శ్రీ మేధా దక్షిణామూర్తి
శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు. శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే.
ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు. గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయేనమ:
అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీదక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం. శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం.
దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం.
ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి. మహర్షులు దర్శించిన క్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది.
అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు. మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.
ఆ రూపాలు వరుసగా,
శుద్ధ దక్షిణామూర్తి,
మేధా దక్షిణామూర్తి,
విద్యా దక్షిణామూర్తి,
లక్ష్మీ దక్షిణామూర్తి,
వాగీశ్వర దక్షిణామూర్తి,
వటమూల నివాస దక్షిణామూర్తి,
సాంబ దక్షిణామూర్తి¸
హంస దక్షిణామూర్తి,
లకుట దక్షిణామూర్తి,
చిదంబర దక్షిణామూర్తి,
వీర దక్షిణామూర్తి,
వీరభద్ర దక్షిణామూర్తి¸
కీర్తి దక్షిణామూర్తి,
బ్రహ్మ దక్షిణామూర్తి¸
శక్తి దక్షిణామూర్తి,
సిద్ధ దక్షిణామూర్తి.
దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.
Sri Medha Dakshinamurthy form for higher education, Sri Medha Dakshinamurthy is the form of Sri Medha Dakshinamurthy who enhances interest in education, memory power and success in exams. Shiva is the form of knowledge, intellectual dakshinamurthy Vishnu is the form of knowledge, Hayagrivudu.
These two are the form of knowledge. Knowledge providers are. Now there is nothing to say about education. Elders say that Dakshinamurthy stotram also gives the blessings of the Guru. Guru is the whole world, we are the one who is the one who is the one Treasure is all education Sri Dakshinamurtayenama:
This means Namaskaram to those who are suffering from the disease of the family of the teacher, Sri Dakshinamurthy, who is the treasure of all the education. It is a tradition to worship the form of Lord Shiva as a south idol. The south means efficiency Ignorance is the root cause of sorrow. If such ignorance is destroyed, all the sorrows are gone. Kindness is the one that brings permanent destruction to the sorrows.
If this south is witnessed as an idol, then that form is the south idol. Dakshinamurthulu visited by Maharshulu are many different types. Dakshinamurthy gave darshan to Brahma for the first time.
After that, Dakshinamurthy has given a witness to Vasishtuna and Sanakasanandanadulu also.
Those who worship Dakshinamurthy will get wisdom. That is why students are specially asked to worship the south idol. Vishnu, Brahma, Surya, Skanda, Indra and others worshiped Dakshinamurthy and got gravity. Mantra has mentioned many southern idols.
Those forms in a row,
Pure Southern Idol,
Intellectual South Murthy,
Vidya Dakshinamurthy,
Lakshmi Dakshinamurthy,
Vageswara Dakshinamurthy,
South Murthy, the residence of Vatamula,
Samba Dakshinamurthy dakṣiṇāmūrti¸
Hamsa Dakshinamurthy,
Lakuta South Murthy,
Chidambaram South Murthy,
Veera Dakshinamurthy,
Veerabhadra Dakshina Murthy dakṣiṇāmūrti¸
Keerthi Dakshinamurthy,
Brahma Dakshinamurthy dakṣiṇāmūrti¸
Shakti Dakshinamurthy,
Siddha Dakshinamurthy.
Intelligent Dakshinamurthy can provide education to the students in Dakshinamurthy. After Saraswati Devi, for the sake of educated people, the god who is measuring by Hindus is Medha Dakshinamurthy. Children become well educated and have happiness in life with Medha Dakshinamurthy movements.
0 Comments