Ad Code

అతిశక్తివంతమైన రాహు మంత్రం

అతిశక్తివంతమైన రాహు మంత్రం

రాహుగ్రహం వలన ఇబ్బందులు పడుతున్న వారికి రాహుగ్రహ పీడ దోషములు నివారణ కొరకు,
రాహుగ్రహ స్వభావం మరియు ప్రభావము వివరణ తో పాటు రాహు ప్రభావం నుండి పూర్తి ఉపశమనాన్ని కలగడానికి అతిశక్తివంత మైన రాహు మంత్ర సాధన.

సాధన: రోజుకి 1008 సార్లు 41 రోజులు చేయండి. శ్రద్ద, మానసిక నిష్ఠ, తో చేయండి.
గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి  శీఘ్రముగా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి  ఇలా చేయవచ్చు
చాలా శక్తి వంతమైన ఈ మూలమంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి.

వాయుతత్వం కలిగిన ఆరుద్ర, స్వాతి మరియు శతభిషం అనే మూడు నక్షత్రాలకు రాహువు అధిపతి అయి ఉన్నాడు. ఈ నక్షత్రాలు ఉండే మిధున తుల మరియు కుంభ రాశులకు అధిపతులైన బుధుడు, శుక్రుడు మరియు శని ఇచ్చే మేధస్సుని, సుఖాలను, ధర్మ ప్రవర్తనను ఒక్క రాహువే ఇవ్వగలశక్తిని కలిగి ఉన్నారు.

రాహు గ్రహం భౌతిక సుఖాలను, సంపదల్ని ప్రసాదిస్తుంది. అయితే రాహు గ్రహం సుఖాలతో పాటు మానసిక ఆందోళలనుకూడా కలిగిస్తుంది. రాహువు ఒక వ్యక్తి జాతకంలో చెడుస్థానంలో ఉంటే ఆ వ్యక్తి ఆస్తుల్ని, పదవుల్ని నష్టపోవటమే కాకుండా కోర్టు కేసుల్లో ఇరుక్కుని దెబ్బతినటం కూడా జరగవచ్చు పురుషుల జాతకాలలో శుక్రుడు స్త్రీ సుఖాన్ని, దాంపత్య సుఖాన్ని సూచిస్తాడు. అలాంటి శు క్రుడు ఎవరి జాతకంలో అయినా రాహువు కలిసి ఉంటే వారి జీవితంలో వివాహ సంబంధమైన లేదా దాంపత్య సంబంధమైన అనేక సమస్యలు ఏర్పడతాయి.

రాహు గ్రహం విదేశీయు లను మరియు విదేశాలను మరియు మానవుల అభిరుచులను సూచిస్తాడు. రాహువు శని వంటి లక్షణాలను కలిగి ఉంటాడు. రాహువు ఔషధాలు, విషము, అధికారవాంఛ, రహస్య జ్ఞానము అనే అంశాలకు కారకుడై ఉంటాడు. రాహువు వాయుతత్వానికి చెంది ఉన్నాను. అందువలన విమానాలు, విమాన ప్రమాదాలకు కారకుడిగా ఉంటాడు, ఇంకా మసూచి వంచన , చర్మవ్యాధులు, లాంటి అంశాలకు కూడా రాహువు కారకుడు అయి ఉంటాడు,
రాహువు ఒకసారి  బ్రహ్మ సరస్వతిల దగ్గరికి వచ్చి నాకు కూడా రాశి చక్రంలో ఏదేని ఒక రాశిని ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. అప్పుడు బ్రహ్మ వాళ్లు అమృతం త్రాగారు గనుక రాశ్యాధిపత్యం ఇచ్చానని సమాధానం ఇస్తారు.

అయితే, నేను కూడా అమృతం తాగాను, మరి నాకెందుకు రాశి ఆధిపత్యం ఇవ్వలేదు? అని అడుగుతాడు. నీ వన్నది నిజమే కావచ్చు కాని, ఖాళీ లేదు అంటాడు. అప్పుడు సరస్వతీ అమ్మవారు జోక్యం చేసుకోని ఇప్పటికే భృగుమహర్షి శాపంతో ఎక్కడా గుడి, పూజలు అంటూ లేకుండా చేసుకున్నావు? ఇప్పుడు రాహువుకు కూడా రాశి చక్రంలో స్థానం ఇవ్వకుంటే లోకంలో అపవాదు, నింద ఎదుర్కొన వలసివస్తుంది అని అంటుంది. చేసేది లేక రెండేసి రాశులు ఉన్నవారు ఎవరైనా ఒక రాశి ఇస్తే తీసుకోపో అని అంటారు. అప్పుడు శని ముందుకు వచ్చి తండ్రి సూర్యుని మీద గల కోపంతో తనకు గల రెండు రాశులలో ఒకటి అయిన కుంభరాశి ఇస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శనితో రాహువు బహు మాయావి, దుర్మార్గుడు. వాడికి స్థానం ఇస్తే వాడు బలం పుంజుకున్నాక నీకే చోటు లేకుండా చేస్తాడు అని అంటాడు. అయిన, శని వినక కుంభరాశి రాహువుకు ఇస్తారు. విధిలేక కుజుడు తనకు గల రెండు రాశులలో ఒకటి అయిన వృశ్చికాన్ని కేతువుకు ఇస్తాడు. అదీగాక, కుంభ రాశిలో గల ఎక్కువ 100 నక్షత్రాల గుంపుగల శతభిషం రాహువు. అందువలన, రాహువు ఎక్కడ ఉన్నా మొదలు తన సంఖ్యా బలం పెంచుకుంటాడు. బలం పెరిగినాక అంతా తనదే తను చెప్పినట్లు నడువాలి అంటాడు, సాగిచ్చుకుంటాడు కూడా. ఇక వృశ్చిక రాశి నిగూఢమైన విషయాలకు సంకేతం, వృశ్చికం అనగా తేలు చీకట్లో రహస్యంగా దాక్కుంటుంది. అందువలన రాహువు చేసే అపకారం వలన కష్టనష్టాలు అయ్యే వరకు తెలియదు. అందువలన, రాహువు, కేతువులను పాపగ్రహాలుగా జ్యోతిషశాస్త్రంలో  ఉంది.





Post a Comment

0 Comments