జామాకులు జామ పండుతో
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
జామను ఇంటిపెరట్లో పెంచుకోవడంతోపాటు తోటలుగా కూడా సాగుచేస్తుంటారు. జామకాయతో పాటు ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయనడం అతిశయోక్తి కాదు. విరోచనాలు తగ్గించటంతోపాటు, చిగుళ్లలో రక్తం కారకుండా నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. జామ లేత ఆకులతో కాషాయం చేసి తాగితే జ్వరం, కడుపునొప్పి తగ్గుతాయి. జామాకులను పేస్ట్‌గా చేసి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
అలాంటి జామకాయ మనకు ప్రకృతి ప్రసాదించిన వరమని చెప్పవచ్చు. ఎంత కఠినమైన ఆహారం తీసుకున్నా జామపండు తిన్నామంటే సులభంగా జీర్ణమవుతుంది. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా జామకాయలు తినొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. దీనిని పెద్దల ఆపిల్ అని పిలుస్తారు. అమెరికా ప్రజలు మన జామకాయను ఎక్కువ ఇష్టంగా తింటారు.
జామకాయలో విటమిన్‌లు, పీచు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ కాయల్లోని పీచు కారణంగా కొలెస్ట్రాల్, బీపీ తగ్గుతాయి. బరువు తగ్గడానికి జామ, దోహదపడుతుంది. ఇందులోని కార్బొహైడ్రేట్లు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దాంతో పొట్ట త్వరగా నిండిపోతుంది. ఆకలి వేయడానికీ సమయం పడుతుంది. రోజూ ఓ దోర జామపండు తింటే డయాబెటిస్, ప్రొస్టేట్ కేన్సర్ వంటి మరెన్నో వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు.
పేగుల్లోని అధికంగా ఉన్న మ్యూకస్‌పొరను తొలగించి రక్తవిరేచనాలు తగ్గిస్తుంది. జీవక్రియలో జనించే స్వేచ్ఛాకణాలతో పోరాడి వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్ వ్యాధి, శుక్లాలు, కీళ్లవాపులు రాకుండా ఆపుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి, జామకాయలోని ఎక్కువగా ఉండే పీచుపదార్థాల వల్ల ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థను బలంగా చేస్తుంది. అంతేకాక కడుపులోని మలినాలను, అంటువ్యాధులను కలిగించే జీవులను తొలగిస్తుంది.
పోషక విలువలు అధికం:
తేమ 81.7శాతం, మినరల్ వాటర్ 0.7, కొవ్వు0.3 గ్రాములు, ప్రొటీన్లు0.9 గ్రాములు, కార్పొహైడ్రెట్లు 2.3 మిల్లీగ్రాములు, కాల్షియం, 2.3 మి.గ్రా, ఇనుమ 1మి.గ్రా, పొటాషియం 299 మి.గ్రా, సోడియం 4 మి.గ్రా, సల్ఫర్ 14 మి.గ్రా, విటమిన్.ఎ 1.30 మి.గ్రా విటమిన్ 319 మి.గ్రా పోషక విలువలున్నాయి. కమలాల్లోలభ్యమయ్యే విటమిన్ సి జామలో 4 రెట్లు అధికంగా ఉంటుంది. జామలో దేశవాళి, హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. వీటిలో మంచి పోషక విలువలున్నాయి.
ఔషధంగా జామ, పోషక విలువలు కలిగిన జామ అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. సీజనల్‌గా లభ్యమయ్యే జామకాయలు తీసుకుంటే డయేరియా గ్యాస్ట్రిక్, జలుబు, వంటి వ్యాధులను నివారిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహరం.. రోజూ దోర జామకాయ తీసుకుంటే ప్రోస్టెట్ క్యాన్సర్‌ను నివారించవచ్చు.
ఆరోగ్యాన్నిచ్చే జామాకులు:
జామపండే కాదు జామ చెట్టు ఆకులూ మన ఆరోగ్యం విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యమైన జుట్టుకు జామ ఆకులు ఎంతో శ్రేష్ఠమని నిపుణులు అంటున్నారు. జామ చెట్టు ఆకుల ఉపయోగాలేంటో పూర్తిగా తెల్సుకుందాం.
జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. జామ ఆకులు నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది. అంతేనా అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి.
జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యం. నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటిలో ఉండే పొక్కులు పోతాయి.
వీటితో టీ చేసుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు నియంత్రిస్తాయి.
జామాకులతో చేసిన టీ తాగటం వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు పోతాయి. దగ్గు తగ్గిపోతుంది.
ఈ ఆకుల్లో విటమిన్ - బి పుష్కలంగా ఉంటుంది. విటవిన్ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్లల చర్మ సౌందర్యానికి మంచిది.
గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు తలెత్తవు. దీంతో పాటు జుట్టు కుదుళ్లు దృఢంగా తయారవుతాయి.
0 Comments