Ad Code

గంగా నది పుష్కరాలు - Ganga river flowers

గంగా నది పుష్కరాలు


భారతదేశంలో గంగా నది అత్యంత ప్రముఖమైనది మరియు పవిత్రమైన నది, శ్రీ మహా విష్ణువు పాదాల నుండి ఈ పుట్టింది గంగ తల్లి. హిందువులు పుష్కర స్నానం పవిత్రమైనది. పుష్కర స్నానం చేయడం వల్ల పాప హరణం అవుతుంది అని హిందువులకు అతి పెద్ద నమ్మకం. ఇప్పుడు ఎక్కడ కనిపించినా నాగ సాధువులు, అఘోరాలు ఈ పుష్కరాల్లో కనిపిస్తారు.

పుష్కరుడు ఒక సంవత్సరం ఆ నదిలో పుష్కరాలు జరిగితే ఆ నదిలో ఉంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22న గంగా పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పుష్కరకి అర్ధం 12 సంవత్సరాలు అని అర్థం. గంగా పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత వచ్చింది.

గంగా పుష్కరం బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు ఏప్రిల్ 22న ప్రారంభం అవుతుంది, బృహస్పతి మీనంలో ప్రవేశించినప్పుడు మే 3, 2023న ముగుస్తుంది.

బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన  మీనంలో ప్రవేశించినప్పుడు  గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. అయితే పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజూలలో గంగా నదిలో స్నానం చేయటం వలన సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని గంగా నదిలో అనేక మంది భక్తులు స్నానాలు చేస్తారు.

పుష్కరుడు కథ:

పుష్కరుడు ఒక బ్రాహ్మణుడు. బ్రహ్మ దేవుడు పుష్కరుడు సృష్టికర్త. పుష్కరుడు మహా శివుడి కోసం తపస్సు చేశాడు అని పురాణాల్లో ఉంది. పుష్కరుని తీర్థ రాజు అని పిలుస్తారు. సామాన్యులు అందరూ నది స్నానం చేయడం వల్ల ఆ నది పవిత్రత క్షీణించడానికి గమనించిన పుష్కరుడు చాలా చింతించేవాడు. దాని కోసం పరమ శివుడి కోసం తపస్సు చేసి నదుల దోషములన్నిటిని ప్రక్షాళన చేసే మార్గాన్ని అర్థించాడు. అతని తప్పసుకి మెచ్చి శివుడు పుష్కరుడుకి తను కోరిన వరం ఇస్తాడు. శివుని వరం వల్ల పుష్కరుడు పవిత్రుడు మరియు అనంతమైన శక్తి ప్రాప్తించింది అవుతారు. పుష్కరుడు ఆ నదిలోకి ప్రవేశిస్తాడో ఆ నది పవిత్రం అవుతుంది.

నదులలోని పాపాలన్నింటినీ తొలగించ గలగే వరం లభించింది. ఆ కారణం వల్ల 12 నదులన్నీ తమలో పవిత్రత నింపాలి అని పుష్కరుడు కోరుకుంటాడు. అటుపిమ్మట పన్నెండు పుణ్య నదులలో పుష్కరుడు ఉండేలా ఏర్పాటు అయింది. బృహస్పతి యొక్క సంచారాన్ని బట్టీ పుష్కరాలు నిర్ణయించబడతాయి. అంటే మిథున రాశి, వృషభ రాశి, మేష రాశి, కన్య రాశి ఎలా మోతం అన్నీ రాశిలో ఎప్పుడైతే గురుడు సంచరిస్తుంటాడో, అప్పుడే పుష్కరుడు నదులలో నివసించేలా చేసుకుంటాడు. పుష్కరుడు ప్రవేశిస్తుంచిన మొదటి 12 రోజులను పుష్కరాలు అని అంటారు. ఒక సంవత్సరం పాటు ఆ నదిలో ఉంటారు కానీ ఆది పుష్కరం ముగిసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఒక్క 2 ముహూర్త కాలంలో మాత్రమే ఉంటారు.దేవగురుడైన బృహస్పతి పన్నెండు రాశుల్లోనూ ఏడాదికి ఒకరాశి, చొప్పున సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఒక రాశినుంచి మరో రాశిలోనికి మారిన మొదటి పన్నెండు రోజులు పుష్కరాలుగా నిర్ణయిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కోనది చొప్పున భారతదేశంలోని పన్నెండు పవిత్రనదులకు వరుసగా పుష్కరాలు ఉంటాయి. ఆ ప్రకారం 2023 ఏప్రిల్ 22 శనివారం నుంచి 2023 మే 3 బుధవారం వరకు గంగానది పుష్కరాలు నిర్వహిస్తారు.

భారతీయులకు గంగానది అత్యంత పవిత్రమైనది. స్వర్గలోకంలో ఉండే మందాకినిని భగీరధుడు తన తపస్సు తో నేలకు రప్పించాడని చెబుతారు. మూడు లోకాల్లోనూ ప్రవహించే కారణంగా గంగను త్రిపథగ అని పిలుస్తారు. గంగానది పుట్టిన గంగోత్రి, హరిద్వార్, వారణాశి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో గంగానది పుష్కర విధులను ఆచరించవచ్చు. పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధవిధులు నిర్వహిస్తారు. పుష్కర స్నానం, దానం అత్యంత పుణ్యప్రదాలు.

గంగా నది ప్రధాన పుష్కర్ ఘాట్ వాటి పేర్లు:

1. వారణాసి

2. గంగోత్రి

3. హరిద్వార్

4. బద్రీనాథ్

5. కేదార్నాథ్

6. ప్రయాగ 

7. అలహాబాద్

వారణాసిలో గంగా పుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్‌లు ఉన్నాయి. అన్నింటిలో మణికర్ణికా ఘాట్ ముఖ్యమైనది.


గంగా ఘాట్లలో చేయవలసినవి & చేయకూడనివి:

1. నది ప్రాంగణాన్ని శుభ్రంగా మరియు చక్కగా ఉంచండి.

2. పూజ లేదా ఏదైనా వివరాల కోసం నమోదిత పురోహితులను మాత్రమే సంప్రదించండి. 

3. క్యూ పద్ధతిని అనుసరించండి.

4. నదిలో వ్యర్థ పదార్థాల ద్వారా వెళ్లవద్దు.

5. ఘాట్లో స్నానానికి సబ్బులు, షాంపూలు ఉపయోగించవద్దు.

6. నాణేలు మరియు ఇతర వస్తువులను నదిలో వేయవద్దు.

7. ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు వైద్య వ్యర్థాలతో నదిని కలుషితం చేయవద్దు.

ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు వస్తాయి?

1. మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగానది పుష్కరాలు,

2. వృషభ రాశి యందు ప్రవేశించినప్పుడు నర్మదా నది పుష్కరము,

3. మిథున రాశి యందు గురుడున్నచో సరస్వతీ నదికి పుష్కరాలు, 

4. కర్కాటక రాశి యందున్న యమునా నదికి,

5. సింహరాశి యందున్న గోదావరి నదికి,

6. కన్యారాశి యందున్న కృష్ణానదికి,

7. తుల యందున్న కావేరీ నదికి,

8. వృశ్చిక రాశి యందున్న భీమరథీ నదికి, 

9. ధనూరాశి యందున్న పుష్కర నదికి, 

10. మకరమందున్న తుంగభద్రా నదికి, 

11. కుంభ మందు సింధునదికి,

12. మీన రాశి యందు ప్రణీత నదికి పుష్కరాలు ఏర్పడును.



సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ



Ganga river flowers

River Ganga is the most famous and sacred river in India, mother Ganga was born from the feet of Sri Maha Vishnu. Pushkar bath by Hindus is sacred. Hindus have a big belief that by doing Pushkara bath all sins will be washed away. Naga saints and Aghoras will be seen in these Pushkaras.

Pushkar will stay in that river for a year if Pushkaram happens. Ganga Pushkaras will start on April 22 this year. Pushkara means 12 years. Ganga Pushkaras came after 12 years.

Ganga Pushkaram starts on April 22nd when Jupiter enters Aries and ends on May 3, 2023 when Jupiter entered Pisces.

Ganga pushkaram starts when Jupiter enters Aries, Ganga pushkar is completed when Jupiter entered Pisces which is the twelfth zodiac sign. The spring usually lasts about one year. But the first twelve days of the Pushkaram are treated as the beginning Pushkaram and the last twelve days as the final Pushkaram. These first and last twelve days are extra special.

Since Jupiter entered the zodiac sign Aries, Pushkar would have come to the river Ganga with all the gods. Many devotees take bath in the river Ganga in these twelve days as bathing in all the pilgrims will get the result of bathing in all the Tirthas.

The story of Pushkaradu:

Pushkar is a Brahmin. Brahma is God Pushkar is the creator. It is in myths that Pushkar did penance for Maha Siva. Pushkar is known as Theertha Raju. Pushkar was very worried when he noticed that the sanctity of the river has decreased due to the common man bathing in the river. For that he did penance for Lord Shiva and understood the way to cleanse all the mistakes of the rivers. Shiva will give Pushkar the boon he wants by liking his mistake. Pushkar becomes pure and possesses infinite power by the grace of Lord Shiva. Pushkar enters into that river, that river becomes sacred.

Got the boon to wash away all the sins in the rivers. Pushkar wants all the 12 rivers to fill them with holiness for that reason. Arrangements have been made to keep Pushkar in the twelve holy rivers of Atupimmata. Butty pushkars are determined by the movement of Jupiter. That means Gemini, Taurus, Aries, Virgo, etc. in the same zodiac sign, when Jupiter travels, then only Pushkar will make them live in rivers. The first 12 days introduced by Pushkar are called Pushkaras. They will stay in that river for a year but after the Adi Pushkaram is over, they will stay in the afternoon only for one or two moments. Jupiter, who is the god, will be roaming around with one zodiac sign in a year in every 12 zodiac signs. The first twelve days of his transition from one zodiac to another will be decided as pushkaras. Twelve holy rivers in India will have consecutive Pushkaras, one by one year. In that regard Ganga river Pushkaralu will be held from Saturday April 22, 2023 to Wednesday May 3, 2023

River Ganga is the most sacred place for Indians. It is said that Bhageeradha brought down the Mandakini in heaven with his penance. Ganga is called Tripadhaga because it flows in all three worlds. Pushkara duties of Ganga can be performed in famous holy places like Gangotri, Haridwar, Varanasi. Shradhavidhulu will be performed for the fathers and goddesses during Pushkarala. Pushkara bath and donation are the most sacred things.

The names of the main Pushkar Ghat of river Ganga:

1. Varanasi

2. Gangothri

3. Haridwar

4. Badrinath

5. Kedarnath

6. Pray for me.

7. Allahabad

Ganga Pushkar bath has 64 bath ghats in Varanasi. Manikarnika ghat is important in everything.

Do's & Don'ts of Ganges:

1. Keep the river grounds clean and tidy.

2. Contact only registered priests for pooja or any details.

3. Be sure to follow the queue method.

4. Don't go through the waste in the river.

5. Do not use soaps and shampoos in the ghat.

6. Don't throw coins and other things into the river.

7. Don't pollute the river with plastic waste and medical waste.

Which river gets pushkars when?

1. When entering into Aries, river Ganga is full of pushkaras,

2. Narmada river Pushkaram when entering into Taurus

3. Gurdunnacho Saraswati river in Gemini zodiac sign, Pushkaras

4. To river Yamuna which has cancer zodiac sign,

5. To the Godavari river in the name of Lion,

6. To Krishna river in Virgo,

7. To the Cauvery river in Tula,

8. To the Bhimarathi river which has Scorpio zodiac sign,

9. To Pushkara river in Sagittarius,

10. To the Tungabhadra river in Makaram,

11. Aquarius medicine to Indus river,

12. Praneetha river will have flowers in the zodiac sign of Pisces.


Post a Comment

0 Comments