Ad Code

తాటి రొట్టె - Palm Cake

తాటి రొట్టె



తాటి రొట్టె తినని ఎవరూ ఉండరేమో. మామిడిపళ్ళు కాలం వెళ్ళగానే తాటిపళ్ళు రావటం మొదలు అవుతాయి. మన జిల్లాల్లో ఏ మూలకువెళ్ళనా అక్కడి పొలాల్లో దొరికే ఈ తాటిపళ్ళు తో చక్కటి పదార్ధాలు తయారు చేసుకోవొచ్చు. వర్షకాలం సీజన్లోవచ్చే ఈ తాటిపళ్ళు ఎన్నో అద్భుతమైన మన పల్లెటూరురుచులను అందిస్తాయి. వీటితో రొట్టెలు, ఇడ్లీలు, గారెలు లాంటివి చేసుకుంటే అద్భుతః

మా చిన్నప్పుడు తాటిపళ్లకోసం ప్రొద్దునే పొలాలకు పెరిగెట్టేవాళ్ళం, అప్పటికే చెట్టు మొదట్లో పళ్ళు రాలి వుండేవి . వాటిల్లో కాస్త మంచివి ఏరుకొని పక్కన నడిచే బోదెల్లోనో , కలువల్లోనో కడుకునేవాళ్ళం. పక్కనే ఉండే గడ్డివాము లోంచి వరి గడ్డి వీటికిచుట్టి తాటాకుల మంటతో కాస్తా దోరగా కాల్చుకొని అరిగించేసే వాళ్ళం.

మా చిన్నప్పుడు అమ్మమ తాటి పళ్ళను కుంపట్లో పెట్టి , గుండ్రంగా కాలేవరకు తిప్పుతూ కాల్చేది. బాగా కాలిపోయాక పైతొక్క తీసేసి లోన టెంకకున్న గుంజు కోసం పీచును పళ్ళతో పీకుతూ తింటుంటే భలే తమాషాగా ఉండేది . రుచైతే ఇక చెప్పక్కర్లేదు.

తాటి పళ్ళను పూర్తిగా శుభ్రం చేసి పరుగుడు -ఓ అడుగు ఎత్తువుండే ఇనుప నిచ్చెన లాంటి పనిముట్టుతో ఆ కాయలనుండి గుజ్జు తియ్యడం పెద్ద పని. దానిని తాటి "పీసం" అంటారు. స్టైలుగా పలకాలంటే (క్రీం ఆఫ్ ద పాం)

పిసం తీసాక దానిలో సరిపడా వరి నూక , కొద్దిగా బెల్లం , కొబ్బరి తురుము , యాలికకాయాల పొడి కలిపి నాలుగైదు గంటలు నాన బెట్టుకుని , చిన్న మంటపై మూకుడులో రొట్టెల్లా వేసి కింద నుండి కాసంత సెగ తగిలించేది పైన ఒక అరిటాకును బోర్లించి కింద పొయ్యిలో ఉన్న నిప్పుల్ని అరిటాకు మీద ఏసి కొంచం సేపు కాలాక ఆ నిప్పులు తీసివేసేది పైన ఎందుకు నిప్పులు వెయ్యడం అంటే దిబ్బరొట్టె అంటే బాగా దలసరిగా ఉంటుంది కదా, కింద పెట్టిన మంట వలన బాగా కాలినట్టే మరి పైన కూడా కాలడం కోసం ఆ నిప్పులు వేసేది అలానే తాటి ఇడ్లీ, తాటి గారెలు కూడా వేసేది . కాల్చిన రొట్టె మరునాటికి మరింత రుచిని ఇచ్చేది . రోట్టేకు పైన క్రిందా కాలిన మాడు కూడా ప్రత్యేకమయిన రుచిని సంతరించుకుంటుంది.

తాటి రొట్టెంటే నాకు చాలా ఇష్టం . అలానే మా పెద్దమ్మాయికూడా బాగా యిష్ట పడుతుంది. అమ్మి చే తయారుచేయించి హైదరాబాద్ కు పంపటం మాకు పరిపాటే.

తాటిపండ్ల పిసం నుండి తాండ్ర కోసం చాపల ఫై పూసి ఎండ పెట్టేది, తాండ్ర పట్టుకుంటే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది వీటిని పొరలు, పొరలుగా తీసుకుని తింటూ ఉంటే ఆ మజానే వేరు. ఆంగ్లంలో ఫ్రూట్ లెదర్స్ అని కూడా పిలుస్తున్నారు.

పిసం తీసిన కాయలను బూడిద తో కూడిన మట్టిలో కప్పెడితే నాగుల చవితికి తేగలుగా తయారుఅవుతాయి.

అవునండోయ్ చెప్పటం మరిచా మనకు అనుకొనివున్న గ్రామం తాళ్లపాళెము లో తేగలు ప్రసిద్ధి. మంచి కమ్మనైన రుచిని కలిగి ఉండేవి.

అసలీ తాటి చెట్టు ప్రసక్తి, రామాయణ భారతాల లోనే వుందట . శ్రీరాముడు తనమీద సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికి ఏడు తాటి చెట్లను ఒక్క బాణం తోనే పడగొట్టాడట.

ఇకపోతే తాటి చెట్టు కి సంబంధించిన సామెతలు తెలుగులో చాలానే వున్నాయి. తాడిలా పెరిగాడంటారు. తాడిని తన్నేవాడి తలదన్నే వాడుంటారు. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు. కోపం తాటాకు మంటలా ఉండాలంటా.

తాటి చెట్టు వల్ల ఇన్ని లాభాలు ఉన్నా తాటి చెట్టు నీడ, తాగుబోతు మొగుడూ ఎందుకూ పనికిరారు అంటారు.

చివరగా, తాటి చెట్టు నీడ పనికిరాదన్న విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి అంటాడు.

తాటిపండ్లు వరుసగా నలభై రోజులు తింటే వంటికి మంచి రంగు వస్తుందని, ఆయుష్షు పెరుగుతుందనే కొంతమందికి నమ్మకం ఉంది.
తాటి చెట్టునుంచి ముందుగా కల్లు , ముంజులు , అవి ముదిరితే పళ్ళు , అనక తేగలు , బుర్రగుంజు ఇన్ని అవతారాలు .. ఏదైనా తాటి చెట్టు కల్ప వృక్షమే.
అంటున్నాను అని కాదుగానండి ఇప్పుడి తరానికి ఇవి చెయ్యడం అంతగా కుదరడండి , ఆ మాటకొస్తే మన అమ్మ వాళ్ళకి కూడా చాలా మందికి రాదండి .ఈ తాటిపళ్లతో రొట్టెలు లాంటివి చెయ్యాలంటే మన అమ్మమ్మ, నానమ్మ వాళ్లేనండి ఆయ్.


Palm bread
Maybe there is no one who does not eat palm bread. Mangoes will start coming as soon as the time is gone. In any corner of our districts, we can make good ingredients with these palm fruits that are found in the fields. These rainy season palms give you a lot of amazing village flavors. It will be wonderful if you make bread, idli and garland with these.
In our childhood, we used to grow in the fields early morning for the sake of palm trees, already we used to have teeth in the beginning of the tree. We used to wash some of the good things in them and walk beside them in the bodel or in the weed. We used to burn the rice grass from the side of the grass and cut the rice grass with the fire of the plates.

In our childhood, grandma used to put the palm teeth in the pot and burn it till it becomes a round. It would have been funny if you remove the roof and eat the peach with teeth for the sake of the bunju that has been burned well. If it tastes, there is no need to tell.

Cleaning the palm teeth completely and running-foot high iron ladder work is a big job. It's called a palm ′′ piece To shine in style (cream of the palm) After removing the grasp, mixing rice oil, a little jaggery, coconut rust, yarn powder and soak it for four hours, put all the bread in the nose on a small fire and soak it from the bottom, why do you put a rice on the top and put the fire in the bottom of the oven on the bottom and remove the fire after some time? Bread is very good to light fire, it is like burning well due to the fire that is kept below and to burn on the top, it is also used to put palm idli and palm garries. Baked bread will be more tasty the next day. Even the downstairs of the bread also enjoys a unique taste.

I love palm bread so much. And my big girl loves it too. It is a problem for us to sell and send it to Hyderabad. From the palm fruits, for the sake of tandra, it is used to put sun on the rice, if you hold the tandra, it feels a bit stubborn. If you take these as layers and eat them, it is different fun. They are also known as fruit leathers in English. If you cover the fruits that are removed from the gray mud, it will be made as a sweets for the cobra chaviti. Did you forget to say yes, the village which we think is famous in Tallapalemu. The ones that had a good tastes.
The real palm tree's relevance, Ramayana is in India only. To make Sugrivudu believe in him, Sri Rama has dropped seven palm trees with one arrow it seems. Now, there are many proverbs related to the palm tree in Telugu. They say he has grown like a rope. The one who stitches the rope will be used as the head of the one who stitches the rope, as if a palm fruit has fallen on the fox. Anger has to be like a fire to a plate it seems.
Even though there are so many benefits from the palm tree, why are the shadow of the palm tree and the drunkard husband are not useful. Finally, Elephant Lakshmana Kavi says that the shadow of palm tree is useless Some people believe that if you eat palm fruits for forty days in a row, your kitchen will get good color and your life will increase. First of all, stone, frosts, if they grow from the palm tree, teeth, anaka tegas, burragunju are these incarnations!! any palm tree is a kalpa tree.
Don't say that I am saying, but don't do this for this generation. If that word comes, many people won't get it. If you want to make bread with these palm teeth, our grandmother and grandparents are there.


Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.






Post a Comment

0 Comments