శ్వేతర్కం (తెల్ల జిల్లేడు)
తెల్ల జిల్లేడు దూదితో ఇప్పనూనే తో 5 దీపాలు చేసి 5 వారాలు వెలిగిస్తే ఆంజనేయస్వామి ప్రసన్నులవుతారు . దీని పూలతో శివపుజ, ఆకులతో సూర్యపుజ దీని సమిధలతో సుర్య హోమంచేస్తారు. దీనివేరు తవ్వి తీసుకొనిరావడం ఆదివారం, గురువారం లలో పుష్యమి నక్షత్రం రోజున మంచిది.
వేరు తీసే విధానం:
ముందుగా చెట్టు గుర్తుఉంచుకోవాలి. ఏ రోజున శ్వేతార్కం ఆది, గురు , పుష్యమి నక్షత్రాలు కలిసిన రోజుకి ముందుగా రహస్యంగా (వేరు తీసుకొస్తున్నట్టు ఎవ్వరికి తెలియకూదదు).
చెట్టు వద్దకు సాయంకాలం వెళ్ళాలి. వెళ్ళేప్పుడు ఎర్రటిధారం , సింధూరం , నీరు ,అగరవత్తులు అగ్గిపెట్ట తీసుకొని వెల్లాలి.
చెట్టు దగ్గర తూర్పు ఈశాన్య దిశలలో ఎటువైపున నిల్చొని చెట్టుని గణపతిగా భావించి నమస్కరించి చెట్టు మొదలులో నీరుపోసి , సిందూరం సమర్పించి దూపం వెలిగించి ఎర్రని దారాన్ని చెట్టుకి కట్టి ప్రార్ధించాలి.
ప్రార్ధన:
హే గణపతి ప్రభో , శ్వేతర్క దేవా నా కార్యసిద్ధికై రేపు నిన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తాను. దయతో మీరు నా కార్యం సిద్ధించే నిమిత్తం నాతో రావలసిందిగా ప్రార్ధిస్తున్నాను. అంటూ నమస్కరించి తిరిగివచ్చి రాత్రి ఒంటరిగా పడుకోవాలి.
తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రం, తవ్వడానికి చిన్న సాధనం తీసుకుని చెట్టు వద్దకు వెళ్లి తుర్పు ,ఉత్తర దిశలలో ఎటైన నిలుచొని నమస్కరించి గణపతి మంత్రం చదువుతూ జాగ్రత్తగా వెరు తవ్వి తీయాలి . ఒకవేళ వేరు మధ్యలో విరిగినా దాన్ని జగ్రత్తగా వస్త్రం లొ చుట్టి ఇంటికి తీసుకురావాలి.
మంత్రాలు:
ఓం గం గణపతయే నమః
ఓం గ్లౌం గణపతయే నమః
అదృష్టం ఉంటే వేరు అచ్చం గణపతిలా లభించొచ్చు.
పూజా విదానం:
శ్వేతార్కం ని శుద్ధజలం లో కడిగి శుభ్రంగా తుడిచి ఆసనం పైన ఎర్రటి వస్త్రం పరిచి దానిపైన పెట్టాలి ఎర్రచందనం పౌడర్ , ఎర్రకుంకుమ, పసుపు, గంధం పొడి ,సిందూరం, పువ్వులు , అక్షింతలు తో పూజించాలి.
సిద్ది, బుద్ధి, ఐశ్వర్యం కోరేవారు పైన చెప్పిన మంత్రాలలో 2 వ మంత్రం చదువుతూ పైన చెప్పిన వస్తువులు వేసి పుజించాలి. దూప దీపాలు సమర్పిస్తూ గణపతికి నైవేద్యం గా కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్లు సమర్పించాలి. ఇది అయినతర్వాత కనీసం 1116 సార్లు పైమంత్రం జపం చేసి హోమగుండం లొ నెయ్యి, పంచదార, నువ్వులు, జొన్నలు లెదా గోధుమలు గాని కలిపి పై మంత్రం తో హొమం చేయాలి. కనిసం జపసంక్యలొ దశాంశం అనగా 10% హొమం జరగాలి. ఇదైన తర్వాత వీబూది శ్వేతర్కములం పై రాసి దానిని పుజాస్థానం లొ పెట్టి దూప దీప నైవేద్యాలు అర్పించాలి. (వీబుధి హోమాగుండం లోనిధి).
ఉపయొగాలు:
శ్వేతార్కం ఇంట్లో ఉంటే సాక్షాత్తు గణపతి ఇంట్లో ఉన్నట్టే.
ధన, ధన్య సమృద్ది పెరుగుతుంది. వ్యాపారం అభివృద్ది. అది ఎలా శాఖోపశాఖలుగా పెరుగునో వ్యాపారం అలా పెరుగును.
విద్యార్ధులు రాణిస్తారు.
సర్వకార్యాలు జయప్రదం అవుతాయి.
ఎలాంటి పరిస్థితులలోను నిరాదరణ చేయకూడదు.
0 Comments