దక్షిణ షిర్డీ (సాయిబాబా దేవాలయం)
దక్షిణ షిర్డీ గా చెప్పబడే సాయిబాబా దేవాలయం కర్నూలు సిటీలో తుంగభద్ర నది ఒడ్డులో 70 సంవత్సరాల క్రిందట నిర్మించిన ఆలయం.
అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది.
ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డుపై నిర్మించబడింది.
ఇది నక్షత్రం ఆకారంలో వుంటుంది.
ఈ ఆలయంలో లక్ష్మీ దేవి, హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి.
ప్రతి గురువారం అన్నదానం నిర్వహిస్తుంటారు, కర్నూలు పట్టణంలో వివిధ రకాల సేవకార్యక్రమాలల్లో ఈ దేవాలయ సాయిసేవ బృందం పాల్గొంటారు.
ఈ ఆలయంలోని "కోదండంస్వామి భజన బృందానికి" సత్సంగ భజనలో ఇతర రాష్ట్రాలలో భాగా ప్రాచుర్యం ఉంది.
ఈ ఆలయ వాతావరణం చల్లగా, నిర్మలంగా ఉంటుంది. అన్ని సమయాలలో ఈ ఆలయాన్ని సందర్శించ దగినప్పటికీ, పూజలు నిర్వహించే ఉదయం, సాయంత్ర సమయాలు సందర్శనకు అనుకూలంగా ఉంటాయి, ఈ నదినుండి వీచే చల్లని గాలి ఈ ప్రదేశాన్ని ఎంతో ఆహ్లదపరుస్తుంది. షుమారు 800 మంది ప్రజల సామర్ధ్యం గల పెద్ద ధ్యాన మందిరంలో ధ్యానం చేయవచ్చు.
ఈ ఆలయం కొండారెడ్డి బురుజుకి దగ్గరలో ఉండడం వల్ల సులభంగా చేరుకోవచ్చు.
ఈ ఆలయంలో సాయిబాబా సాదుపురుషుడిగా ఆలయంనందు ఆరాధించబడుచున్నాడు.
0 Comments