దూర్వా గణపతి వ్రతం
ఇది సంకల్ప పూర్వకంగా చేయవచ్చు. లేదా విశ్వసనీయత లఘు రూపంలో కింద చెప్పిన విధానంగా చేసి అదే వ్రత ఫలితాన్ని పొందవచ్చు.
గణపతి విగ్రహం ముందు గాని,పటం ఎదురుగా గాని వీలయితే మట్టి ప్రమీదల్లో కొబ్బరినూనె పోసి తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి.
ఈరోజు ప్రత్యేకంగా గణపతి ని 21 గరిక యుగ్మా లతో పూజించాలి. తేనెలో ముంచిన గరిక తో అయితే మరింత శుభం.
ఓం దుర్వాయుగ్మ ప్రియాయ నమః
ఓం హేరంభాయ నమః
అన్న నామాలను వీలయినంత సేపు గణపతి ముందు జపించండి.
ఇవేవి చేయలేని వారు కనీసం గణపతి యొక్క ముఖాన్ని కనీసం ఒక గడియ పాటు చూడండి.
ఈ నియమాలు పాటించి దుర్వా గణపతి వ్రత ఫలితాన్ని పొందండి.
0 Comments