Ad Code

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం - మోపిదేవి (Sri Subrahmanya Swamy Temple - Mopidevi)

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం


ఓం నమో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 
ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
ఓం శ్రీ స్కందాయ నమః
ఓం నమో శ్రీ కార్తికేయాయ నమః
ఓం నమో శ్రీ స్కందాయ నమః

పుట్టలో సర్పరూపంలో వెలసిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయ రహస్యం తెలుసా? శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకేచోట కొలువుదీరి భక్త జనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరఆలయం.పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తులపాలిట కొంగుబంగారమే.దీపావళి అనంతరం వచ్చే నాగులచవితిన ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షలసంఖ్యలో భక్తజనులు తరలివచ్చి ఇక్కడి పుట్టకి విశేషపూజలు నిర్వహిస్తారు. మరిక్కడ ఆ స్వామి స్వయంభూగా ఎలా వెలసాడు? ఈ ఆలయం ఎక్కడుంది?ఈ ఆలయవిసేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కృష్ణాజిల్లాలో దివి సీమకు చెందిన ఒక మండలం మోపీదేవి. ఇది మచిలీపట్టణం నుండి 30కిమీ ల దూరంలో వుంది.దీనికి మోహినీపురమని, సర్పక్షేత్రమని పేరు. కాని కాలక్రమేణా మోపీదేవిగా మారింది.ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి లింగ రూపంలో వుండటం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిఆలయానికి సుమారు 5సంల చరిత్ర వుంది. ఈ క్షేత్ర ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలసాడని పురాణాలు చెబుతున్నాయి.

రాహుకేతు సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలందుకుంటున్నాడు. తూర్పుదిశగా వున్న ఆలయగర్భగుడిలో 6,7సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మస్వామిగా పూజలందుకుంటున్నాడు. దీనినే పానపట్టం అని కూడా అంటారు. అయితే స్వామివారి పానపట్టంలో వున్న ఒక కన్నం నుండి సంవత్సరంలో ఒక సారి నాగు పాము బయటకొచ్చి భక్తులకి దర్శనం ఇస్తుందని ఇదిఒక విశేషంగా చెబుతారు.

ఇంకా ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణంవైపు పుట్ట వుంది. పానపట్టం క్రింద వున్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తికేయుడ్ని అభిషేకిస్తారు. నాగులచవితి, నాగ పంచమి పర్వదినాలలో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తారు.

ఇక ఆలయపురాణానికొస్తే ఇంద్రాదిదేవతల ప్రార్ధనలు మన్నించిన అగస్త్యమహర్షి లోపాముద్రసహితుడై కాశీపట్టణాన్ని వీడి దక్షిణభారతదేశంలో పర్యటించాడు. మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణానదితీరంలోని మోహినీపురంలో సేదతీరుతుండగా పాతవైర్యాన్ని మరచి పాము,ముంగిస, నెమలి ఆడుకుంటూ కనిపించాయి.

ఆ పక్కనే దివ్యతేజస్సును విరజిమ్ముతున్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది.దగ్గరకు వెళ్లిచూడగా కార్తికేయుడు సర్పరూపంలో తపస్సుచేసుకుంటూ కనిపించాడు. దివ్యదృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడు. అది తెలుసుకొనిన దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారు.పుట్టలో వున్న కార్తికేయుడు వీరారపుపర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలోకనిపించి తాను పుట్టలో వున్నానని తనను బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడట. స్వప్నవృత్తాంతం పెద్దలకు తెలియచేసిన పర్వతాలు స్వామి అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి షణ్ముఖుడిరూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించాడు. స్వామి మహిమను తెలుసుకున్న దేవర కోట సంస్థానాధీశులు చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులు ఆలయఅభివృద్ధికి విశేషకృషి చేసారు.

నాగులచవితిరోజున పుట్ట దగ్గరికి వెళ్లి ఆయనను పూజిస్తే సంతానంలేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడి వారి నమ్మకం.పుట్టమట్టిని ప్రసాదంగా ధరించటంవల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి. సర్పం జ్ఞానానికి నిదర్శనం.అందుకే ఆ రూపంలో వున్న స్వామిని ధ్యానించినవారికి మంచి, విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయని పురాణాలు తెలియచేస్తున్నాయి.

ఈ విధంగా స్వయంభూగా పుట్టలోవెలసిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని నాగులచవితి రోజున భక్తులు లక్షలసంఖ్యలలో ఇక్కడికి తరలి వచ్చి పుట్టలో పాలుపోసి స్వామి లింగాన్ని దర్శనం చేసుకుంటారు.

Sri Subrahmanyeswara Swamy Temple Mopidevi:
Lord subrahmanyeawar temple is very famous temple in kirshna district of Andhra Pradesh. It is 5km distance from challapalli and 55km distance from vijayawada. Challapalli raja palace, hamsaladeevi beach, and manginapudi beach are nearest attractions to cover. When come to lord subrahmanyeawar temple, he is very powerful god. If you visit this place on Tuesday and Sunday it will be too rush. God will make all your desires come true.





Post a Comment

0 Comments