Ad Code

కేశవ నామాలు వాటి వివరణ - Keshava Namalu

కేశవ నామాలు వాటి వివరణ



విష్ణుమూర్తికి 24 పేర్లున్నాయి.  వాటిని కేశవనామాలంటారని మనకు తెలుసు. ఇవి 24 మాత్రమే ఎందుకు ఉన్నాయి? వీటికి కాలచక్రానికి, గణితానికి ఏమైనా సంబంధం వున్నదా? ఈ 24 కు గణిత పరమైన భూమిక ఏమిటి?


విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం.అంటే నాలుగు చేతులు గలవాడని కదా?
ఈ నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.

నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి.

ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.

1. కేశవ నామాలలో మొదటి నామం కేశవ.
కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో పద్మము, శంఖము ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో గద, చక్రం ధరించి ఉంటాడు.

 2. విష్ణువు యొక్క మరొక నామము మాధవ.
ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో గద, చక్రం ధరించి,ఎడమవైపు ఉన్న రెండు చేతులతో
పద్మము, శంఖము ధరించి ఉంటాడు.

3. మధుసూధన రూపంలో కుడివైపు చేతులతో  చక్రం, శంఖము మరియు ఎడమవైపు చేతులతో గద, పద్మము ధరించి ఉంటాడు.

ఈ విధంగా ప్రతి పదిహేను రోజులకు (పక్షానికొకసారి) పౌర్ణమికి, అమావాస్య కు తన యుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.

ఈ మార్పులు లేదా అమరికలను మనం గణిత శాస్త్ర పరిభాషలో  ప్రస్తారాలు (permutations)
అంటాం.

అనగా 4 వస్తువులను 4 (4 factorial) విధాలుగా అమర్చవచ్చు.

 4! = 4×3×2×1 = 24

శంఖాన్ని ' శ' తోను,
చక్రాన్ని    'చ' తోను,
గదను      'గ' తోను,
పద్మాన్ని  ' ప' తోను సూచిస్తే,

ఆ 24 అమరికలు క్రింది విధంగా వుంటాయి.

1) శచగప  2) శచపగ
3) శపచగ  4) శపగచ
5)శగచప  6)శగపచ
7)చపగశ  8)చపశగ
9)చగపశ  10)చగశప
11)చశగప 12)చశపగ
13)గపశచ 14)గపచశ
15)గచశప 16)గచపశ
17)గశపచ 18)గశచప
19)పచగశ 20)పతశగ
21)పశగచ 22)పశచగ
23)పగశచ 24)పగచశ.

పైవన్నీ ఒక క్రమంలో ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.
కేశవ, నారాయణ
మాధవ, గోవింద
విష్ణు, మధుసూధన
త్రివిక్రమ, వామన
శ్రీధర, హృషీకేశ
పద్మనాభ, దామోదర
సంకర్షణ, వాసుదేవ
అనిరుధ్ధ, ప్రద్యుమ్న,
పురుషోత్తమ, అధోక్షజ
నారసింహ, అచ్యుత
జనార్ధన, ఉపేంద్ర
హరి, శ్రీకృష్ణ.

ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి 24 పక్షాలు అంటే 12 నెలలు, 
అనగా  ఒక సంవత్సరం పడుతుంది.


Keshava Namalu

Significance of Aachamana with 24 Kesava Namas:

Among the Vishnu Sahasra Namas these 24 names are very important.
We recite 24 names of Lord Maha Vishnu during Aachamanam the first three while sipping water and remaining 21 while touching the body parts.

They are

Kesava, 
Narayana, 
Madhava, 
Govinda, 
Vishnu, 
Madhusudhana, 
Trivikrama, 
Vamana, 
Sridhara, 
Hrusheekesa, 
Padmanabha, 
Damodara, 
Sankarushana, 
Vasudeva, 
Pradhyumna, 
Anirudhha, 
Purushothama, 
Adhokshaja, 
Naarasimha, 
Achyuta, 
Janardhana, 
Upendra, 
Hari, and 
Sri Krishna

It is said that Manu Smruthi compares these 24 names of supreme God with 24 tatvas (elements) of creation with which the universe is formed.

For example:
Kesava Nama represents Avyaktha tatva, Narayana Nama represents Mahatatva, Madhava Nama represents Ahankara tatva, and Govindanama represents Manotatvam.

Remaining twenty names represents Pancha Gnanendriyas (eyes, ears, nose, tongue, and skin), Pancha karmendriyas, (hands, legs, speech, and two excretory organs), Pancha Pranas (prana, apana, vyana, udana, and samana) and Pancha Bhoothas (sky, water, fire, air, and earth).

It is said that the first three names Kesava, Narayana, Madhava are tapatraya nivarakas.

It is also said that these 24 names also represents 24 letters of Gayathri Manthra called Beejaksharas that have influence on the human body. 

For performing any Kriya one should have Anthhakarana Suddhi (Inner purity) that is possible only by praying the God by reciting the divine names (manthras) and the process of Aachamanam is only meant for that purpose. By reciting 21 names a person is getting purified bodily and by reciting three names he is getting purified internally.

Reciting these names of Supreme God is the link for devotion as it cleanses the inner body of the human being that helps in attaining quick results. The name of God is so powerful that it has the capacity to vanquish any sins and desires.

Whether it is done knowingly or unknowingly (without understanding its meaning and significance) reciting the divine name will never go a waste. The best example of this is the story of Ajaamila as given in Ajaamilopakhyanam in Sri Mad Bhagavatham where Ajaamila chants unknowingly the name of Lord Narayana at the time of his death and gets rid of his sins. The one that is done by knowing its meaning and significance will not only eliminate the sins but also helps in gaining divine knowledge that leads to ultimate salvation.


Post a Comment

0 Comments