anyone. Revenge with that. it won't be like that. We can't remove all the thorns in the world, but it is easy for us to go with slippers. Protecting these nine secrets Enlightenment told by the elders that it is the characteristics of scientists.






Post a Comment

0 Comments