Ad Code

కార్తీక మాసము ముప్పది రోజులు పాటించవలసిన నియమాలు - Karthika Masam Each Day Significance

కార్తీక మాసము
ముప్పది రోజులు పాటించవలసిన నియమాలు


మొదటి రోజు:
నిషిద్ధములు: ఉల్లి, చద్ది. ఎంగిలి. చల్లని వస్తువులు
దానములు: నెయ్యి, బంగారం
పూజించాల్సిన దైవము: స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము: ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
ఫలితము: తేజోవర్ధనము.


రెండవరోజు:
నిషిద్ధములు: తరగబడిన వస్తువులు
దానములు: కలువపూలు, నూనె, ఉప్పు
పూజించాల్సిన దైవము: బ్రహ్మ
జపించాల్సిన మంత్రము: ఓం గీష్పతయే - విరించియే స్వాహా
ఫలితము: మనః స్థిమితము.


3వ రోజు:
నిషిద్ధములు: ఉప్పు కలిసినవి
దానములు: ఉప్పు
పూజించాల్సిన దైవము: పార్వతి
జపించాల్సిన మంత్రము: ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా
ఫలితము: శక్తి, సౌభాగ్యము.


4వ రోజు:
నిషిద్ధములు: వంకాయ
దానములు: నూనె, పెసరపప్పు
పూజించాల్సిన దైవము: విఘ్నేశ్వరుడు
జపించాల్సిన మంత్రము: ఓం గం గణపతయే స్వాహా
ఫలితము: సద్బుద్ధి, కార్యసిద్ధి.


5వ రోజు:
నిషిద్ధములు: పులుపుతో కూడినవి
దానములు: స్వయంపాకం, విసనకర్ర
పూజించాల్సిన దైవము: ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము: (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)
ఫలితము: కీర్తి.


6వ రోజు:
నిషిద్ధములు: ఇష్టమైనవి,
దానములు: చిమ్మిలి
పూజించాల్సిన దైవము: సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన మంత్రము: ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
ఫలితము: సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి.


7వ రోజు:
నిషిద్ధములు: పంటితో తినే వస్తువులు
దానములు: పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము: సూర్యుడు
జపించాల్సిన మంత్రము: ఓం. భాం. భానవే స్వాహా
ఫలితము: తేజస్సు, ఆరోగ్యం.


8వ రోజు:
నిషిద్ధములు: ఉల్లి,  మద్యం, మాంసం
దానములు: తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము: దుర్జ
పించాల్సిన మంత్రము: ఓం - చాముండాయై విచ్చే - స్వాహా
ఫలితము: ధైర్యం, విజయం.


9వ రోజు:
నిషిద్ధములు: నూనెతో కూడిన వస్తువులు
దానములు: మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము: అష్టవసువులు - పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము: ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః
ఫలితము: ఆత్మరక్షణ, సంతాన రక్షణ.


10వ రోజు:
నిషిద్ధములు: గుమ్మడికాయ, నూనె
దానములు: గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము: దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము: ఓం మహామదేభాయ స్వాహా
ఫలితము: యశస్సు - ధనలబ్ధి.


11వ రోజు:
నిషిద్ధములు: పులుపు
దానములు: వీభూదిపండ్లు, దక్షిణ
పూజించాల్సిన దైవము: శివుడు
జపించాల్సిన మంత్రము: ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ
ఫలితము: ధనప్రాప్తి, పదవీలబ్ధి.


12వ రోజు:
నిషిద్ధములు: ఉప్పు, పులుపు, కారం
దానములు: పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
పూజించాల్సిన దైవము: భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము: ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము: బంధవిముక్తి, జ్ఞానం, ధన ధాన్యాలు.


13వ రోజు:
నిషిద్ధములు: రాత్రి భోజనం
దానములు: మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
పూజించాల్సిన దైవము: మన్మధుడు
జపించాల్సిన మంత్రము: ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
ఫలితము: వీర్యవృద్ధి, సౌదర్యం.


14వ రోజు:
నిషిద్ధములు: ఇష్టమైన వస్తువులు,
దానములు: నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము: యముడు
జపించాల్సిన మంత్రము: ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
ఫలితము: అకాలమృత్యువులు తొలగుట.


15వ రోజు:
నిషిద్ధములు: తరగబడిన వస్తువులు
దానములు: కలువపూలు, నూనె, ఉప్పు
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'.


16వ రోజు:
నిషిద్ధములు: ఉల్లి,  చద్ది, ఎంగిలి, చల్ల
దానములు: నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము: స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము: ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
ఫలితము: వర్చస్సు, తేజస్సు, పవిత్రత.


17వ రోజు:
నిషిద్ధములు: ఉల్లి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు: ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము: అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము: ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
ఫలితము: సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం.


18వ రోజు:
నిషిద్ధములు: ఉల్లి - వెల్లుల్లి
దానములు: పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము: గౌరి
జపించాల్సిన మంత్రము: ఓం గగగగ గౌర్యై స్వాహా
ఫలితము: అఖండ సౌభాగ్య ప్రాప్తి.


19వ రోజు:
నిషిద్ధములు: నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం
దానములు: నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము: వినాయకుడు
జపించాల్సిన మంత్రము: ఓం గం గణపతయే స్వాహా
ఫలితము: విజయం, సర్వవిఘ్న నాశనం.


20వ రోజు:
నిషిద్ధములు: పాలుతప్ప - తక్కినవి
దానములు: గో, భూ, సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము: నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము: ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
ఫలితము: గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి.


21వ రోజు:
నిషిద్ధములు: ఉల్లి,  ఉప్పు, పులుపు, కారం
దానములు: యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము: కుమారస్వామి
జపించాల్సిన మంత్రము: ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
ఫలితము: సత్సంతానసిద్ధి, జ్ఞానం, దిగ్విజయం.


22వ రోజు:
నిషిద్ధములు: పంటికి పనిచెప్పే పదార్ధాలు
దానములు: బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము: సూర్యుడు
జపించాల్సిన మంత్రము: ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా
ఫలితము: ఆయురారోగ్య తేజో బుద్ధులు.


23వ రోజు:
నిషిద్ధములు: ఉసిరి
దానములు: మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము: అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము: ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా
ఫలితము: మాతృరక్షణం,


24వ రోజు:
నిషిద్ధములు: మద్యమాంస మైధునాలు
దానములు: ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము: శ్రీ దుర్గ
జపించాల్సిన మంత్రము: ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
ఫలితము: శక్తిసామర్ధ్యాలు, ధైర్యం, కార్య విజయం.


25వ రోజు:
నిషిద్ధములు: పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు: యథాశక్తి
పూజించాల్సిన దైవము: దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము: ఓం ఈశావాస్యాయ స్వాహా
ఫలితము: అఖండకీర్తి, పదవీప్రాప్తి.


26వ రోజు:
నిషిద్ధములు: కారం మసాలా పదార్థాలు
దానములు: నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము: కుబేరుడు
జపించాల్సిన మంత్రము: ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
ఫలితము: ధనలబ్ది, విజయం, సిరిసంపదలభివృద్ధి.


27వ రోజు:
నిషిద్ధములు: ఉల్లి,  వంకాయ
దానములు: ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
పూజించాల్సిన దైవము: కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము: ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము: మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి.


28వ రోజు:
నిషిద్ధములు: ఉల్లి,  సొర, గుమ్మడి, వంకాయ
దానములు: నువ్వులు, ఉసిరి
పూజించాల్సిన దైవము: ధర్ముడు
జపించాల్సిన మంత్రము: ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా
ఫలితము: దీర్ఘకాల వ్యాధీహరణం.


29వ రోజు:
నిషిద్ధములు: పగటి ఆహారం
దానములు: శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము: శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము:
ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం,
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
ఫలితము: అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం.


30వ రోజు:
నిషిద్ధములు: పగటి ఆహారం
దానములు: నువ్వులు, తర్పణలు, ఉసిరి
పూజించాల్సిన దైవము: సర్వదేవతలు + పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము: ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః
ఫలితము: ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.






Post a Comment

0 Comments