Ad Code

బ్రహ్మాండ నాయకుని బ్ర‌హ్మోత్స‌వం - Kaliyuga Sri Venkateswara Swamy Brahmotsavam

బ్రహ్మాండ నాయకుని బ్ర‌హ్మోత్స‌వం


శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు వుంటాయని మనకందరికీ తెలుసు, అవి ఏమిటి, అందులో ముఖ్య ఘ‌ట్టాలు ఎన్ని అని ఒకసారి తెలుసుకొందామా!

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసిన‌ తిరుమల దివ్యక్షేత్రంలో నిత్యకల్యాణం పచ్చతోరణం అన్న‌విధంగా అనుదినం ఒక ఉత్సవమే.


స్వామివారికి ఏడాది పొడవునా 450కి పైగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు వివిధ పురాణాలు తెలుపుతున్నాయి.

అయితే అన్ని ఉత్సవాల్లోకెల్లా అలంకారప్రియునికి అత్యంత ప్రియమైన ఉత్సవం బ్రహ్మోత్సవం.

తిరుమల దివ్యక్షేత్రంలో ప్రతి ఏటా కన్యామాసం ఆశ్వయుజ మాస‌మైన‌పుడు విజయదశమి వరకు నవాహ్నికంగా నిర్వహించే ఉత్సవాలనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలని పురాణాలు చెబుతున్నాయి.

ఈ మేరకు 2022 సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వ‌ర‌కు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపడుతోంది.

ఈ తొమ్మిది రోజుల ఉత్స‌వాల్లో శ్రీ‌వారి ఉత్స‌వ‌మూర్తి అయిన శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు వివిధ ర‌కాలైన 16 వాహ‌నాల‌పై (రెండు ర‌థాలు క‌లిపి) మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య‌మైన కార్యక్రమాల సరళి ఈ విధంగా ఉంటుంది!

ఆలయశుద్ధి:

బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు వైఖాన‌స ఆగ‌మం ప్రకారం ఆలయాన్ని శుద్ధి చేసి(కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం) చేస్తారు.

మృత్సంగ్రహణం:

బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందునాడు పుట్టమన్ను సేకరించి భూమాతకు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మన్నులో 9 రకాల వివిధ ధాన్యాలను నాటుతారు.

నవధాన్యాలకు  మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు.

అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది.

తదుపరి విష్వక్సేన, అనంత, సుదర్శన, గరుడాళ్వార్‌లను పూజిస్తారు.

ధ్వజారోహణం మరియు దేవతావాహనం:

శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయం లోపల నడిమి పడికావలి చెంత అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

తద్వారా స్వామివారి అత్యంత ప్రియు సఖుడైన గరుడుడు బ్రహ్మ, ఇంద్ర, యమ, అగ్ని, కుబేర, వాయు తదితర దేవతలనే కాకుండా వశిష్ట, విశ్వామిత్రాది సప్తఋషులను, ఇతర గణాలను, దేవతలను ఆహ్వానిస్తారని ప్రతీతి. 

దీనినే దేవతావాహనం అంటారు.

వాహనసేవలు:

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అత్యంత వన్నె చేకూర్చేవి వివిధ వాహనసేవలు.

అలంకార తేజోవిలాసుడైన శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేష, చిన్నశేష, హంస, సింహ, ముత్యపుపందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ వాహనాలు క‌లిపి 13 వాహనాలపైనే కాకుండా మోహినీ అవతారం, స్వర్ణరథం, రథోత్సవాల్లో కూడా తిరుమాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.

ఒక్కొక్క వాహనం ద్వారా భక్తజన కోటికి అద్భుతమైన సందేశాన్ని అందిస్తారు.

శ్రీవారి కొలువు:

శ్రీవారి ఆలయం లోపల బ్రహ్మోత్సవాల వాహనసేవల సమయంలో కొలువు నిర్వహించడం ఆనవాయితీ.

ఆలయ అర్చకులు ఈ సమయంలో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు.

స్నపనం:

ఈ కార్యక్రమాన్నే ఉత్సవానంతర స్నపనంగా వ్యవహరిస్తారు. 

బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం ఒక వాహనసేవ తిరిగి రాత్రి ఒక వాహనసేవతో క్షణం తీరిక లేకుండా ఉండే మలయప్పస్వామివారికి రెండు వాహనసేవల మధ్య సమయంలో నిర్వహించే ప్రత్యేక సుగంధద్రవ్య అభిషేకమే స్నపనం.

తద్వారా స్వామివారికి ఉపశమనం కలిగించి తిరిగి రాత్రి వాహనానికి నూతనోత్తేజంతో, ఉత్సాహంతో వాహనాన్ని అధిరోహించేందుకు సంసిద్ధం చేస్తుంది.

చూర్ణాభిషేకం:

బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజు ఉదయం స్వామి, అమ్మవార్లకు సుగంధద్రవ్యంతో ఆచరించే స్నానమే చూర్ణాభిషేకం.

చక్రస్నానం:

బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామి పుష్క‌రిణిలో శ్రీవారి సుదర్శన చక్రానికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహిస్తారు.

దేవతోద్వాసన:

చివ‌రిరోజు స్వామివారికి అర్చన నివేదించిన అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముక్కోటి దేవతలకు, ఋషిపుంగవులకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాపూర్వకంగా వీడ్కోలు ప‌లుకుతారు.

అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించిన బ్రహ్మదేవునికి కూడా అర్చకస్వాములు సంబంధిత శ్లోకాల‌తో కృతజ్ఞతలను నివేదిస్తారు.

ధ్వజావరోహణం:

బ్రహ్మోత్సవాల్లో చివరి అంకం ధ్వజావరోహణం. 

ఆలయ ధ్వజస్తంభంపై తొలిరోజు రెపరెపలాడిన గరుడధ్వజ చిత్రపటాన్ని చివరిరోజు సాయంత్రం అవనతం చేయడంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తాయి.


ఓం నమో వేంకటేషాయ, శ్రీనివాసాయ, గోవిందాయ, నారాయనాయ ||
ఓం నమో వేంకటేషాయ, శ్రీనివాసాయ, గోవిందాయ, నారాయనాయ ||


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ



Brahmotsavam of the great leader

We all know that Srivari Brahmotsa are there, shall we know once what are they and how many important events are there in it.

In Tirumala Divyakshetra where the direct god of Kaliyuga Sri Venkateswara Swamy, Nithyakalyanam is born, just like it is said that everyday is a festival.

Various myths say that more than 450 festivals are being conducted for Swamy throughout the year.

But Brahmotsavam is the most loved festival for the person who loves decoration among all the festivals.

Puranas say that Srivari Salakatla Brahmotsavas are celebrated every year in Tirumala Divyakshetra in Kanyamasam, Ashwayuja Masa Maina Pudu Vijayadasami.

TTD is making arrangements to organize Srivari Brahmotsavams grandly from September 27 to October 5, 2022.

In these nine days celebrations, Sri Malayappa Swamy who is the Utsavamurthy of Sri vari will travel on 16 different vehicles (by combining two chariots) in the mud streets and give darshan to the devotees.

This is how the main programs of Brahmotsaval will be.!

Temple cleanliness:

Before the start of Brahmotsavala, according to Vaikhana Saagam, the temple will be cleaned (Koil Alwar Thirumanjanam).

Eclipse of death:

Before the beginning of Brahmotsavala, the soil is collected and performed special pujas before Mother Earth and planted 9 different grains in this soil.

Water will be given to the new grains until it sprouts.

Since it is a program to accuse the figures, it has become a figure offering.

Next Vishwaksena, Anantha, Sudarshana, Garudalwar will be worshipped.

Flag hoisting and the vehicle of the gods:

Flag hoisting program is conducted by priests in Nadimi Padikavali by hoisting Garuda image on the flag pole of Srivari temple in a scientific way.

Thus, Swami's most beloved Gurudu invites not only Brahma, Indra, Yama, Agni, Kubera, Vayu, but also Vasista, Vishamitraadi Sapthasrishas and other Ganaas and Goddesses.

This is what you call a divine vehicle.

Vehicle Services:

Various vehicle services are the most important things for Srivari Brahmotsavams.

Sri Malayappa Swamy, who is a decorative Tejo Vilasu, peddhesha, chinna sesha, swan, lion, mutyapupandiri, kalpavruksha, sarvabhoopala, garuda, hanumantha, gaja, surya prabha, chandraprabha, horse vehicles, and also on 13 vehicles, but also on the streets of Tirumada Devotees will be blessed by Vihar and will be blessed.

Devotees deliver a wonderful message to crores of people through each vehicle.

Srivari's job:

It is unavoidable to conduct koluvu during Brahmotsavala vehicle services inside Srivari temple.

Temple priests will offer offerings to the Swami at this time.

Snapping:

This event will be treated as a post-festival snack.

Snapana is a special perfumed abhishekam conducted between two vehicle services to Malayappa Swamy who is not busy with one vehicle service in the morning and another vehicle service in the night during Brahmotsavams.

Thus relieving the Lord and returning to the night vehicle with new vigor and enthusiasm.

Charnabhishekam:

On the last day of Brahmotsavam, in the morning of Swami and Ammavaru, the bath with perfume is Churnabhishekam.

Chakra bath:

On the last day of Brahmotsavala, Swami Pushka Rini conducted Chakrasnanam to the Srivari Sudarshana Chakra according to the scientific method.

Devotee's hatred:

After offering Archana to Swamy on the last day, Sri Venkateswara Swamy will bid farewell with gratitude to all the three crore deities and sages who participated in Navahnika Brahmotsavams.

Similarly, Archaka Swamis also express their gratitude to Brahma deva who conducted Srivari Brahmotsavams with relevant slokas.

Flag Hosting:

Flag hoisting is the last edition of Brahmotsavams.

Srivari's annual Brahmotsavams will end grandly as the Garudadhwaja picture that was fluttering on the first day on the evening of the temple pillar.

Victory to Srimannarayana






Post a Comment

0 Comments