Ad Code

పరమానందా (పంచాక్షరి) - Panchakshari

పరమానందా (పంచాక్షరి)



ఇది అయిదు అక్షరాలు గల్గిన మంత్రము. పూజాసమయంలో “పరమానందాయై నమ" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

పరమ + ఆనందా = సర్వోత్తమమైన ఆనంద రూపిణియైనది శ్రీదేవి.
ఏ ఆనందం పొందిన తర్వాత - ఇతరములైన ఆనందాలపై ఆసక్తి గలదో మరియు ఎటువంటి దుఃఖాలునూ ఆ ఆనందాన్ని చలింప జేయలేవో, అటువంటి ఆనందాన్ని పరమానందం అందురు.

“యస్మిన్ స్థితో నదుఃఖేన గురుణా పివిచాల్యతే” (భగవద్గీతా)
శ్లోక భావముః - ఏ ఆత్మానందమునందు ఏ బ్రహ్మానందంనందు ఉండే జ్ఞాని ఎంతటి భయంకర దుఃఖం వచ్చినను చలించడో అదియే పరమాత్మ స్థితియు, పరమానంద స్థితియు, పరమయోగ స్థితియును అగును.

కొందరు "పరమ” అనే శబ్దాన్ని ఈ క్రింది విధంగా వ్యాఖ్యానిస్తారు.
"పరః ఇతరం నాస్తి అస్మాత్ ఇతి పరమః" దీని కంటె ఇతరము శ్రేష్ఠమైనది లేదు గనుక ఇది పరమము అయినది. ఇటువంటి అనగా సర్వశ్రేష్ఠమైన ఆనందము - అని ఆనంద పదముతో అన్వయిస్తారు. ఈ ఆనందమునొందిన వానికి ఇతరానందములపై కోరిక జనింపదు గనుక ఇది పరమానందము అని సారాంశము.

కుండలినీ శక్తి సహస్రారము చేరినచో అమృత వర్షము ప్రవిస్తుంది. అప్పుడు దేనిని కోరదు. అందుచే అట్టి స్థితిని పరమానందము అందురు. మూలానికి సమ్మతములు ఉన్నాయి గనుక అన్నియును గ్రాహ్యములే అగును.

ఈ మంత్రమును ఉపాసించేవారు అమ్మ దయచే పరమానంద బ్రహ్మస్థితిని పొందగలరు.





Post a Comment

0 Comments