Ad Code

శ్రీ వరాహ జయంతి - Sri Varaha Jayanthi

వరాహ జయంతి


భాద్రపద శుద్ధ తదియ దీన్నే వరాహ జయంతి గా జరుపుకుంటాం.

హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భాన దాచినప్పుడు మహావిష్ణువు ఆదివరాహ రూపంలో అవతారం దాల్చి తన కోరలతో భూమిని సముద్రం నుండి బయటకు తీసి హిరణ్యాక్ష సంహారం చేయడం జరిగింది. స్వామి అవతరించిన ఈరోజు స్వామిని ఈ కింది నామాలతో ధ్యానించి తేనె మరియు నేతి తో చేయబడిన క్షీరాన్నమ్ నివేదన చేయండి.

స్వంత గృహం కొరకు స్వామికి విన్నవించుకోండి. కలియుగంలో సాక్షాత్తు ఆయన వెంకటేశ్వర స్వామికే ఇల్లుని ప్రసాదించిన మహా మూర్తి.

వరాహ నామ స్తోత్రం:
ప్రథమం వరాహదేవ నామ ద్వితీయం భూవల్లభం
తృతీయం మహారౌద్రంచ చతుర్ధం శాంతమానసం
పంచమం ఆదివ్యాధినాశనంశ్చ షష్ఠం హిరణ్యాక్షభంజనం
సప్తమం గదాధరంశ్చ అష్టమం క్రోడరూపిణం
నవమం గ్రహపీడానివారణంశ్చ దశమం యజ్ఞస్వరూపిణం
ఏకాదశం విప్రవంద్యంశ్చ ద్వాదశం విశ్వమంగళం ||

ఇతి శ్రీ వరాహస్వామి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం





Post a Comment

0 Comments