Ad Code

ఈలోకంలో ప్రతీది మనకు ఆదర్శమే

ఈలోకంలో ప్రతీది మనకు ఆదర్శమే


పడగొట్టిన వాడి పైన పగ పట్టకుండా దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకొనే  "సాలె పురుగు" మనకు ఆదర్శం.

ఎన్ని సార్లు పడినా పౌరుషంతో మళ్ళీ లేసే "అలలు" మనకు ఆదర్శం.

మొలకెత్తడం కోసం భూమిని సైతం  చీల్చుకొని వచ్చే  "మొక్క" మనకు ఆదర్శం.

ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకెళ్లే  "బాణం" మనకు ఆదర్శం.

ప్రత్యర్ధి పెద్దదైన సరే సూర్యుడిని సైతం కప్పి ఉంచే  "మేఘాలు" మనకు ఆదర్శం.

అసాధ్యం అని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే "గాలిపటం" మనకు ఆదర్శం.

తానున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే "పువ్వు" మనకు ఆదర్శం.

ఎంతటి వేడిని అయిన తాను భరిస్తూ మనకు మటుకు చల్లని  నీడనిచ్చే "చెట్టు" మనకు ఆదర్శం.

ఎప్పుడు విడిపోయిన ఇద్దర్ని కలపడానికి తాపత్రయ పడే  "సూది" మనకు ఆదర్శం.

తన మూలంగా లోకం చీకటి అవకూడదు అని రోజంతా వెలుగునిచ్చే "సూర్యుడు" మనకు ఆదర్శం.

తను ఎంత చిన్నదైనా తన వంతు భూదాహాన్ని తీర్చే  "చినుకు" మనకు ఆదర్శం.

చుట్టూ చీకటే ఉన్నా చల్లని వెన్నెల పంచే "చంద్రుడు" మనకు ఆదర్శం.

ఒక్క సారి అన్నం పెడితే జన్మంత విశ్వాసంగా ఉండే  "శునకం" మనకు ఆదర్శం.

జీవించేది కొంత కాలమైన అనుక్షణం ఆనందంగా ఉండే  "సీతాకోకచిలుక" మనకు ఆదర్శం.

ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమంలో పాలను మాత్రమే తాగే "హంస" మనకు ఆదర్శం.




Post a Comment

0 Comments