Ad Code

మణికరాన్ - Manikaran

మణికరాన్


ఓంనమశ్శివాయ హిమాచల్ ప్రదేశ్ లోని కుల్మనాలి నుండి సుమారు 100కిలోమీటర్ల దూరంలో వున్న మణికరాన్ శివాలయంలోవున్న ఈవేడినీటి కొనేరు. ఈవేడినీటిలోకి  గుండిగనుదింపగా ఒక అయిదునిమిషాల్లోనే తయారు అవుతున్న అన్నం. ఈ అన్నాన్నే అక్కడి ప్రజలు ప్రసాదంగా స్వీకరిస్తారు. అద్భుతం కదా!

మణికరాన్ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కుల్లూ జిల్లాలోని ఈశాన్య భుంతర్‌లోని బియాస్ మరియు పార్వతి నదుల మధ్య ఉన్న పార్వతీ లోయలో నెలకొని ఉంది. ఇది 1760 మీటర్ల ఎత్తులో ఉంది, కుల్లు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. కులు నుండి మనాలి వెళ్లే మార్గంలో మణికరాన్ ప్రదేశం ఉన్నది. పార్వతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం వేడి నీటి బుగ్గకు ప్రసిద్ధి చెందినది. ఈ చిన్న పట్టణం తన వేడి నీటి బుగ్గలతో యాత్రా కేంద్రాలతో మనాలి మరియు కుల్లు సందర్శిస్తున్న పర్యాటకులను తన వైపుకు ఆకర్షించుకుంటోంది. ప్రయోగాత్రకమైన భూ అంతర్గత ఉష్ణశక్తి కర్మాగారం కూడా ఇక్కడ నిర్మితమైనది.

మణికరాన్ హిందువులు మరియు సిక్కులకు తీర్థయాత్ర కేంద్రం. వరదల తర్వాత మనువు మణికరాన్ లో మానవజీవితాన్ని పునఃసృష్టించాడని, ఆ విధంగా ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా చేశాడని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడ పలు ఆలయాలు మరియు ఒక గురుద్వార కూడా ఉన్నాయి. ఇక్కడ రాముడు, కృష్ణుడు, మరియు విష్ణువు ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం వేడినీటి బుగ్గలకు మరియు సుందర ప్రకృతి దృశ్యానికి పేరుగాంచింది.

దేవతలకు నిలయంగా పేరుపొందిన హిమాచల్ ప్రదేశ్ లోని 'మణికరాన్' పార్వతీ లోయలో ఉంటుంది. ఈ మణికరాన్ హిందువులతో పాటు సిక్కులకు కూడా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఉన్న నీటిలో స్నానం చేస్తే దీర్ధకాలంగా బాధపడుతున్న చర్మ రోగాలతో పాటు. ఆస్మా కూడా చాలా వరకూ నయం అవుతుంది. అందుకనే ఈ క్షేత్రానికి నిత్యం హిందూ, సిక్కులు భక్తులు వేల సంఖ్యలో వస్తారు.

పురాణాల ప్రకారం, పరమశివుడు ఆయన దేవేరి పార్వతి ఈ లోయలో నడుస్తున్నప్పుడు, పార్వతి తన కర్ణాభరణాలలో ఒకదాన్ని ఇక్కడ జారవిడిచిందట. ఈ కర్ణాభరణాన్ని నాగదేవత అయిన శేషుడు స్వాధీనపర్చుకుని దాంతోపాటు భూమిలోకి మాయమైపోయాడట. పరమశివుడు విశ్వ నృత్యమైన తాండవ నృత్యం చేసినప్పుడు మాత్రమే శేషుడు ఈ ఆభరణాన్ని స్వాధీనపర్చి నీటలోకి విసిరివేశాడట. స్పష్టంగానే, 1905లో భూకంపం వచ్చేంతవరకు మణికరాన్ జలాల్లో ఆభరణాలు విసిరివేయబడటం కొనసాగింది.

ఈ ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు పరమశివుడు, పార్వతీదేవి పర్వతాలతో, హరిత పత్రాలతో వ్యాపించి ఉన్న ప్రాంతానికి వచ్చారని మణికరాన్ పురాణ గాథ చెబుతోంది. ఆ ప్రాంత సౌందర్యాన్ని చూసి మరులుగొన్న వీరు కాస్సేపు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి వీరు ఇక్కడే పదకొండు వందల సంవత్సరాలు గడిపారని భక్తుల విశ్వాసం. వారు ఇక్కడ గడిపిన కాలంలో, పార్వతీదేవి మణి నీటి ప్రవాహంలో జారిపోయిందట.ఈ పురాణగాధ నుంచే మణికరాన్ పేరు పుట్టింది.

ఇక్కడి నీళ్లు ఇప్పటికీ వేడిగానే ఉంటూ పరమ శుభదాయకంగా భావిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే తీర్థయాత్ర ముగించిన ఫలితం ఒనగూరుతుందని నమ్మిక. ఈ ప్రాంతాన్ని సందర్శించాక ఇక కాశీని కూడా సందర్శించనవసరం లేదని జనం విశ్వాసం. ఈ బుగ్గలోంచి ఉబికి వచ్చే నీటికి వ్యాధులను పోగొట్టే శక్తులు ఉన్నాయని భావిస్తుంటారు. ఇక్కడి నీరు ఎంత వేడిగా ఉంటుందంటే బియ్యం కూడా ఉడికిపోతాయి. పరమశివుడికి చెందినది కావడంతో ఈ ఆలయాన్ని అత్యంత భయభక్తులతో చూస్తుంటారు. అయితే, 1905 సంభవించిన భూకంపం ఆలయాన్ని స్వల్పంగా దెబ్బతీసింది మరియు ఆలయం కాస్త పక్కకు ఒరిగిపోయింది.

హిమాచల్ ప్రదేశ్ లోని మణికరాన్ లో ఉన్న ప్రసిద్ద పర్యాటక ప్రదేశం శ్రీ గురునానక్ దేవ్ జీ గురుద్వారా. గురునానక్‌తో సంబంధం కారణంగా ఇక్కడి శ్రీ గురు నానక్ దేవ్ జీ గురుద్వారా సుప్రసిద్ధమైనది. ఈ గురుద్వారాకు వచ్చే భక్తులు వేడినీటి బుగ్గల నుంచి వచ్చే వేడినీటిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఇక్కడ చేసే మూడు స్నానాలలో ఒకటి గురుద్వారా కిందనే ఉంది. స్త్రీ పురుషులకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడికి కాస్త దూరంలో లంగార్ హాల్ (సామూహిక వంటశాల) ఉంది ఇక్కడ ఉచిత భోజనం అందిస్తారు.

హిమాచల్ ప్రదేశ్ లోని విష్ణు కుండం వద్ద ఉన్న కూలాంత పీఠం దేశంలోని అత్యుత్తమ పీఠాల్లో ఒకటి. జానపద గాధల ప్రకారం లయకారకుడు శివుడు ఇక్కడే నివశించాడు. అందువ్ల ఈ ప్రాంతం అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. భక్తులకు మోక్షాన్ని ప్రసాధించే శక్తిగల పవిత్రమైన నీరు ఈ పీఠంలోని చెరువులో ఉన్నాయని నమ్ముతారు.

హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో వున్న హరీందర్ పర్వతం & పార్వతి నది ఏడాది పొడవునా అనేకమంది యాత్రికులను ఆకర్షిస్తాయి. మంచుతో కప్పబడిన హరీందర్ పర్వతం, దాని దట్టమైన పచ్చటి లోయ రెండూ కలిసి మణికరణ్ అందాన్ని ఇనుమడి౦పచేస్తాయి.

17 వ శతాబ్దంలో రాజా జగత్ సింగ్ నిర్మించిన రామచంద్ర దేవాలయం హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.హిమాచల్ ప్రదేశ్ లోని మణికరాన్ లో ప్రసిద్ద పర్యాటక ప్రదేశం. ఒక ఇతిహాసం ప్రకారం విష్ణువు ఏడవ అవతారం అయోధ్యా రాజు రామచంద్రుడు ఈ గుడిని అయోద్య నుండి మణికరాన్ కు మార్చాడు. ఈ గుడి చరిత్ర ఈ గుడి గోడల్లోని ఒకదానిపై రాసి ఉంది.

హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో వున్న పురాతన దేవాలయం శివాలయం. లయకారకుడైన శివుడు, సృష్టికారకుడు బ్రహ్మ, స్థితి కారకుడు విష్ణువు కలిసి త్రిమూర్తులుగా వ్యవహరింపబడతారు. 1905 లో రిక్టర్ స్కేల్ పై 8.0 తీవ్రత తో వచ్చిన భూకంపం తరువాత ఈ గుడి కొద్దిగా ఒరిగింది. కులు లోయ నుంచి దేవతలు వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శిస్తారని ప్రజలు నమ్ముతారు.

మణికరణ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న పుల్గా ఇక్కడి మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ప్రకృతి స్వర్గంగా ఎంతోమంది చేత భావించబడే ఈ ప్రదేశం చుట్టూ పైన్ చెట్ల అడవులతోను, పర్వతారోహణ మార్గాలతోను చుట్టుబడి వుంటుంది. పర్వతారోహణ చేయాలనుకునే యాత్రికులకు ఈ 16 కిలోమీటర్ల దారి వెంట 1600 మీటర్లు ఎక్కే అవకాశం వుంది.

విమాన మార్గం:
మణికరాన్ కు సుమార్ 35కిలోమీటర్ల దూరంలో భున్తార్ ఎయిర్ పోర్ట్ ఉంది. ఢిల్లీ, ఛండీగర్ మరియు మరికొన్ని ప్రధాన నగరాల నుండి రెగ్యులర్ విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. మణికరాన్ కు అతి సమీపంలో 160కిమీ దూరంలో చండీగడ్ ఎయిర్ పోర్ట్ ఉంది.

రైలు మార్గం:
మణికరాన్ కు ఎలాంటి సమీప రైల్వేష్టేషన్ మంజూరు కాలేదు. కానీ మనికరన్ కు దగ్గరలో ఒక పెద్ద రైల్వేష్టేషన్ పంజాబ్ లో పథాన్ కోట్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడికి ఇండియాలోని ప్రధాన నగరాల నుండి ప్రధాన రైలులు చేరుతాయి. మనికరన్ కు సుమారు 300కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుండి ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి. అలాగో మరో రైల్వేష్టేన్ సుమారు 149కిలోమీటర్ల దూరంలో జోగిందర్ రైల్వేష్టేషన్ ఉంది.

రోడ్డు మార్గం:
సిమ్లా, పతాన్ కోట్, చంఢీగఢ్, న్యూ ఢిల్లీ వంటి ప్రధాన నగరాల నుండి అనేక బస్సు సర్వీసులున్నాయి.


Manikaran Temple:
Manikaran is located in the Parvati Valley on river Parvati, northeast of Bhuntar in the Kullu District of Himachal Pradesh. It is at an altitude of 1760 m and is located 4 km ahead of Kasol and about 45 km from Kullu and about 35 km from Bhunter.

This small town attracts tourists visiting Manali and Kullu to its hot springs and pilgrim centres. An experimental geothermal energy plant has also been set up here.

Manikaran is a pilgrimage centre for Hindus and Sikhs. The Hindus believe that Manu recreated human life in Manikaran after the flood, making it a sacred area. It has many temples and a gurudwara. There are temples of the Hindu deities Rama, Krishna, and Vishnu. The area is well known for its hot springs and its beautiful landscape.

According to legend, when the Hindu God Shiva and his consort Parvati were walking in the valley, Parvati dropped one of her earrings. The jewel was seized by Shesha, the serpent deity, who then disappeared into the earth with it. Shesha only surrendered the jewel when Shiva performed the cosmic dance, the Tandava and shot the jewel up through the water. Apparently, jewels continued to be thrown up in the waters at Manikaran until the 1905 Kangra earthquake.

According to the Sikhs, during third Udasi, the founder of Sikhism Guru Nanak came to this place in 15 Asu 1574 Bikrami with his disciple Bhai Mardana. Mardana felt hungry and they had no food. Guru Nanak sent Mardana to collect food for the langar (the Community Kitchen). Many people donated atta (flour) to make Roti(bread). The one problem was that there was no fire to cook the food. Guru Nanak asked Mardana to lift a stone and he complied and a hot spring appeared. As directed by Guru Nanak, Mardana put the rolled chapatis in the spring to his despair the chapatis sank. Guru Nanak then told him to pray to God saying that if his chapatis float back then he would donate one chapati in His name. When he prayed all the chapatis started floating duly baked. Guru Nanak said that anyone who donates in the name of God, his drowned items float back.

The legend of Manikaran states that while roaming around, Lord Shiva and Goddess Parvati, once chanced upon a place that was surrounded by mountains and was lush green. Enamoured by the beauty of the place, they decided to spend some time there. It is believed that they actually spent eleven hundred years here.

During their stay here, Goddess Parvati lost her mani (precious stones) in the waters of a stream. Upset over the loss, she asked Shiva to retrieve it. Lord Shiva commanded his attendant to find the mani for Parvati. However, when they failed, he was extremely angry. He opened his third eye, a tremendously inauspicious event which led to disturbances in the universe. An appeal was made before the serpent god, Sheshnag, to pacify Lord Shiva. Sheshnag hissed thereby giving rise to a flow of boiling water. The water spread over the entire area resulting in the emergence of precious stones of the type Goddess Parvati had lost. Lord Shiva and Goddess Parvati were happy at the outcome.

The name Manikaran is derived from this legend. The water is still hot and is considered extremely auspicious. A pilgrimage to this place is thought of as complete. It is also believed that there is no need to pay a visit to Kashi after visiting this place. The water of the spring is also supposed to have curative powers. The water is so hot that rice can be cooked in it.






Post a Comment

0 Comments