సదాశివా (చతురక్షరి)
ఇది నాల్గు అక్షరములు గల్గిన మంత్రము. పూజాసమయంలో “సదాశివాయై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి. సదా - శివా = సదాశివ రూపిణియైనది శ్రీదేవి. పంచబ్రహ్మలలో అయిదవ వాడు “సదాశివుడు”. అతని స్వరూపిణియైనది శ్రీదేవి అని సామాన్య భావము. సత్-అ-శివా అని కొందరు విభజిస్తారు. సత్ = సద్రూపమై ఆ = (సంతత) అంతటను శివా = శుభరూపిణి అయినది అని వ్యాఖ్యానిస్తారు. కొందరు "శాంతం అద్వైతం శివం తురీయం మన్యంతే స ఆత్మాసవిశ్లేయః" అనే శ్రుతిని బట్టి శివ పదాన్ని పరమాత్మ స్వరూపంగా వ్యాఖ్యానిస్తారు. సద్రూపమై అంతటా నిండినదై ఉండే బ్రహ్మతత్త్వము శివము అని సారాంశము. ఈ మంత్రముతో ఉపాసించే సాధకులకు శివాత్మకమైన బ్రహ్మస్వరూపము ప్రాప్తిస్తుంది.
0 Comments