శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి
"హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క,
చందురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి,
తామరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు,
భాసురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్"
సంపదలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మి.
ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై వుంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయన్నది భక్తుల విశ్వాసం. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుంటాయి.
సంపద వుంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి.
సాగరమథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు.
ఆమె కటాక్షం కోసం మనం అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటాం.
శుచి, శుభ్రత, నిజాయతీ కలిగిన ప్రదేశాల్లోకి ఆమె ప్రవేశిస్తుంది.
శ్రీమహావిష్ణువును పూజించే వారిని అనుగ్రహిస్తుంది. అందుకనే శ్రీరామ అవతారంలో కోదండరామునికి ఇతోధిక సేవలందించిన విభీషణుడు..హనుమంతుడికి చిరంజీవులుగా వుండమని శ్రీరాముడు సీతాదేవి సమేతంగా వరాన్ని ఇచ్చాడు.
హనుమంతుడికి భవిష్యత్ బ్రహ్మ వరాన్ని ఇచ్చింది అమ్మవారు కావడం విశేషం.
గృహంలో ప్రశాంతత, మహిళలను గౌరవించడం, తెల్లవారుఝామునే లేవడం,
పూజాధికాలను క్రమం తప్పకుండా జరపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.
ఇంటికి సిరి ఇల్లాలు.
ఆమె మనస్సును ఎటువంటి పరిస్థితుల్లో నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.
ఆమె కంట తడి పెడితే లక్ష్మి వెళ్లిపోతుంది.
అమ్మ కటాక్షం కోసం అగస్త్య మహాముని ప్రవచించిన లక్ష్మీదేవి స్తోత్రం,
ఆదిశంకరాచార్యులు ఐదేళ్ల వయస్సులో పఠించిన కనకధార స్తోత్రాం,
లక్ష్మీదేవి అష్టోత్తరాలను ప్రార్థన చేయాలి.
మనకున్న దానిలో దానం చేయాలి.
ఇలా చేసేవారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుంది.
రోజూ ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి.
ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తోలిగిపోతుంది.
లక్షి దేవిని ఎప్పుడు గణపతితో, శ్రీ మహావిష్ణువుతో పూజించాలి.
ఇలా చేస్తే సిరుల తల్లి అనుగ్రహిస్తుంది.
ప్రతి ఇంట్లో తులసి మొక్క లేదా చెట్టు కచ్చితంగా ఉండాలి.
తులసికి నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు.
ఆర్థిక ఇబ్బందులు బాధపెడుతున్న వేళ నోరులేని మూగ జీవాలకు రోజు ఏదోక ఆహారం పెట్టాలి.
ముఖ్యంగా ఆవు లేదా పాలు ఇచ్చే పాడి పశువులు, కుక్కలకి ఇలా మూగ జీవాలకి తిండి పెడితే చాలు మహాలక్ష్మి త్వరగా అనుగ్రహిస్తుంది.
గుమ్మం ముందు ప్రధాన ద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి.
అలాగే ముందు వాకిలి శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి.
ఇలా చేస్తే శ్రీమహాలక్ష్మి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది.
శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే
What to do to get the blessings of Sri Mahalakshmi
"Harikim Battapu Devi, Punnemula Provu, Ardhamu Bennikka,
Chanduru's brother, with Bharati Girisutal, that day Poobodi,
Lotus is a beautiful girl, Jagamul forgive us,
Bhasuratan Lemulu Vapu mother, Siri Yichun Nithya Kalyanamul"
Sri Mahaala Kshmi is the head of wealth.
Devotees believe that the lives of those who have the blessings of that goddess will go smoothly. There will be no financial problems.
If you have wealth, you will have all the good benefits along with health.
Sri Mahavishnu has made Lakshmi Devi as his heart, who has emerged in the ocean.
We do many prayers and vratas for her blessings.
She enters places of clean, clean, honesty.
Bless those who worship Sri Mahavishnu. That is why in Sri Rama's avatar, the oppressor who has given more services to Kodanda Rama.. Sri Rama along with Sita Devi has given a boon to Hanuman to be a chiranjivu.
The future has given Brahma boon to Hanuman, it is special that it is a mother.
Peace in the house, Respecting women, Waking up early in the morning,
You can be blessed with the blessings of Lakshmi Devi by conducting the worships regularly.
Siri houses for the house.
The law says she should not be hurt in any circumstances.
If she keeps her eyes wet, she will go away.
For the sake of mother's blessings, Lakshmi Devi prophesies Agastya Mahamu,
Kanakadhara Stotram studied at the age of five years by Adishankaracharya,
Lakshmi Devi should pray for the eighteen years.
Donate what we have.
Those who do like this will always have the blessings of Sri Mahalakshmi.
No sesame oil every morning and evening
Lamp should be lighted with cow and ghee.
If you do like this, you will get rid of bad luck at home.
Lakshmi Devi is always with Ganapathi,
Worship with Sri Mahavishnu.
If you do like this, Sirula mother will bless you.
Every house must have a basil plant or tree.
There will be no shortage of money in that house if you light a lamp for Tulsi daily.
In the time of financial problems, some food should be given to the dumb creatures who don't have mouthless people daily.
Especially if you feed the cow or milk to the dairy animals, dogs like this to the dumb creatures, Mahalakshmi will bless you soon.
The main door should always be clean in front of the door.
In the same way, the house should be cleaned first after cleaning the door.
If you do like this, you will get the blessings of Sri Mahalakshmi soon.
Sri Mahalakshmi Namostuthe
0 Comments