Ad Code

వర్ణాశ్రమవిధాయినీ (అష్టాక్షరి) - Ashtakshari

వర్ణాశ్రమవిధాయినీ (అష్టాక్షరి)



ఇది అష్టాక్షరములు గల్గిన మంత్రము. పూజాకాలంలో "వర్ణాశ్రమ విధాయిన్యై నమ:” అని శ్రద్ధా భక్తులో ఉచ్చరించాలి.

వర్ణ - ఆశ్రమ - విధాయినీ = బ్రాహ్మణాది వర్ణములను, బ్రహ్మచర్యాది ఆశ్రమములను ఏర్పాటుచేసేది.

బ్రాహ్మణులు - క్షత్రియులు - వైశ్యులు - శూద్రులు అని వర్ణాలు నాలుగు. అటులనే బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అని నాలుగు ఆశ్రమములు. వీటిని ఏర్పాటు చేసేది పరాశక్తి అని సామాన్యమైన భావము.

మొదట వర్ణ శబ్దాన్ని పరిశీలిస్తాము. “వర్ణయతి గుణకర్మణీ ఇతి వర్ణః” అనే నిర్వచనాన్ని అనుసరించి ఒక వ్యక్తిలోని గుణమును బట్టియు, అతడి కర్మలను బట్టియు, బ్రాహ్మణాది వర్ణ విభజన జరిగినది అని తెలియుచున్నది.

భగవద్గీతలోను ఈ విషయము స్పుటంగా ఇలా తెలుపబడింది.

"చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః" (గీత)
బ్రాహ్మణుడు:
బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, ఆత్మజ్ఞాన సంపన్నుడు. స్థూలశరీర తాదాత్మ్య భావం లేనివాడు బ్రాహ్మణుడు. అట్టి వారిని బ్రాహ్మణ వర్ణముగా విభజించాలి.

క్షత్రియుడు:
ఇతరులకు గళ్లే ఆపదలను తొలగించేవాడు. ధర్మ సంరక్షణకు దీక్షితుడైన వానిని క్షత్రియుడు అన్నారు. ఇట్టి గుణం గలవారిని క్షత్రియ వర్ణం అన్నారు.

వైశ్యులు:
వస్తు వినిమయం ద్వారా ప్రజావసర విషయాలలో ప్రవేశించేవారిని మరియు దానాది సత్కార్యాలలోను ప్రవేశించే వారిని వైశ్యులు అన్నారు.

శూద్రులు:
ఈ పనులను చేయతగిన ప్రతిభాసంపద లేనివారలై కేవలము శారీరకంగా అందరికిని సేవలుచేసే వారిని శూద్రవర్ణము వారు అన్నారు. ఈ వర్ణములు అనేవి మాతృగర్భం ద్వారా సంక్రమించేవి కావు. వ్యక్తియోగ్యత ద్వారా లభిస్తాయి. ఒక తండ్రికి నలుగురు పుత్రులు ఉన్నచో
ఒకడు విద్వాంసుడును, ఆత్మజ్ఞాన సంపన్నుడును అగును. ఇంకొకడు సైన్యంలో చేరి మహావీరచక్ర గ్రహీత అగును. మూడవ వాడు పెద్ద పారిశ్రామికుడు కావచ్చును. నాల్గవవాడు ఉద్యోగం చేస్తూనో లేక రైతుగానో జీవ యాత్ర సాగించవచ్చును. అంతేగానీ తండ్రి బ్రాహ్మణ కులం వాడైనచో పుత్రుడును అట్టే ఉండును అని నియమం లేదు. మరియు స్త్రీ, పురుష రూపమైన లింగ వ్యవస్థయూ గుణకర్మలకు కారణంగా కనబడుటలేదు.

ఉదా: విదురుడు, ధర్మవ్యాధుడు, విశ్వామిత్రుడు, శబరి మొదలైనవారు జన్మతో బ్రాహ్మణులు గారు. నిగమశర్మ, గుణనిధి వంటి వారు బ్రాహ్మణ కులంలో పుట్టియు హీనంగా ప్రవర్తించారు. ఇలా ఎన్నియో ఉదాహరణములను తెలుపవచ్చును.

ఇక ఆశ్రమముల విషయములు సంగ్రహంగా గ్రహించుదాము.
బ్రహ్మచర్యము:
విద్యను సైతం బ్రహ్మ అందురు. బ్రహ్మ సాధనము అగుటచే మహర్షులు విద్యకు ఆ పేరును ఉంచి యుందురు. బ్రహ్మమునందు అనగా విద్యయందు ప్రవర్తిల్లెడివాడు బ్రహ్మచారీ, విద్యార్థి అనబడును. అట్టి వాని జీవిత వర్తనమును బ్రహ్మచర్యాశ్రమము అన్నారు. విద్యా విజయార్థము కొన్ని నియమాలను సైతం పెద్దలు ఏర్పాటుచేసినారు.

గృహస్థాశ్రమము:
విద్యాస్నాతుడు ఇష్టపడినచో గృహస్థుడుగా వచ్చును. అందును అతిథి. అభ్యాగతుల సేవ, గురుసేవ ఇత్యాది నియమాలు గలవు.

వానప్రస్థము:
వయస్సు ముదిరిన మీదట లౌకిక విషయాల పై మమతను వీడి బ్రహ్మ చింతనలో ప్రవర్తించే జీవితాన్ని వానప్రస్థము అందురు.

సన్యాసము:
బ్రహ్మనిష్టులై సర్వసంగ పరిత్యాగులై వర్తించే వారి జీవితమును మనము సన్యాసాశ్రమము అందురు. ఇందును శారీరక మానసిక సన్యాసములు ఆంతరాలు కలవు శారీరక సన్యాసులు కాషాయాంబరాలు ధరించడం. గుండు చేయించుకోవడం నియమాలను పాటిస్తారు. సర్వ వర్ణముల వారును, వారి వారి యోగ్యతను అనుసరం చతురాశ్రమాలకు అర్హులు అగుదురు. సనాతన ధర్మ దీపికలో (హంస యోహకము, మానవుల యందే గాక సృష్టి యండు అంతటను నాలుగు వర్గాలు గుండు సునంగా విభాగము చేయబడినాయి.

మన శరీరంనందును ముఖం బ్రాహ్మణ వర్ణము, భుజములు రక్షకములు తుకును వర్ణము, పూర్వ శరీర. ఉత్తర శరీర సంయోజకాలైన తురు నితంబాని భాగాలు వివరములు సేవాత్మకాలైన పాదాలు శూద్ర వర్ణములు - ఇత్యాదిగాను విజ్ఞులు వ్యాఖ్యానిస్తారు. బ్రాహ్మజోస్య ముఖమాసీత్" ఇత్యాది పురుషసూక్తమును ఇటులనే సమన్వయిస్తారు. ఈ సృష్టిలో అపరాలు అన్ని ఆశ్రమాలు మన శరీరావయవములు వలె అవధ్యకములే అను అన్నియును దేవీ స్వరూపములే అని సారాంతము.

ఈ మంత్రంతో దేవిని ఉపాసించే వారికి "విశ్వాత్య భావం కారణంగా త్వపాలు అంతరిస్తాయి. అమ్మ కరుణచే క్రమంగా తరిస్తారు.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.





Post a Comment

0 Comments