Ad Code

బ్రహ్మరూపా (చతురక్షరి) - Chaturakshari

బ్రహ్మరూపా (చతురక్షరి)



ఇది నాల్గు అక్షరములు గల్గిన మంత్రము. పూజాసమయంలో “బ్రహ్మరూపాయై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

బ్రహ్మ - రూపా = బృంహణ లక్షణమైన బ్రహ్మము రూపముగా గలది శ్రీదేవి.

బృంహణము అనగా ఉబ్బుట, విస్తరించుట అని అర్థము. ఒక్కడుగా ఉండిన పరబ్రహ్మము బహుధా - బృంహణము అనగా విస్తృతిని పొందినది. పరాశక్తిలో ఉండే ఈ లక్షణము రజోగుణ ప్రతీకమైన బ్రహ్మ ద్వారా వినియుక్తం అయింది. ఈ కారణం చేత అమ్మవారికి "బ్రహ్మరూపా” అనే నామం వచ్చింది.

వెనుక తెలుపబడిన విషయమైన - జాగ్రత్ - స్వప్న -సుషుప్తి - తురీయములు అనే నాల్గు అవస్థలు బ్రహ్మ యొక్క నాల్గు తలలతో సమన్వయం చేయవచ్చును. అలాగే పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాల్గు వాగవస్థలతోను సమన్వయం చేయవచ్చును. “అయమాత్మా బ్రహ్మ" అనే వాక్యానికి ఈ ఆత్మ ఏక శరీర బద్ధముగాదు. అనంత సంసారంగా విస్తృతిని పొందినది. అనియు తత్త్వజ్ఞులు బోధిస్తారు. బ్రహ్మద్వారా సృష్టికార్యమును నిర్వహించేది పరాశక్తి అని సారాంశము.

ఈ మంత్రంతో పరాశక్తిని ఉపాసించేవారికి సృష్టి రహస్యం అవగతం అవుతుంది. రాగద్వేషాలు అంతరిస్తాయి. క్రమంగా ఆత్మానందం ప్రాప్తిస్తుంది.





Post a Comment

0 Comments