Ad Code

శ్రావణ సోమవారం నీలకంఠుని పూజిస్తే విశేష ఫలప్రదం

శ్రావణ సోమవారం నీలకంఠుని పూజిస్తే విశేష ఫలప్రదం


మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను, ప్రాధాన్యతను కలిగివుంది. శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ, శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం'గా భావించబడుతోంది. శ్రావణ మాసంలో సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, పౌర్ణమి విశిష్టమైనవిగా చెబుతుంటారు.

పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమ శివుని పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. పార్వతి దేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడంగా నమ్ముతారు.

శ్రావణ సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివరాధాన చేస్తాడట. అందువలన ఈ రోజున పరమశివుడిని భక్తితో అభిషేకించిన వారిని ఆయనతో పాటు విష్ణువు కూడా అనుగ్రహిస్తాడు.

ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు, పూజలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఇక అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ 'శ్రావణ మంగళవారం' నోము నోచుకుంటూ వుంటారు. తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచుకుంటారు.

మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తే సకలసంపదలు చేకూరుతాయి. శ్రావణ మాసంలో పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది.


In all months, shravan month is special. It is said that it is a good thing that the shravan month is saying that they are happy by opening doors for good deeds. The month of full moon is considered as 'Shravan Month' with the hard moon. Monday in the month of shravan Tuesday, Friday, Saturday, Saturday, Full Moon Moon will be said special.

The stories say that lord shiva has taken the moves of the sea in the sea and made a blue eye. This is why every monday of this month will be done to worship Lord Shiva. Devotees will believe that the five years will last when we do the saffron pooja to the goddess of goddess goddess.

It was said that the lord shiva temple made on the Monday of shravan Monday has given amazing results. On this day, Lord Vishnu Vishnu will also do shiva. So on this day, Vishnu will also bless those who made shiva with devotion to him.

Still the worship of the Lord, those who pray will have business development and economic development. Now, as the mother is called Mars Gauri, they will be looking at the pain of 'Shravan Tuesday' on Tuesday. To protect their happiness, married women will take care of this pain with most devotion and attention.

All wealth will be done if women are the most sacred prayer in temples in temples which are the most sacred prayers. Every day in the month of shravan, the events like marriage, prayers, prayers, good deeds.





Post a Comment

0 Comments