కరోనా సమయంలో పాటించవలసినవి
మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు.
కరోనా మాత్రమే కాదు మనకు సాధారణంగా కొన్ని అనారోగ్యాలు కలుగుతూనే ఉంటాయి. మనం తీసుకునే నీరు, పీల్చే గాలి, తినే ఆహార విషయాలలో జాగ్రత్త వహిస్తే ఎన్నో సమస్యలను దూరం పెట్టచ్చు. అందుకే తరచుగా ప్రాణాయామాలూ, సూర్య నమస్కారాలు, వ్యాయామం చేయమని పెద్దలు చెబుతుంటారు. అలానే మితిమీరిన ఆహారం, వేళకు తినకుండా ఇష్టం వచ్చినప్పుడు అతిగా తినడం, రుచిగా ఉన్నాయని మితిమీరి తినడం, ఆ తిన్నవి అరిగేందుకు సరిపడా నీరు త్రాగాకపోవడం ఇలా అనేక కారణాల వలన మనమే మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుని, మళ్ళీ బాగుచేసుకునేందుకు ఎంతో కర్చు పెడుతూ, శారీరకంగా శ్రమిస్తూ ఉంటాము. మన సనాతన ధర్మంలో ఎలా జీవించాలో, ఏవేవి తినాలో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో, ఎప్పుడు లంకణం చేయాలో, ఉపావాసాలు ఎలా ఆచరించాలో ప్రతీ విషయమూ సమగ్రంగా, విపులంగా విశదీకరించారు.
ఇవి మన పెద్దలు చెప్తే చాదస్తమనీ, మూఢ నమ్మకం అనీ, పెత్తనం అనీ పెడచెవిన బెట్టి ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం. సరే ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి కారణం ఉందండోయ్ ఆ విషయానికే వస్తున్నాను. మన ఆరోగ్యమైనా, జాతకమైనా, జీవితమైనా మన చేతిలోనే ఉంటుంది. ప్రపంచమంతా కరోనా బారిన పడి దాదాపు సంవత్సరం పైనే విలవిలలాడిపోతున్నాయని మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే ఎలా ? ఇప్పటికీ మించి పోయినది ఏమీ లేదు. ఇక్కడ చెప్పిన విషయాలు ప్రస్తుతం మాత్రమే కాదు, జీవితాంతమూ పాటించవలసినవి.
ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయడం
ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయడం
తినిన వెంటనే కూర్చోకుండా, కనీసం ఒక 100 అడుగులైనా నడవడం.
కాచిన నీళ్ళు త్రాగడం.
తరచుగా నీరు త్రాగుతూ ఉండడం.
విధిగా ఏకాదశీ ఉపవాసాలు చేయడం.
కషాయం చేసుకుని కనీసం వారానికి రెండు సార్లు కచ్చితంగా త్రాగడం.
మితంగా తినడం, మితంగా నిద్రపోవడం.
పరిశుభ్రత పాటించడం.
ప్రతీరోజూ కనీసం ఒక పావు గంట ధ్యానం చేయడం.
కచ్చితంగా ఒక్క పండైనా తినడం. ఏ కాలంలో కాచే పండ్లను ఆ కాలంలో తినాలి. అది ప్రకృతి మనకు అందించే వరం.
భగవంతునికి ప్రార్ధన
ఇవన్నీ మనకు తెలిసినవే, చిన్నపాటి నుండీ వింటున్నవే అయినా ఆచరించడం లోనే ఎన్నో తేడాలు. బద్ధకం వలనో, నిర్లక్ష్యం వలనో, సమయం లేకపోవడం వలనో గానీ వీటిలో చాలా వరకూ పాటించడం లేదు. ఇవి పాటిస్తే ఎటువంటి మందులు మాకులూ అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉంటాము. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది.
కషాయం చేసే విధానం:
కావలసిన పదార్ధాలు:
మంచి నీళ్ళు ఒక లీటరు
తులసి ఆకులు - 9
వాము ఆకులు పెద్దవి - 2 , చిన్నవైతే - 4
పచ్చి అల్లం రెండు ఇంచులు
పపచ్చి పసుపు కొమ్ములు - 1
పచ్చ కర్పూరం 2 గ్రాములు
దాల్చిన చెక్క చిన్న ముక్క
ఏలకులు - 4 కచ్చా పచ్చాగా దంచినవి
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
మిరియాలు - 1 టేబుల్ స్పూన్ కచ్చా పచ్చాగా దంచాలి
సోంపు - 1 టేబుల్ స్పూన్
తేనె - 4 టేబుల్ స్పూన్లు లేదా బెల్లం 6 టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం:
ముందుగా నీళ్ళు మందమైన అంచు గల గిన్నెలో మరిగించాలి. అవి తెర్లుతుంటే వాటిలో పైన చెప్పినవన్నీ కలపాలి( తేనె / బెల్లం మాత్రం ఇప్పుడే కలపకూడదు ). మంట బాగా తగ్గించి ఒక అరగంట పాటు మరిగించాలి. ఆ లీటర్ నీళ్ళు అర లీటర్ అయ్యేంత వరకూ మరిగించాలి. కషాయం సగానికి తగ్గాక స్టవ్ ఆపుచేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఆ తరువాత ఆ నీళ్ళను వడగట్టి అందులోకి తేనె గానీ, బెల్లం గానీ కలిపి కాస్త వేడిగానే త్రాగాలి. ఇది దివ్యమైన ఔషదం. రుచి కూడా చాలా బాగుటుంది. ఇష్టాఇష్టాలతో పనిలేదు, అందరూ కచ్చితంగా త్రాగాలి అంతే అని హుకుం జారి చేయండి. అందరూ తప్పనిసరిగా వారానికి రెండు సార్లు త్రాగండి.
దీనితో పాటుగా శ్వాస కోసం ఇది కూడా అందరమూ దగ్గర పెట్టుకోవలసినది.
ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఒక స్పూన్ వాము, ఒక గడ్డ కర్పూరం, 4 లవంగాలు ఈ మూడింటిని ఒక తెల్లటి కాటన్ గుడ్డలో తీసుకుని, గట్టిగా దంచి, నాలుగు చుక్కలు యూకలిఫ్టస్ ఆయిల్ ( నీలగిరి తైలం) కలిపి, ముక్కు దగ్గర వాసన చూపిస్తే, గట్టిగా 10 నుండీ 15 సార్లు శ్వాసలు తీసుకోమని ప్రోత్సహిస్తే కొద్దిసేపట్లో ఆక్సిజన్ లెవెల్స్ 90 నుండి 99 వరకు పెరుగుతాయి.2గంటలకు ఒకసారి ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితం వస్తుంది.
లడక్ లో యాత్రికులకు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు అందిస్తుంటారు మరియు అంబులెన్స్ లలో కూడా అందుబాటులో ఉంచుతున్నారు
తయారు చేయడానికి ఇబ్బంది అయ్యేవారికి "దివ్య ధార" పేరుతో ఆయుర్వేద లేక పతంజలి స్టోర్స్ లో దొరుకుతుంది.
ఇక మూడవది, ముఖ్యమైనది భగవంతుని అనుగ్రహం. అందుకే అందరమూ ఈ చిన్న మంత్రము ప్రతి రోజు చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు.
ఈ మహామహిమాన్వితమైన ధన్వంతరి మహా మంత్రము కూడా పఠించాలి, పఠింపజేయాలి.
ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు వున్నఎడల ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఎడల ఆ రోగము ఉపశమించును.
ఓం నమో భగవతే
మహా సుదర్శన
వాసుదేవాయ ధన్వంతరయే
అమృత కలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే
త్రైలోక్య విధాత్ర్తే
శ్రీ మహా విష్ణు స్వరూప
శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీ శ్రీ ఔషధ చక్ర
నారాయణ స్వాహా
ఓం నమో భగవతే
వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
త్రైలోక్య నాథాయ
శ్రీ మహా విష్ణవే నమః
ఓం శ్రీ ధన్వంతరి నమోస్తుతే
0 Comments