Ad Code

అరుదైన ఆలయం హయగ్రీవ ఆలయం నంగనల్లూరు - Rare temple Hayagriva Temple Nanganalluru

అరుదైన ఆలయం హయగ్రీవ ఆలయం నంగనల్లూరు


తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరమునందు గల నంగనల్లూరు అను ప్రాంతమున అతి అరుదైన హయగ్రీవ ఆలయం కలదు . ఇందు హయగ్రీవుడు అశ్వశిరముకలిగిన శ్రీమన్నారాయణుడు స్వేత వస్త్రములు ధరించి స్వేత కమలమును కరమున దాల్చి మహాలక్ష్మి అమ్మవారి పరిష్వంగం లో నున్నట్టి అరుదైన రూపముగా కనపట్టును.

దీనికి ఒక ప్రాచీన ఐతిహ్యము కలదు. బ్రహ్మ మానవులను సృష్టించు సమయము న మధుకైటభులను రాక్షసులు వేదములు ఎత్తుకుపోయిరి. అంత బ్రహ్మ,  ఙ్ఞానమును కోల్పోయి సృష్టి ఆగిపోవుటచే శ్ర్రీమన్నారాయణుని ప్రార్ధించెను. దైవం హయశిరసుడై ఆ రక్కసులను దునుమాడి వేదములు తిరిగితెచ్చి హయముఖముతో ఆ ఙ్ఞానమును మరల బ్రహ్మకు ఉపదేశించెను. తదుపరి లక్ష్మీదేవితో ఇచట కొలువుతీరి వైష్ణవులకు ఙ్ఞాన ప్రాప్తికిఅధిదేవతగా పూజింపబడుచు, యంత్ర శక్తిగల ఉపాసనా దైవమయి నందున విద్యాభ్యాస సమయమునపరీక్షలముందు పిన్నలు పెద్దలు ఇటకు వస్తారు .అలాగే స్వామి ఒకకంటితో లక్ష్మిని మరొకదానితోభక్తులను చూచుచుండ లక్ష్మి కూడ ఎడమకంటితో    స్వామిని కుడికంటితో భక్తులను అనుగ్రహిం చు అరుదైన రూపమిది కావున ధనప్రాప్తికి కూడ ఈమూర్తిని ఆశ్రయిస్తారు. అంతేకాక ఓనంపండగ సమయంలో ఈ ఆలయమున విశేష పూజలు జరుగును . విద్యార్ధులు  ఎక్కువ మంది ఈ ఆలయాన్ని దర్శిస్తారు.అలాగే నత్తివంటి ఉచ్ఛారణా దోషములు తొలగింపు, అన్యోన్య దాంపత్య  బంధమునకు కూడ ఈ ఆలయమున మొక్కు తారు .ఓనంపండగ సమయమున ఇచట ఊరేగింపు, తెప్పోత్సవము జరుగును.


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ


Rare temple Hayagriva Temple Nanganalluru

A very rare Hayagriva temple is found in the area of Nanganalluru in Chennai, the state capital of Tamil Nadu. Srimannarayana wearing white clothes and white lotus on hand in Dalchi Mahalakshmi Ammavaru's parishvangam is a rare form. This one has an ancient history. At the time Brahma created humans, demons and Vedas took away Madhukaitabhu. By losing all the Brahma and knowledge, the creation stops, we prayed to Sri Mannarayana. The God being high headed, destroyed those demons and brought back the Vedas and taught that knowledge again to Brahma with a high face. Next with Lakshmi Devi, Koluvutiri Vaishnavas are worshipped as the supreme deity of knowledge, as the powerful Upasana deity, the ancestors of Pinnalu elders come to this house before the exams. Similarly, Swami sees Lakshmi with one eye and the devotees with the other. Lakshmi also sees Swami with the left eye and blesses devotees with the right eye. This is a rare form. So, they rely on this idol for getting money. Special pujas will be performed in this temple during Onam festival. More students visit this temple. In this temple, the spelling mistakes like snail are removed and the marriage relationship is also given respect. On the time of Onam festival, procession will be held at Ichhata and Teppotsavam.

Post a Comment

0 Comments