కరోనా వ్యాధికి మందు కళ్ళలో, చెవిలో, ముక్కులో వేయడానికి కారణం ఏమిటంటే?
కళ్ళల్లో మందు వేస్తే ఊపిరితిత్తులకు ఎలా వెళ్తుంది.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగినంత మాత్రానా లేదా
శ్వాస ఆడనంత మాత్రాన అంటే ప్రాణవాయువు సంచరించనంత మాత్రాన శ్వాసకోశ వ్యవస్థ పనిచేయనంత మాత్రాన చనిపోయినట్లు కాదు. నాడి పరీక్షించాలి.
నాడి ఆడుతున్నట్లయితే కొన ఊపిరితో ఉన్నట్లు. ఈ నాడీ వ్యవస్థ కు ఉదానవాయువు ప్రధాన ఆధారం.
ఈ వాయువుకు అత్యవసర ద్వారాలు కళ్ళు. కళ్ళ ద్వారా సరైన ఔషధం ప్రాణవాయువుకు అందించగలిగితే అది నాడీమండలమును చైతన్యపరుస్తుంది.
నాడీ మండలము శరీరమంతా వ్యాపించి ఉంటుంది కావున శరీరమంతటా వ్యాపించి యున్న వ్యాన వాయువును చైతన్యపరుస్తుంది.
ఈ వ్యాన వాయువు ఉత్తేజమైతే అపాన, సమాన, ప్రాణవాయువు లను చైతన్య పరచును.
అపాన వాయువు చైతన్యం వల్ల విసర్జక వ్యవస్థ,సమానవాయువు చైతన్యం వల్ల జీర్ణవ్యవస్థ, ప్రాణవాయువు చైతన్యం వల్ల శ్వాసకోశ వ్యవస్థ చైతన్యం పొందుతాయి.
ఈ విధంగా ఊపిరితిత్తులకు మళ్ళీ చలనం వస్తుంది.
పంచప్రాణాలు పంచేంద్రియాలనబడు అత్యవసర ద్వారాలతో అనుసంధానించబడి ఉంటాయి.
1.ప్రాణవాయువు (ముక్కు)
2.సమాన వాయువు (నాలుక)
3.అపాన వాయువు (చెవులు)
4.వ్యాన వాయువు (చర్మం)
5.ఉదాన వాయువు (కళ్ళు)
అలాగే పంచప్రాణాలు వాటి కేంద్ర స్థానాలు
1.ప్రాణవాయువు (గుండె)
2.సమానవాయువు (నాభి)
3.అపానవాయువు (పాయువు)
4.వ్యానవాయువు (శరీరమంతటా)
5.ఉదానవాయువు (కంఠం)
ఉదానవాయువు అనబడు పంచమప్రాణం గాలిలో కలవనంతవరకు పంచప్రాణాలు ఉన్నట్లే.
దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు "నా కంఠంలో ప్రాణమున్నంత వరకు" అని ఎందుకు అంటారో మరియు మరణశిక్షను ఉరిశిక్ష తో ఎందుకు అమలు చేస్తారో, ఇది సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే సంక్షిప్త సంగ్రహణ వివరణ మాత్రమే.
ఇందులో మళ్ళీ పంచ ఉప ప్రాణవాయువులు వాటి స్థానాలు,విధులు, పంచ కర్మేంద్రియాలు, పంచకోశాలు, షడ్చక్రాలు,షడ్రసాలు,త్రిగుణాలు, త్రిదోషాలు,ద్వైతము,అద్వైతము ఇలా ప్రతీ ఆధ్యాత్మిక అంశం కూడా ఆరోగ్య సంబంధమే.
అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం.
ఆయుర్వేదం ఆయుః ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనంద రసాత్మక సకలశాస్త్ర విజ్ఞానం.
కళ్ళతో శ్వాసక్రియ ఎలా అనే సందేహం కలగవచ్చు కొంతమంది విజ్ఞానులకు. దానికి సమాధానం విజ్ఞానంలో కూడా ఉంది.
అది ఏమిటంటే కప్ప చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది కదా?
అలాగే అత్యవసర పరిస్థితుల్లో మనిషికి పంచేంద్రియాలు శ్వాసేంద్రియాలు/వెంటిలేటర్స్ అవుతాయి.
ఈతరాక నీటిలో మునిగిపోయిన వారిని రక్షించిన తరువాత వారి పొట్ట పై నొక్కుతారు.
నోటిలో నుండి నీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అరికాళ్ళు అరిచేతులు బాగా రుద్దుతారు.
తలను గుడ్డ తో తుడిచి బట్టలు మార్చి చలిమంట దగ్గర కూర్చోబెడతారు.
ఈ ప్రథమ చికిత్స ఇంగ్లీష్ వైద్యం రాక ముందు లేదా? మరి దాన్ని నాటు చికిత్స అందామా ?
దాని శాస్త్రీయత కూడా ఇదే.
శరీరమంతా వ్యాపించి ఉన్న నాడీమండల వ్యవస్థ ను చైతన్య పరచడం ద్వారా వ్యాన వాయువును తద్వారా అపాన, సమాన, ప్రాణవాయువు లను చైతన్య పరచడం.
ఇక్కడ వెంటిలేటర్ గా చర్మం (అరికాళ్ళు, అరిచేతులు, తల, ఒళ్ళు రుద్దడం తుడవడం) ద్వారా చికిత్స చేస్తాం.
పాము కరచినప్పుడు కొంతమంది ఆయుర్వేద వైద్యులు రావి ఆకుల కొనలను రెండు చెవుల్లో ఉంచడం ద్వారా బ్రతికిస్తారు.
ఎలాగంటే పైన చెప్పినట్లు అపానవాయువు/విసర్జక వ్యవస్థ(విషాన్ని బయటకు విసర్జింపచేయడం) పనిచేయనప్పుడు చెవులు అత్యవసర ద్వారాలవుతాయి.
చెవుల ద్వారా శ్వాసక్రియ జరిపించి పాము విష ప్రభావమును వికటింపచేసి మనిషిని కాపాడుతారు. ఇప్పుడు ఆ నైపుణ్యం కల వైద్యులు లేనంత మాత్రాన ఇది అసత్యం కాదు.
ఆయుర్వేదంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
కానీ ప్రయోగాలు అల్లోపతి లో చేస్తున్నారు.
మరి సత్యం ఎలా ఆవిష్కరించ బడుతుంది.
అందుకే ఆయుర్వేదంలో పరిశోధనలు మొదలుపెట్టండి.
అద్బుత సత్యాలు సాంకేతికతలు వెలుగు చూస్తాయి.
అవి ఉచిత పథకాలకు కూడా ఉపయోగపడి సామాన్యులకు ఉపయోగపడతాయి.
Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
0 Comments