Ad Code

లోకులు పలు కాకులు - Lokulu Palu Kakulu

లోకులు పలు కాకులు
ఒక పెంకుటింటి అరుగు పై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండచుట్టి విసిరేశాడు. ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి. ఆనందం తో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి.

అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది. కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో బూరెను లాగింది. అది రాలేదు, మరోసారి ప్రయత్నించింది అమాయకంగా, దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది. ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది. ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఓ కాకి చూసింది. కాకి తెలివి తక్కువతానానికి నవ్వుకుంది. ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా, మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది. రెండో కాకి ఉత్తుత్తి బూరె కోసం కాకి పాట్లు తలుచుకుని మళ్ళీ నవ్వింది. మూడో కాకి ఈ విషయం ఇంకో కాకికి చెప్పింది.

'అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా' అంటూ ముగించింది. తన వర్ణనలో 'ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం' అనే ముక్క చేర్చలేదు.
ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. 'తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడానూ ' అంటూ మరో మాట చేర్చింది.

ఈ కాకులు ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి.
వాటిలో ఓ కాకి అయితే 'కాకి కన్ను పొడిస్తే, పాపం రక్తం కారిందట కూడానూ' అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది.

మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్లి 'ఆ గోడపై రక్తపు చారికలు చూసాను 'అంటూ వాపోయింది.
మరో కాకి 'నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది' అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది.

అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడి కాకిగా ముద్రవేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి.

ఇవేమీ ఎరుగని మొదట కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులును స్నేహంగా చూసింది.
అప్పటిదాకా గుసగుసలాడుతున్న కాకులు చప్పున మాటలు ఆపి ముభావంగా తలలు తిప్పుకున్నాయి.
కాకికి ఏమి అర్థంకాలేదు. రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులుతున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది.

"ఒక్కోసారి అంతే! మన ప్రమేయం ఏమి లేకుండానే మనని సమాజం చెడ్డ వాళ్ళని చేసేస్తుంది. నీలాపనిందలు, పుకార్లమయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధ పడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకో చాలు. అలాంటి వందల మంది నీకేలా? " అంటూ ఓదార్చింది కొమ్మమీద కోయిలమ్మ. సూక్తి:
ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, అతనితో స్నేహం చేయకుండా,అతనిని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లు నమ్మటం,పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వలన, ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోతాము. "లోకులు కాకులు" అన్న సూక్తి ఊరుకునే వచ్చిందా మరి.



In the same paper, a picture of a crow eating buree is drawn nicely. As the hope of a crow, the picture of a crow has dragged a bore in the mouth of a crow. It didn't come. Tried one more time innocent. The crow's picture was torn close to the eye after its nose hit. The crow who found out that this is not a real Buree, left the pot and flew away. All this was seen by a crow on the tree next to the wall. The crow laughed at the stupidity. Meanwhile, another crow that came and fell, asked the reason for that smile curiously, First the crow described the madness The second crow. Uttutti Buree's crows and laughed again. The third crow has told this to another crow.

'But the crow ended by saying, isn't it wrong to pull the bore in the mouth '. In his description, 'this is true, not a crow, but a picture of a crow on paper' did not include a piece. When this crow reaches his nest with fellow crows She shared this event. Another word added: 'The fellow crow has poured its eyes for a piece of bore in his mouth.' These crows were told this thing with the crows that were seen when they flew to the other trees. If it is a crow among them, if a crow pours his eye... pity! She showed her excitement by saying that she was bleeding.

Another crow went a little further and said, 'I saw the blood vessels on that wall'.
Another crow felt sympathy saying ' I'm going to hurt if I tried to stop '. By changing the word, all the crows together printed the first crow as a rowdy crow. Decided to stay away from it. The crow reached her nest in the evening and saw the fellow crows as friendly. Till then, the crows who were whispering have stopped their words and turned their heads. The crow doesn't understand anything. For two days, all the crows have been lighting up, they have been blown away. She didn't know what her fault was.
"Sometimes it's just like that! Society makes us bad without our involvement. This world is full of blue sleeps and rumors. If our mind answers honestly that it is not our fault, we should not feel sad. Choose one friend who can spend time happily. How can you have hundreds of people like that?" Koyilamma consoled the branch by saying.
Quote:
By believing rumors without knowing the other person completely, being friends with him, without fully observing him, talking bad about another person who is not fully familiar, Will miss a good friend, "People are crows" Brother's quote Did you come to the swing then.



Post a Comment

0 Comments