Ad Code

సీతా మాత జయంతి - Sita Matha Birth Anniversary

సీతా జయంతి


వైశాఖ శుక్ల నవమి ని "సీత నవమి", "జానకి నవమి", "సీతా జయంతి" అని అంటారు, ఈ రోజు సీతా మాత జయన్తీ.

శ్రీ రాముడు కూడా 'చైత్ర మాసం' లో అదే తిథిలో జన్మించారు. మరియు శ్రీరామ నవమి వేడుకలు సీత నవమికి ​​ఒక నెల ముందుగానే జరుగుతాయి. 

సీతా నవమిని భారతదేశం అంతటాఉత్సాహంగా జరుపుకుంటారు.

సీతమ్మ మాయమ్మ - శ్రీరాముడు మా తండ్రి అంటూ శ్రీరామ భక్తులు శ్రీ సీతారాములను ఎంతగా ఆరాధిస్తారో అంతకంటే కాస్త ఎక్కువ మమకారం అమ్మవారి వైపే.

"మా జానకి చెబట్టఁగ మహరాజవైతి వంటూ"

శ్రీ త్యాగరాజాది మహాభక్తులు శ్రీ సీతాదేవినే ప్రస్తుతిస్తారు.

శ్రీ భక్త రామదాసు గారు కూడా "నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి" అంటూ కీర్తించి తన భౌతిక కష్టాలకడగళ్ళను దాటారు.

సీతారాములు అభిన్న తత్వాలని, వారిద్దరూ ఒకే దివ్యజ్యోతికున్న వేర్వేరు అభివ్యక్తులని తులసీ రామాయణం చెబుతుంది.

సీత ప్రధాన స్వరూపమని, అక్షర బ్రహ్మమని, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల సమైక్య రూపమని నిర్ణయ సింధు వ్యక్తపరచింది.

 సీత ఆదిశక్తి, సృష్టి స్థితి లయకారిణి అని చాటింది "రామతాపనీయోపనిషత్తు." సీత ముక్తిదాయని అని "ఆధ్యాత్మిక రామాయణం అభివర్ణించింది."  స్త్రీ ఆదిశక్తి అని "శౌననీయ తంత్రం" ప్రస్తుతించింది. 

వ్యవసాయానికి అధిష్టాత్రి అని "రుగ్వేదం" కీర్తించింది. అధర్వ వేదానికి చెందిన "సీతోపనిషత్తు" సీతను శాశ్వత శక్తికి మూలబిందువుగా అభివర్ణించింది. ‘యోగమాయ’ అని శ్లాఘించింది. 

సీత జగన్మాత అని ప్రశంసించింది "పద్మపురాణం." సాధక సాధ్యమైన దేవిగా ఋషులు తాపసులు కీర్తించారు.

మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. 

ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. 

నాగటి చాలులో లభించినందున ఆమెకు 'సీత' అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. 

కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు. శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము "ఆశ్లేష" నక్షత్రము.  

సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు.

వైదేహీ శబ్దము విదేహ రాజ కన్యక అని కాక దేహమునకు అతీతమైన జ్ఞానమూర్తి అని సూచన ఉన్నది. ఉత్తరకాండలో వేదవతి వృత్తాంతము వస్తుంది. 

ఈ వేదవతి సీత పూర్వజన్మ, ఆమె సాక్షాత్తు వేద స్వరూపురాలు. ఆమె సతీదేవి వలె తనను తాను దహించుకొని సీతాదేవిగా యజ్ఞధాత్రిలో జనకుడు దున్నుచుండగా పెట్టెలో లభించింది. 

వైదేహి శబ్దంలో వేద స్వరూపురాలనే అర్థము స్ఫురిస్తుంది.

 రామాయణమంతా సీతాదేవి యొక్క చరిత్రమని వాల్మీకి చెప్పడం గమనించాలి.

సీతమ్మ నాగేటి చాలు లో లభించిన వూరు సీతమర్హి. ఇది ప్రస్తుతం మన దేశంలో బీహార్ రాష్ట్రంలో వుంది.

సీత + మహి సీతామాఢి అయింది. నాగలి చివరిభాగాన్ని సంస్కృతంలో సీత అంటారు. 

నాగలి చాలులో దొరికింది గనక ఆమె సీత అయింది. నేషనల్ హైవేలో ముజుఫర్ పూర్ కు ఉత్తరంగా సీతామాఢి వుంది. ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో "పునౌరా" అనే స్థలం వుంది. సీతాదేవి పసిపాపగా దొరికిన స్థలం ఇదే. సీత పుట్టిన ఊరిలో జానకీ దేవి తల్లిదండ్రులైన సునయన, జనకుడు.  శతానందుడు మున్నగు పురోహితుల విగ్రహాలు గల ఆలయాలు వున్నాయి.

ఆ పాపను జనకుడు తన శిబిరంలో ఆరు రోజులుంచి తర్వాత జనకపురికి తీసుకువెళ్ళాడని అక్కడి వారు తెలుపుతున్నారు. సీతమర్హి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వున్న

జనకపురి ఇప్పుడు నేపాల్ లో వుంది.

విశేషమేమిటంటే సీతమర్హిలో "సీతా" అన్న పేరే అధికంగా వినిపిస్తే, జనకపురిలో "జానకి" అనే పేరే వినిపిస్తుంది. ఇక్కడ "శ్రీరామనవమి" "సీతా నవమి" ఉత్సవాలను ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున చేస్తారు.

సీతాదేవి అసామాన్యురాలు. ఆమె మూలప్రకృతి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి అంటే సీతాదేవే. అంతేకాదు. ప్రణవనాదమైన ఓంకారంలో ఉంది కూడా ఆ తల్లే. సీత సత్వరజస్తమో గుణాత్మకమైంది. ఆమె మాయా స్వరూపిణి. సకార, ఇకార, తకారాల సంగమం సీత.

స కారం ఆత్మతత్త్వానికి సంకేతం. 

త కారాన్ని తారా అని అంటారు. తరింపజేసేది అని దీనికి అర్థం.

అంటే ఆత్మదర్శనం కలిగించి మనిషిని తరింపజేసేది ఆ మహాశక్తే అని బ్రహ్మ వివరించారు.

సీతాదేవి మొదటి రూపం మహామాయ. దీన్నే శబ్దబ్రహ్మమయీ రూపం అని కూడా అంటారు. వేదాధ్యయనం చేసే చోట ఈ తల్లి ప్రసన్న రూపంతో ఉండి అత్యున్నత, అలౌకిక భావాలను కలగజేస్తుంది.

రెండో రూపం జనకుడు భూమి దున్నుతున్నప్పుడు బయటపడిన రూపం. ఆమెను "భూమిజ" అని కూడా అంటారు.

సీతమ్మ మూడో రూపం అవ్యక్తరూపం. ఇది జగత్తంతా నిండి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగదానందకారిణి సీతమ్మ. ఇచ్ఛ, క్రియ, సాక్షాత్‌ అనే మూడు శక్తుల రూపంగా ఈమెను సాధకులు దర్శించవచ్చని అని బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలందరికీ తెలియజెప్పాడు.

మూల ప్రకృతి రూపత్వాత్‌

సా సీతా ‘ప్రకృతిః‘ స్మృతా!

ప్రణవ ప్రకృతి రూపత్వాత్‌

సా సీతా ‘ప్రకృతిః’ ఉచ్యతే!

‘సీతా’ ఇతి త్రివర్ణత్మా

సాక్షాత్‌ ‘మాయామయి’ భవేత్‌!

సీతోపనిషత్తు అధర్వణ వేదంలో ఉంది. బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారాయి. అది సీతాదేవి మహత్వాన్ని వివరిస్తోంది.

క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర ‘సీత'. సతీ లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేము. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావాలైన మేథావులు  పలు విధాలుగా శ్లాఘించారు. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం. ఆమె చరితం ఓ స్ఫూర్తిదాయకమైన కథాసాగరం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.

శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు తన పుత్రిక సీతాదేవినిచ్చి వైభవంగా వివాహం చేసి పంపాడు. జానకి ఆదర్శ వనిత. ఆమెలోని మేధాశక్తి, సహనం, విచక్షణ, ధర్మాచరణ, తపస్సు, ఆత్మ సంయమనం, భర్త పట్ల గల అచంచల భక్తి, ప్రేమ మొదలైన ఆదర్శవంతమైన లక్షణాలు ఎప్పటికీ అనుసరణీయమైనవే. భర్త వెంట అడవులకు వెళ్ళి నిరాడంబరంగా జీవితం గడిపింది. భర్తకు తోడుగా నీడగా అడవినే అయోధ్యగా భావించింది. కష్టాలను ఇష్టాలుగా చేసుకొంది. అవసరమైనప్పుడు తర్కం చేస్తుంది, చర్చ చేస్తుంది. సలహాలిస్తుంది. అసురులను అంతం చేస్తానని భర్త అక్కడి రుషులకు వాగ్దానం చేసినప్పుడు అందులోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తుంది. ఆమె లేని రాముడు లేడు. రాముడు లేక సీత లేదు. అంతటి అపురూప దాంపత్యం వారిది.

ధర్మమూర్తి: సీత ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గృహిణిగా మారిన మహాసాధ్వి ‘సీతాదేవీ'. రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్లినప్పడు తన భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది.

వివేకవంతురాలు: రావణాసురుడు తనను అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు, రాముడికి తన ఆనవాళ్లు చిక్కడం కోసం బంగారునగలను నేల మీద జారవిడిచిన వివేకవంతురాలు సీత.

ప్రేమమూర్తి: సీతకు రామునిపై ఎంతటి ప్రేమానురాగాలంటే, ఆ ప్రేమలో తనను తానే మైమరిచిపోయేది. రావణుడి చెరలో బందీగా ఉండి కూడా నిత్యం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరేది.

చైతన్యశీలి: సీత ఎంత చైతన్యశీలి అంటే అపాయంలో కూడా భయంతో ఆమె శత్రువులకు లొంగలేదు. రావణడు సీతను బెదిరించి, తన వశం కావాలని ఆదేశించినప్పుడు, ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని నువ్వు నాకు దీనితో సమానం అని చెప్పకనే చెప్పి అతని ధర్మహీనతను ప్రశ్నించిన ప్రజ్ఝావంతురాలామె.

క్షమాగుణం: రాక్షస సంహారం తర్వాత సీతను అవోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో, తను బందీగా ఉన్నప్పుడు ఆ వనంలో తనను మాటలతో హింసించిన రాక్షసులకు ఏ కీడు తలపెట్టవద్దని, వారు స్వామిభక్తితో తమ బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని ఆనతిచ్చిన పరమకారుణ్యమూర్తి.

రావణ వధ తరవాత భర్త ఆజ్ఞ మేరకు అగ్నిలో చేరి తన పాతివ్రత్యం నిరూపించుకుంది.

భర్త చేత పరిత్యక్త అయిన భార్యకు అది అవమానం కాదని, ఆత్మవిశ్వాసంతో కాలానికి ఎదురీదాలని సందేశమిచ్చింది. వాల్మీకి ఆశ్రమంలో తలదాచుకుని యోధాగ్రేసరులైన లవకుశలను కని భర్తకప్పగించి తన తల్లి భూదేవి ఒడిలోకి చేరిపోయింది.

హిందూ సమాజంలో స్త్రీ ప్రవర్తనకు, ఆలోచనకు సీతా చరిత్ర మార్గదర్శకంగా నిలిచిపోయింది. సీత దేవి ఎంతో గొప్పగ జీవించి సమాజానికి ఒక మార్గదర్శిగా నిలిచి ఆమె చరిత్రను రాసిన శ్రీ వాల్మీకి మహాముని సీతాయాశ్చరితం మహత్ అని కీర్తించారు.

అందుకే శ్రీమద్వాల్మీకి రామాయణం మనందరికీ నిత్య పారాయణ గ్రంథమై విరాజిల్లుతోంది.

సీతాదేవి ఆవిర్భవించిన ఈ రోజున ఉదయాన్నే తల స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరాలలో సీతారాములకు పూజాభిషేకాలు నిర్వహించాలి. 

ఆలయాలలో గల సీతమ్మ వారికి నూతన వస్త్రాలను సమర్పించాలి. ఈ రోజున రామాయణాన్ని పఠించడంతో పాటు, దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సీతారాముల ఆశీస్సులు లభిస్తాయనీ సకల శుభాలు కలుగుతాయని ఆర్యోక్తి.


సీతామాత:

సీతా జయంతి శుభాకాంక్షలు, ఈ ఫోటో సీతమ్మది కాదు కాని మంచి ప్రవర్తన ధైర్యం ఉన్న ప్రతి ఆడపిల్ల సీతమ్మతల్లే. ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు చదువులకని దేశవిదేశాలకు వెళ్తున్నారు ఎక్కడ ఉన్నా వారి విలువలను తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వారి గౌరవాన్ని కాపాడుకునే స్త్రీలు ఉన్నారు అటువంటి వారంతా సీతమ్మతల్లులే. ఇన్ని వేల సంవత్సరాలు తర్వాత కూడా ఆమెను ఆదర్శంగా నా తల్లి అగ్ని పునీత సీత అని చెప్పుకుంటున్నాము అంటే ఆమె కారెక్టర్ అటువంటి స్థానాన్ని గౌరవాన్ని ఇచ్చింది. ఆడపిల్లలకు వ్యక్తిత్వం ఉండాలి ఆత్మాభిమానం ఉండాలి బాధ్యత ఉండాలి అంతే ప్రేమ కూడా ఉండాలి. అటువంటి అడవాళ్ళంతా మా సీతమ్మ తల్లుల్లే.

పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తూ అదేదో స్వేచ్ఛ అని చెప్పుకుంటున్న ఆడవాళ్ళని చూసి అడవాళ్ళంతా అలానే ఉంటారు చదువుకునే వారంతా అలానే తయారు ఐయ్యారు అని అందరిని తప్పుగా అనుకోకూడదు. మంచి కన్నా చెడు ఎక్కువగా వ్యాపిస్తుంది అలా అని లోకం అంతా అలానే ఉండదు. మంచి ప్రవర్తన ఉన్న అడపిల్లలే మంచి సమాజానికి కూడా కారణం అవుతారు మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సత్ప్రవర్తన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారికి సమాజం ఎంత గౌరవిస్తుందో వారికి ఎంత విలువ ఉంటుందో పిల్లలకు అర్థం ఐయ్యే విధంగా తల్లిదండ్రులు పెంచాలి.


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ



Sita's birth anniversary



Vaisakha Shukla Navami is known as "Sita Navami", "Janaki Navami", "Sita Jayanthi". Today is Sita Mata Jayanthi.

Sri Rama was also born on the same date in 'Chaitra Maasam'. And Sri Rama Navami celebrations will happen one month before Sita Navami.

Sita Navami is celebrated with enthusiasm all over India.

Seetamma Mayamma - Sri Rama devotees worship Sri SitaRama by saying that Srirama is our father, more affection towards Ammavaru is less than that.

"Cooking Maharajavaiti as told to our Janaki"

Sri Tyagarajaadi Maha devotees will present Sri Sita Devi only.

Sri Bhaktha Ramadas garu also crossed the limits of physical difficulties by praising "Sitaamma Talli" by praising him saying "Nannu brovamani Sita Talli".

Tulsi Ramayana tells us that Sita and Rama are different manifestations of the same divine light.

Nishya Sindhu expressed that Sita is the main form, the Akshara Brahma, the combined form of will, action and knowledge.

Ramatha Paniyopanishattu shows that Sita is the first power and the state of creation. Spiritual Ramayana described as "Sita is the liberator". Shaunaniya Tantram has introduced "Woman is the first power".

"Rugveda" hailed as the master of agriculture. "Seetopanishattu" from the Adharva Vedas describes Sita as the root point of eternal power. hailed as 'yogamaya'

Padma Puranam is the one who praised Sita as Jaganmata. "The sages and tapas are praised as the goddess of achievement."

Midhilapura leader Janaka Maharaju was doing yagam and plowing the land, a box obstructed the plow.

When I opened the box, I found a baby girl.

Janaka Maharaju and his wife Sunayana Allaru adopted the child as she was found in Nagati Chalu.

So it is said that Sita is the daughter of Bhudevi. Birth star of Sri Seetamma "Ashlesha" star.

Sita was not born in the womb, so it is called Ionia.

There is a hint that Videhi sound is not Videha Rajakanyaka but it is a wisdom beyond the body. Vedavathi circle will come in Uttarakanda.

This Vedavati is Sita's previous birth, she is the real Veda form. She burnt herself as Satidevi and acted as Sita Devi in a yagdhatri Janakudu was found in a coffin.

The meaning of Veda forms in the sound of Vaidehi inspires.

It should be noted that Valmiki is told that the entire Ramayana is the history of Sita Devi.

Seetamarhi is the place found in Seetamma Nageti Chalu. This is present in our country Bihar state.

Sita + Mahi has become Seetamadi. The last part of the plow is called Sita in Sanskrit.

She became Sita as she was found in the plow. Sitamadi on national highway north of muzaffarpur There's a place called "Punaura" about a kilometer away. This is the place where Sita Devi was found as a child. Sunayana and Janakudu became the parents of Janaki Devi in the birth place of Sita. There are temples with statues of Sathanandudu Munagu priests.

The people from there inform that the girl was taken to Janakapuri after six days in his camp. 30 kms away from Sitamarhi

Janakapuri is now in Nepal.

What is special is that if the name "Sita" is heard more in Sitamarhi, the name "Janaki" is heard in Janakapuri. Here "Sri Rama Navami" and "Sita Navami" celebrations are celebrated in large numbers every year.

Sita Devi is extraordinary. She is the original nature. In one word, nature means Sita Deva. Not just that. That mother is also in the Omkaram which is the sound of Pranavan. Sita quickajastamo has become characteristic. She is a form of magic. Sita is the union of Sakara, Ikara and Takaraala.

Government is a sign of self-sufficiency.

The universe is called a star. This is meant to be deported.

Brahma explained that it is the super power that makes a man to see himself and drive him away.

Mahamaya is the first form of Sita Devi. This is also known as the form of sound Brahmamayi. In the place of studying Vedas, this mother is in the form of Prasanna and gives us superior and supernatural feelings.

The second form is the form that was revealed when Janakudu was plowing the land. She is also known as "Earth".

The third form of Seetamma is the incarnation. This would be all over the world. To say in one word, Jagadananda Karini Seetamma. Brahma told all the gods who came to him that devotees can see her in the form of three forces called Icha, Kriya and Sakshat.

The original nature of nature

Sa Sita 'Nature' Smritha!

Pranava is the nature of nature

Sa sita 'nature' uchyathe!

'Sita' is a tricolor

Sakshat 'mayamayi' Bhavet!

Seetopanishattu is in the Vedas. The things explained by Brahma to the gods who came to him have changed into upanishatu. That is explaining the importance of sitadevi.

'Sita' is a noble character of a woman with forgiveness, kindness, courage, wisdom and self respect. There is no Ramayana without Sati. We cannot imagine Rama's life without Sita. That is why in the history of Ramayana, many great intellectuals praised her role in many ways. The virtues of Sita are ideal for today's men. Her story is an inspiring story. Whatever step is taken in Ramayana, Sita's qualities will stand as ideal for everyone.

Janaka Maharaju gave his daughter Sita Devi to Sriramachandramurthy who broke Shiva's bow and sent her to her grand marriage. Janaki is a role model woman. Her ideal qualities like intelligence, patience, discernment, virtue, penance, self-control, unwavering devotion to husband, love etc are always eminent. She went to the woods with her husband and lived a modest life. She considered the forest as a shadow along with her husband. She turns her difficulties into pleasures. Will logic and discuss when necessary. Suggestions. Questions the validity of the husband when he promises the saints there he will end the demons. There is no Rama without her. Without Rama there is no Sita. Such a wonderful couple they have.

Dharmamurthy: As a housewife under the responsibility of her husband, she also participated in the duty strike and became an ideal housewife by becoming a great saint 'Sita Devi'. When Rama obeyed his father's promise and went to the forest, she followed her husband's footsteps and performed her duty as a dharmapatni who was ready to share in his hardships.

Wise woman: When Ravana was abducting and taking her away, Sita slips gold coins on the floor for Rama to catch her happiness.

Premamurthy: How much love does Sita have for Rama. She will drown herself in that love. Even after being captive in the lap of Ravana, she always chants Sri Rama's name everyday and seeks well-being every moment.

Consciousness: Sita is so conscious that even in danger, she did not bow down to her enemies. When Ravana threatened Sita and ordered his possession, Prajavanturaalaam questioned his immorality by keeping a grass leaf on the side and not telling me that you are equal to this.

Forgiveness: While taking Sita out of confusion after demonic assassination, Paramakarunyamurthy relies on the demons who tortured her with words in the forest when she was captive, and that they only fulfilled their responsibility with devotion to Swami.

After Ravana's murder, she proved her obedience by joining the fire as per the order of her husband.

A message to a wife who was perfected by her husband that it is not a shame, but to face the time with confidence. Hiding her head in Valmiki Ashram, after seeing the warriors Lavakusha, her husband covered her head and joined the lap of her mother Bhudevi.

The history of Sita has stood as a guide to the behavior and thinking of women in Hindu society. Sri Valmiki Maham who lived a great life and served as a guide to society and wrote her history is praised as Sita Ayashcharitam Mahat.

That is why Srimadwalmiki Ramayana is becoming a daily recitation book for all of us.

On this day on which Sita Devi appeared, one should bath the head and wear clean clothes. Pooja abhishekam should be conducted for Sita and Rama in Pooja temples.

New clothes have to be offered to Seethamma in the temples. Along with reading Ramayana on this day, you have to do charity. Aryokthi says that if you do this, you will get the blessings of Sita Rama and all the good things will happen.


Sita Mother:

Sita Jayanthi greetings, this photo is not of Seetamma but every girl who has courage to behave well is Seetamma's mother. These days girls are ruling in all fields without education, they are going to countries and countries. Wherever they are, there are women who protect their parents' trust and respect. Such are all grandmothers. Even after thousands of years, she is called as my mother Agni Puneeta Sita as an ideal. Her character has given her such a place and respect. Girls should have personality, self-esteem, responsibility and love too. All such forests are our Seetamma's mother's only.

Don't mistake everyone for not getting married and claiming that they are free by seeing the women who are living in a relationship without marriage and claiming that all the forests are like that and educated people are made like that. Bad spreads more than good, just like that, the whole world will not be like that. Girls who have good behavior will be the reason for a good society. There are many good people. Parents should bring up the children in such a way that they understand how much the society respects them and how much they value them.





Post a Comment

0 Comments