ఈ కరోనా కష్టకాలంలో మనం మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం బలవర్ధకమైన, విటమిన్లతో కూడిన ఆహార, పానీయాలు తీసుకోవటం తప్పనిసరి. తాజా ఆకుకూరలూ, కాయగూరలూ వినియోగించడం, రోజూ వీలున్నమేరకు తాజా పళ్ళు, పళ్ల రసాలు తీసుకోవటం కూడా తప్పదు. అలాగే శక్తి నిక్షేపాలనదగిన డ్రైఫ్రూట్స్, డ్రైనట్స్ కూడా తగినంతగా తీసుకోవాలి. రోజూ తగినంత శరీర వ్యాయామం కూడా చేయాలి. వేడి వేడి ఆహార పానీయాలు మాత్రమే తీసుకోవాలి. కాసేపటికి ఒకసారి వేడినీరు తాగుతూ ఉండాలి. అలాగే సబ్బు, శానిటైజర్ తో తరచు చేతులు కడుక్కుంటూ ఉండాలి. రక్షణ మాస్క్ తో నోటినీ, ముక్కునూ ఎప్పుడూ కప్పి ఉంచుకోవాలి. అన్నిటికీ మించి బయటకు వెళ్ళకుండా వీలైనమేరకు ఇంట్లోనే ఉండటం క్షేమకరం. ఒకవేళ ఎప్పుడైనా బయటకు వెళ్ళటం తప్పనిసరి అయితే మాస్క్ ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ మనకు వైరస్ సోకే అవకాశం లేకుండా చూసుకోవాలి.
మనం ఇంత అప్రమత్తంగా ఉండి, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ సోకే అవకాశాలెన్నో ఉండనే ఉంటాయి. అందుకే వైరస్ సోకిన వారు, ఇంకా వైరస్ బారిన పడనివారు కూడా ముందు జాగ్రత్త చర్యగా అమోఘమైన రోగనిరోధక శక్తి కలిగిన పసుపుతో రోజూ రెండు పూటలా స్నానానికి ముందు ఆవిరి పట్టాలి. మనకు కరోనా వైరస్ సోకినప్పుడు ఆ వైరస్ ముక్కు పుటాలు, నోరు. గొంతు ద్వారా శ్వాసకోశ వ్యవస్థలో ప్రవేశించి, అంతిమంగా ఊపిరితిత్తులను స్థంభింపజేస్తుంది. ఇతర ప్రమాదకర శారీరక రుగ్మతలున్నవారు, శరీరంలో రోగనిరోధక శక్తి తగినంతగా లేనివారి విషయంలో వారి ఊపిరి తిత్తులకు తగినంత ప్రాణవాయువు లభించక వైరస్ సోకిన వ్యక్తుల మరణం సంభవిస్తుంది. కనుక వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మిగిలిన జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు మన శ్వాసకోశ వ్యవస్థను మనం ముందుగా పటిష్ట పరచుకోవటం అవసరం. మసిలే నీటిలో పసుపువేసి ఆ ఆవిరి పీలిస్తే, పసుపులో ఉండే సహజసిద్ధమైన రోగనిరోధక శక్తి కారణంగా మన శ్వాసకోశ వ్యవస్థకు తగినంత రక్షణ లభిస్తుంది. సాధారణంగా మనం ఆవిరి పట్టేందుకు ఫేషియల్ చేయించుకున్నప్పుడు వాడే వాపొరైజర్ ( Vaporiser) పనికొస్తుంది. అయితే ముక్కుతో వేడి ఆవిరి పీల్చటం మాత్రమే కాక ఛాతీ మొత్తానికి వేడి ఆవిరి తగిలితే మన ఊపిరితిత్తులలో శ్వాస అవరోధం ఏమైనా ఉంటే అది తొలగి మనకు సత్వరం ఉపశమనం లభిస్తుంది. కనుక ఒక వెడల్పాటి పాత్రలో మసిలే వేడీనీటిలో అర స్పూన్ పసుపు, ఐదారు తులసి ఆకులు లేక పుదీనా ఆకులు కూడా వేసుకుని దుప్పటి ముసుగులో గాఢంగా శ్వాస పీలుస్తూ కనీసం పావుగంటపాటన్నా ఉండాలి. మధ్యమధ్యలో నోరు తెరుస్తూ నోటిద్వారా కూడా వేడి ఆవిరి పీలుస్తూ ఉండాలి. అలా చేస్తే నోరు, గొంతులలో ఎక్కడన్నా దాగున్న వైరస్ నశించి, ఆ మేరకు ఉపశమనం పొందుతాం.ఇందుకోసం మార్కెట్లో కొన్న పసుపు పొడి కాక, ప్రత్యేకంగా పసుపు కొమ్ములను మర పట్టించి తయారుచేసిన పసుపునే వాడుకోవాలి.
0 Comments