Ad Code

అయోధ్యలో రామాలయ నిర్మాణం - Construction Of Ayodhya Ram Mandir

అయోధ్యలో రామాలయ నిర్మాణం


అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం భూమిపూజ ఆగస్టు 5, 2020న జరగనున్న నేపథ్యంలో మందిర నిర్మాణానికి సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి.

ఈ క్రమంలో మందిరంలో మూడు అంతుస్తులు ఉండనున్నట్లు సమాచారం. గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లుగా నిర్మాణం జరగనుంది.

ప్రతిపాదిత రామమందిరాన్ని 10 ఎకరాల స్థలంలో నిర్మిస్తుండగా, మిగిలిన 57 ఎకరాలను రామ్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయనున్నారు.

ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఆలయ సముదాయంలో నక్షత్ర వాటిక కూడా నిర్మించనున్నారు.

ఒక్కో నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 27 మొక్కలను నాటనున్నారు.
నక్షత్ర వాటిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనాలు తమ పుట్టిన రోజునాడు వారి జన్మ నక్షత్రం ప్రకారం ఆయా చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్మాణం ఉండనుంది.

ఇనుము లేకుండా నిర్మాణం:
ఆలయ పునాది 15 అడుగుల లోతులో ఉంటుంది. ఇది 8 పొరలను కలిగి ఉంటుంది.
ప్రతి పొర 2 అడుగుల వెడల్పు ఉంటుంది.

పునాది వేదికను సిద్ధం చేయడానికి కాంక్రీట్‌, మోరాంగ్‌ను వాడనున్నారు. అయితే ఆలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించడం లేదు.

అంతే కాక వాల్మీకి రామాయణంలో పేర్కొన్న చెట్లను రామ్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌లో నాటనున్నారు.

ఈ ప్రాంతానికి వాల్మీకి రామాయణానికి అనుగుణంగా పేరు పెడతారు.

మందిరం భూమి పూజ తర్వాత రామ్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌లో శేషవతార్‌ ఆలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ట్రస్ట్‌ ప్రతిపాదించింది.

మందిర నిర్మాణం ముగిసిన తర్వాత శేషవతార్‌ శాశ్వత నిర్మణాన్ని చేపడతారు.
రాముడి పుట్టుక నుంచి అవతారం ముగిసేవరకు జరిగిన పలు అంశాలతో ‘రామ్‌ కథా కుంజ్‌ పార్క్’‌ నిర్మాణం కూడా జరగనుంది.

అలానే మందిరం తవ్వకాలలో లభించిన అవశేషాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు.

దాంతో పాటు గోశాల, ధర్మశాల, ఇతర దేవాలయాల సముదాయాలు కూడా ఇక్కడ నిర్మిస్తారు.
'మందిరం ఎత్తు మరో 20 అడుగులు పెంపు' మందిరం భూమి పూజ కోసం రాగి పలకను సిద్ధం చేస్తున్నారు.

దీని మీద ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనగా ఆలయం పేరు, ప్రదేశం, సమయం ఈ పలకపై సంస్కృతంలో చెక్కుతారు.

1988లో ప్రతిపాదించిన అయోధ్య రామ మందిర నిర్మాణం ఎత్తు 161 అడుగులు.
అయితే ప్రస్తుతం దాన్ని మరో 20 అడుగులు పెంచినట్లు ఆలయ ప్రధాన వాస్తు శిల్పి
సిసోంపురా కుమారుడు నిఖిల్‌ సోంపురా తెలిపారు.

ఆగస్టు 5, 2020న జరగనున్న మందిర భూమి పూజ కోసం గంగా, యమున, సరస్వతి నదులు సంగమ క్షేత్రం అయిన త్రివేణి సంగమం నుంచి నీరు, మట్టి తీసుకెళ్లాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సూచించింది.

రామ్‌ మందిర్‌ ఉద్యమంలో ప్రయాగ్‌రాజ్‌‌కు చెందిన పలువురు సాధువులు ప్రముఖ పాత్ర పోషించినందున. అయోధ్యలో భూమి పూజ జరిగే రోజున వివిధ మఠాలు, దేవాలయాల్లో వేడుకలు జరుగుతాయని వీహెచ్‌పీ ప్రతినిధి అశ్వని మిశ్రా తెలిపారు.


Ram Mandir to be constructed in Ayodhya, Bhoomi Pooja is going to be held on August 5, the details about the construction of the temple are being revealed one by one.

In this order, there will be three parts in the temple. Construction is going to happen as ground floor, first and second floor.

While building the proposed Ram Mandir in 10 acres of land. the remaining 57 acres will be developed as Ram Temple Complex.

Sri Ram Janmabhoomi Theertha Kshetra Trust is monitoring the construction of the temple, as per the plan approved by Sri Ram Janmabhoomi Theertha Kshetra Trust, will also be constructed in the temple community.

They are going to plant a total of 27 plants for each star.

Nakshatra's main purpose is to allow people to meditate on their birth star on their birthday.

Construction without iron:
Temple foundation is 15 feet deep. It has 8 layers.
Each layer is 2 feet wide.

Using concrete and morang to prepare the foundation platform. But not using iron in temple construction.

Not only that, the trees mentioned in Valmiki Ramayana are going to be planted in Ram Temple Complex.

This place will be named according to Valmiki Ramayana.

The trust has proposed to temporarily set up the Seshavatar temple in Ram Temple Complex after Mandir Bhoomi Pooja.

After the construction of the temple, Seshavatar will be constructed permanent.
From the birth of Rama to the end of the incarnation, the construction of 'Ram Katha Kunj Park' is also going to happen.

and the museum will be set up with the remains found in the temple digging.
Along with that, Gosala, Dharmashala and other temples communities will also be built here.

'The height of the temple is another 20 feet increase' 
Preparing copper plates for temple land worship.

Important information about the temple on this means name, place, time of the temple On this plaque, they will be checked in Sanskrit.

The construction of Ayodhya Rama Mandir proposed in 1988 is 161 feet height.
But now the temple main architect has increased it to another 20 feet
Nikhil Sompura's son Nikhil Sompura told.

Vishwa Hindu Parishad (VHP) has suggested that water and soil should be taken from the Triveni Sangam of Ganga, Yamuna, Saraswati rivers for the temple land pooja to be held on August 5th.

As many Sadhus from Prayag Raj have played a famous role in the Ram Mandir movement. VHP representative Ashwani Mishra said that on the day of land pooja in Ayodhya, there will be celebrations in various monasteries and temples.





Post a Comment

0 Comments