సుబ్రహ్మణ్య షష్టి అంటే ఏమిటి?
మార్గశిరమాసం లో సుబ్రహ్మణ్య షష్టి విశేషాలు:
సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి . ఇది దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు ఉన్న ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు చేస్తారు. ఆలయ సమీపంలో తీర్దాలు, జాతరలు ,తిరునాళ్ళు ఆధ్యాత్మిక వినోద కార్యక్రమాలు జరుపుతారు.
ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం.
కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు.
శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు.
సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి.ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.
దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు.
కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు.
ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది.
పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న "తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు.
అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు.
ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు.
అని తరుణోపాయం చెప్పాడు.
దేవతలు శివున్ని ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు.
అది గమనించిన పరమ శివుడు
తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు.
దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు.
ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు.
ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా
ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తీకేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు.
కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి,
దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.
అంతట ఆ కుమార స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.
సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" గా పిలుచుకుంటున్నాము,
"శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.
సుబ్రహ్మణ్యషష్ఠి పూజలు ఫలితాలు
జాతకంలో కాలసర్పదోషం ఉన్న వారు,కుజ,రాహు,కేతు దశలు నడుస్తున్నవారు,కుజ దోషం ఉన్నవారు, సంతానంలేని వారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారు.
సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి, సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు.
సర్ప పూజలు ,తాంత్రిక పూజలు చేసే వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామార్ద్యాలు కలిగి ఉంటారు. సుబ్బరాయుడు బాలుడైన బాల సుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా, అనేక రూపాలలో ఈ షష్ఠినాడు పుజలందుకోవటం జరుగుతుంది
సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ సమర్పిస్తారు.
బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.
తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు.
"శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది.
మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రత గంథాలు పేర్కొంటున్నాయి.
సుబ్రహ్మణ్య షష్టి పండుగ విశేషాలు:
ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ అర్పిస్తుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. "సుబ్బరాయుడి పెళ్లి చూచి వద్దాం రండి" అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు.
అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి (కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు) పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది.
కొన్ని ప్రాంతాల్లో, షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనావయితీ.
తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది.
సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలో తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది.
ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది.
సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం
ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి. మార్గశిర మాసమంటే చలి పులిగా మారి పీక్కుతినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది.
ఈ వ్రతం అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వత్రంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు.
శ్రీ శ్రీ శ్రీ షణ్ముఖస్తుతి
ధ్యానం:
ధ్యాయేత్షణ్ముఖమిందుకోటిసదృశం రత్నప్రభాశోభితం
బాలార్కద్యుతిషట్కిరీటవిలసత్కేయూరహారాన్వితం ॥ 1॥
కర్ణాలంబితకుండలప్రవిలసద్గండస్థలాశోభితం
కాంచీకంకణకింకిణీరవయుతం శృంగారసారోదయం ॥ 2 ॥
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం శ్రీద్వాదశాక్షం గుహం
ఖేటం కుక్కుటమంకుశం చ వరదం పాశం ధనుశ్చక్రకం ॥ 3 ॥
వజ్రం శక్తిమసిం చ శూలమభయం దోర్భిర్ధృతం షణ్ముఖం
దేవం చిత్రమయూరవాహనగతం చిత్రాంబరాలంకృతం ॥ 4 ॥
షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ |
రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౧ ||
జాజ్వల్యమానం సురవృందవంద్యం కుమార ధారాతట మందిరస్థమ్ |
కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౨ ||
ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్ |
శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౩ ||
సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ |
సుధార శక్త్యాయుధ శోభిహస్తం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౪ ||
ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ |
గంగోద్భవం సర్వజనానురాగం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౫ ||
బ్రాహ్మణ్యం బ్రాహ్మణో తోయం కర్మణ్యం జనసంపదాం అగ్రగణ్య మహాధ్యక్షం సుబ్రహ్మణ్య ముపాస్మహే.
స్కందాయ కార్తికేయాయ పార్వతీ నందనాయచ మహాదేవ కుమారాయ సుబ్రహ్మణ్యయతే నమః
షణ్ముఖం చ గణాధీశం సాంబంచ పరమేశ్వరం మమదుఃఖ వినాశాయ సంతతం చింతయామ్యహం
తప్తచామీ కరప్రఖ్యం శక్తిబాహుం షడాననం మయూర వాహనారూఢం స్కంద రూపం శివం స్మరేత్
ఈ శ్లోకాన్ని పఠించితే శత్రు విజయం చేకూరుతుంది
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం.
దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం
స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం.
కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం
సుబ్రహ్మణ్య షష్ఠి నాడు తప్పనిసరిగా పఠించాల్సిన మంత్రాలు
ఈ సుబ్రహ్మణ్య షష్టి కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యం.
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
What is Subrahmanya Sashti?
Learn about Subrahmanya Shashti in the month of Margashiram
Subramanya Shashti or Subramanyeshwara Shashti. This is the festival after Diwali festival. This is also known as Subbarayashasti and Skandashasti. On the day when Subrahmanyeshwara was born
Let's celebrate this festival. Especially in Tamil Nadu, special pujas are performed today everywhere subramanyeswara swamy temples and Kumaraswamy temples. Spiritual entertainment programs will be held near the temple, fairs, festivals.
It is a custom to celebrate Sri Subrahmanya Shashti festival every year in the month of Margasira.
Because he was born in Krithika star, he is Karthikeya, because he was born in Rellupoda, he is Sharavana Bhava, because he has six faces, he is Shanmukhuda... He is also famous with the names of Skandudani, Senani and Subrahmanyeshwara.
Srivalli, Devasena and his wives.
Subrahmanyeshwara's vehicle is peacock. Karthikeya, who appears with six faces, eight shoulders and enormous weapons, appears in the form of Sarparupam, Magashira Sudhashastinadu. On that day, by measuring him as a serpent, worshiping him with shoda rituals and pouring milk in the putta, the wishes will be fulfilled.
Devendra Margashira Sudha Shasti acted as "Sri Subramanya Shasti" on the day when Subrahmanyaswamy got married to Devasena.
Kumaraswamy was not born from mother's womb, Parvathi Parameshwara accepted him as son in story order.
This matter can be seen in Mahabharata forest festival.
Goddesses surrendered to Brahma to seek protection from the devil named "Taraka Surudu" who terrorized the three worlds.
Then that Brahma gave a suggestion to them.
This star actor Amit Tapobala is rich, strong, so killing is not in our generation but because of Ishwara Tejamsha Sambhava, he said that his death will be there. Therefore, you get married to Parvati Devi, the daughter of Himavantha to Shiva. Their son will be able to kill the star
That's what Tarunopay said.
Goddesses persuaded Shiva to marry Parvathi. Once upon a time Parvati Parameshwara was in solitary love, the fire god in the form of a pigeon enters their solitary temple.
That is observed by the Supreme Lord Shiva
He puts his divine light into the flame.
Not able to bear it, he releases that divine glory in the river Ganges.
That brightness at that time, the shut who is bathing in that river enters the womb of the goddesses of Krithikala. They can't bear that RudraTejam and throw it in the bushes. Emerges as a divine boy with six faces of brilliance.
Parvathi Parameshwara came to know about this as Rudransha Sambhuthu
That Shanmukhu will be taken to Kailasam.
The boy was in the womb of Ganges as he was in the form of Tejorupa in the form of Ganges, because he was raised and raised by Sutt Krithikalu and Six faced Agutavalla Shanmukhuda, Karthikeya, son of Gaurishankar, called Kumaraswamy and Subrahmanyaswamy .
Parvati Parameswara and Goddesses made this child as Kumaraswamy, who was born for a reason.
When Parameshwara appointed as the chief of all the gods and gave weapons like "Soolam", that Jaganmatha blessed Parvati's son and gave weapons called "Shakti" and made him the almighty and chant the war shankharava on Tarakasuru.
That Kumara Swamy being a peacock vehicle form six faced twelve hands and carrying arrows with six hands and six hands and killing the demon army at once, "Sarparupam" by digging the demons and destroying the demons and destroying Tarakasuru in the Bhikara war. He has risen and won.
We call this day as "Sri Subrahmanyashashti" on which this swamy, who is the most powerful form got married to Devendra Devasena.
Devotees are celebrating Kalyanotsavams and Sahasranama poojas with Srivalli Devasena.
Results of Subrahmanyashashti rituals
People who have Kala Sarpadosham in their horoscope, those who are walking Kuja, Rahu, Ketu stages, Kuja dosham, childless, unmarried, those who are having problems in their married life will get good results by following the fasting vrat and offering it with shoda rituals.
Women and men who are not aware of the fate of children will perform sarpapujas on this day and specially worship this Swami Marshira Sudha Shastinaadu for the sake of offspring and for the victory of the enemy.
Those who perform snake rituals and tantrika rituals, if they perform pujas on Subrahmanya Shashti, they will have immense power and abilities. Subbarayudu is worshipped in many ways and in many forms such as Bala Subramanya and as an adult Subrahmanyamanya, Skandudu and Shanmukhudu
On the day of Subramanya Shasthi, after taking bath in the morning, without taking any food, they go to Subramanya Swamy temple with wet clothes and offer flowers, fruits and other forms there.
It is best to call a bachelor Brahmin to his home and treat him as Subrahmanyaswamy and give him a meal and a pair of panches with tambool.
To those who measure him with devotion
He will speedily deliver leadership, success, disease prevention, fertility, land acquisition.
Reading and chanting the six letter mantra called "Saravanabhava" also gives good results.
Vrata Ganthas say that Margashira Shashtinade Champa Shashti and Pravara Shashti should also be done.
Features of this festival :
Without taking any food, flowers, fruits and other forms are offered to Subrahmanyaswamy temple with wet clothes. It's all about nagapooja Subrahmanyaswamy appears to be a married man in mythology. This is why this Shastinadu is seen to be done with Valli Devasena along with Subrahmanyaswamy marriages. Children used to sing the song "Come and see Subbarayudu's marriage" on this occasion.
But there is also a method of worshipping Subramanya Swamy Murthy who is a bachelor before marriage. As part of that method, the bachelors (three or five bachelors in some places) are worshipped, offered clothes and served lunch.
In some places, fasting on Shashti and serving food to a bachelor Brahmin on the next Saptami is also a necessity.
In Tamil areas today, the Kavadi's demand will be fulfilled. The main thing in this is to carry a kavadi to Shashtinadu Kumaraswamy temple. The pots in the pot are filled with sugar and milk. Kavadi with panchadara and milk depends on the nose. The festival was very popular.
Some people believe that after Subrahmanya Shashti, rains will also stop. Farmers think this is a good time to do chores in the rain. People believe that those who perform Subrahmanya Pratishta will have children.
There is a belief that if you perform the Sarpa Mantra as a strike on this day, it will work with great power for the next year.
Social benefit due to Subrahmanya Shashti Vratam
The donations in this fasting fate will tell the answer. Margashira month means the season in which cold tiger is plucked. Cold is giving a message to avoid suffering from others in this season.
This vratam is why the elders say to donate blankets and blankets as part of the vratam.
Sri Sri Sri Shanmukhastuti
Meditation
A crores of scenes of meditation are like Ratna Prabha's splendor
Balark's electricity crown is available at Satkeyuraharaanvitam 1
Karnalambitha Kundala Pravila Sadgandasthala is beautified
Kanchi Kankankinkineeravayutam, the dawn of sex ం 2
Dhyayadeepsitha Siddhidam Sivasutam Sridvadaashaksham cave
Khetam Kukkutamankusham Square Flood Pasam Dhanuschakrakam ర 3 చ
Diamond is powerful, the fear of Shulamabhayam, the face of Shanmukham
God Chitramayuravahanagatam Chitramambaraankrutam ॥ 4 చిత్ర
Shadanaanam Sandalwood Pithangam Mahorasam Divya Mayura Vahanam |
Rudrasya Sunum Suralokanatham Brahmanyadevam surrendered to you || ||
Jajvalyamanam Suravrindavandyam Kumar Dharaathata Temple |
Kandarparupam Kamaniya Gathram Brahmanyadevam Saranam Prapadye || బ్ర ||
Two shoulders, two eyes, three eyes, Shulamasi Dadhanam |
Sesha Avataram Kamaniyarupam Brahmanyadevam Saranam Prapadye || దే ||
Suraari Gorahava Sobhamanam Surotthamam Shakthidharam Kumaram |
Sudhara Shaktya Yudha glorious hand Brahmanyadevam Saranam Prapadye || ||
The son of the Prime Minister who fulfills his will, the food of his will, Bhusurakamadhenum |
The sound of Gangodbhavam is the tune of all the people, Brahmanyadevam is our refuge || ||
Brahminism with Brahmin, let's help people, let's earn the people, the supreme leader Subrahmanya Mupasmahe.
Scandaaya Karthikeya Parvathi Nandanayacha Mahadeva Kumaraya Subrahmanyayathe Namah
Shanmukham Cha Ganadheesham Sambancha Parameshwaram Mamadukha Destroyer Santham Chintayamyham
Taptachami Karaprakhyam Shakti, Shadananam, Mayura vehicle form, Second form Shiva Smareth
If you recite this verse, the enemy will win
Powerful hand is the opposition, the vehicle of learning is the shadow of the Lord.
Worst thing is to think as a disease
Skandham Shanmukham Devam Shiva Tejam two sides.
Lord Kumaram Swaminath, Lord Karthikeyam, Namahyam
Mantras to be recited compulsorily on Subramanya Shashti
Those who listen to this Subrahmanya Shashti story will get the virtues of crores of births.
0 Comments