అనుగ్రహము అంటే దయ అనియు అర్థము గలదు. "ఎదుటి వారి కష్టాలనుగాంచి వారిని ఆ కష్టాల నుండి తొలగించాలి అనే ఆర్ధగుణాన్ని అనుగ్రహం, దయ మొదలైన నామాలతో వ్యవహరిస్తారు. అట్టి దయను, అనుగ్రహాన్ని ఇచ్చేది శ్రీదేవి. సంసార బాధలతో దిక్కుతోచక విలపించే ఆర్తులను రక్షించేది పరాశక్తి అని సారాంశము.
ఈ అనుగ్రహం అనేది దాత యొక్క యోగ్యతను అనుసరించియే సామాన్యంగా ఉంటుంది. మహారాజు కడకు పోయి భిక్షను అడిగినచో ఆ ప్రభువు తాత్కాలిక భిక్షనే గాక శాశ్వత భుక్తికై ఏదేని అగ్రహారాన్నే దానం చేస్తాడు. అలాగే దేవీ అనుగ్రహం సైతం తాత్కాలిక దారిద్ర్యాది దుఃఖ నివృత్తితోబాటు శాశ్వతాత్మానంద సుఖదాయకమై ఉంటుంది.
అమ్మను సేవించే వారికి భౌతిక సుఖాలు, ఆధ్యాత్మిక సుఖాలు అన్నియూ లభిస్తాయి.
0 Comments