మనిషి పుట్టుక - పరమార్థం
పుట్టామంటే దానికి కారణం గత జన్మలో అసంపూర్ణంగా ఉన్న జీవితాన్ని పరిపూర్ణం చేయడం కోసమే! బావిలో కప్పలా ఈప్రపంచమే నిజమని భ్రమలో పడి సత్యానికి దూరంగా కావద్దు. చావు పుట్టుకల మధ్య కాలం ఒక జన్మ. గత జన్మలో సాధించని అసంపూర్ణమైన జీవితాన్నికి పరిపూర్ణత సాధించడమే జీవితం. పరిపూర్ణతయే సత్యం. ఆ సత్యమే శాశ్వతం. ఆ సత్యమే అమరత్వం. ఆ అమరత్వమే అనంతమైన జీవితం. జీవితమే సత్యం. సత్యమే సహజం. ఆ సహజత్వమే మన జీవిత స్వరూపం. ఆ స్వరూపమే ఆనందం. ఆ ఆనందమే ఉన్నతం. ఉన్నతమైనదే అనంతమైనది. ఆ ఆనంతమైనదే శివ,పర్వతులతత్వం (శివుడు లోపల ఉండి ఆడించేవాడు,పార్వతి బయట ప్రకృతి రూపంలో ఉండి ఆడేది. ఈ రెండుతత్వాల కలయిక సృష్టి).
0 Comments