Ad Code

అధిక బరువు & కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్ల కోసం - How to Lose High Weight with Cholesterol

అధిక బరువు & కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్ల కోసం



అధికబరువు & కొలెస్ట్రాల్ సమస్య వున్నవాళ్లు వారంలో ఒక రోజు జ్యూస్ డైట్ ఫాలో అవ్వాలి.

ఉదయం 6 గంటలకు కొత్తిమీర జ్యూస్ లో ఒక అరచెక్క నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ వాకింగ్ చేయాలి.

ఉదయం 8 గంటలకు రెండు పెద్ద అరటిపళ్ళు & ఒక గ్లాస్ పాలు (దొరికితే ఆవు పాలు) తేనె లేదా బెల్లం కలిపి తీసుకోవాలి.

ఉదయం 11 గంటలకు ఒక గ్లాస్ బత్తాయి రసం లేదా కమలాపండ్ల రసం తీసుకోవాలి.

మధ్యాహ్నం 1 గంటకి బొప్పాయి జ్యూస్ రెండు గ్లాసులు తీసుకోవాలి.

సాయంత్రం 4 గంటలకి కమలాపండ్ల రసం ఒక గ్లాస్ తీసుకోవాలి.

సాయంత్రం 6 గంటలకి ఒక గ్లాస్ దానిమ్మ రసం ఒక గ్లాస్ తీసుకోవాలి.

ఇక రాత్రి 8 గంటలకు కీరదోసకాయ జ్యూస్ తీసుకోవాలి.

ఇక పడుకునేటప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ త్రాగి పడుకోవాలి.

పై జ్యూస్ డైట్ ఫాలో అయినప్పుడు మధ్య మధ్యలో ఆకలేసినప్పుడు వాటర్ త్రాగుతూ ఉండాలి.

ఇలా వారానికి ఒకసారి చేస్తే పొట్ట మొత్తం క్లీన్ అయ్యి, మెటబోలిక్ రేట్ పెరిగి జీర్ణశక్తి పెరిగి చెడ్డ కొలెస్ట్రాల్ కరుగుతుంది.


Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.





Post a Comment

0 Comments