Ad Code

పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు - Tungabhadra Pushkaralu

పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు



పన్నెండేళ్ళకోసారి వచ్చేది పుష్కరం. పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు శ్రీ శార్వరి నామ సంవత్సరంలో జరుగనున్నాయి. 2008లో ఈ నదికి పుష్కరాలు జరిగాయి. మళ్ళీ 12 ఏళ్ళతర్వాత 2020 నవంబరు 20 నుంచి డిసెంబరు ఒకటి వరకూ తుంగభద్రమ్మకు పుష్కరాలు జరుగనున్నాయి.ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు జరుపుతారు.

 అందుకే 12 నదులను పుష్కర నదులని, 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని జరుపుకుంటారు. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27, తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి. గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి.

పుష్కరాల సమయంలో బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు, నదీ దేవతతో పాటు ముక్కోటి దేవతలు ఆ నదీజలంలో కొలువై ఉంటారని ప్రతీతి. ఇక శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి శక్తి ఉంటుంది.కర్నూలు జిల్లాలో తుంగభద్రానది ముందుగా మేళిగనూరు వద్ద రామలింగేశ్వరస్వామి ఆలయాలన్ని తాకి వస్తుంది. స్వామి ఆలయం నదీతీరంలో ఉంది. కోసిగిలో ఆర్డీ‌ఎస్ ఆనకట్ట, అనంతరం మంత్రాలయం మండలంలో రాంపురం రామలింగేశ్వర స్వామి ఆలయం, మాధవరం వద్ద నదిలోనే ఓ శివాలయం ఉంది. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆలయాలను తాకుతూ, దిగువన గురజాల ఇసుక రామలింగేశ్వర స్వామి ఆలయం మీదుగా కర్నూలు చేరుకుంటుంది. నాగులదిన్నె సమీపంలో సాయిబాబా దేవాలయం ఉంది. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారు. సి.బెళగల్ మండలం సంగాల వద్ద ఈశ్వరాలయం ప్రసిద్ధి.

సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.

Post a Comment

0 Comments