Ad Code

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము - Sri Dakshinamurthy Stotram

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము


ఇంట్లో ఒక్క దక్షిణామూర్తి చిత్ర పటము పెట్టి, ప్రతీ రోజూ 10 నిమిషాలు ఆయన ముందు కూర్చుని, ఆయన స్తోత్రమును కానీ, మంత్రమును కానీ చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేము. అపమృత్యువు తొలగిపోతుంది, మేధా శక్తి పెంపొందుతుంది, ధారణ, స్పష్టత కలుగుతాయి. కేవలము విద్యార్ధులకు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికీ ఇది వర్తిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి, సత్వ గుణం వృద్ధి చెందుతుంది, ప్రారబ్ధ కర్మలు, దుష్కర్మల ఫలితం క్షీణిస్తుంది, ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.

స్తోత్రము లేదా మంత్రము చదవలేని వారు ఉంటే కేవలము శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని అలా చూస్తూ కూర్చున్నా విశేష ఫలితము ఉంటుంది. రాబోవు జన్మలలో కూడా దక్షిణామూర్తి అనుగ్రహం వలన మంచి విద్య వస్తుంది. ఒక్కసారి దక్షిణామూర్తిని శరణంటే జన్మజన్మల వరకూ ఆయన మనల్ని వదిలిపెట్టడు, ఇది సత్యం సత్యం సత్యం. మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ, నడవలేని స్థితిలో ఉన్నవారు కానీ ఉంటే వారికి కనిపించేలా శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని పెట్టండి. ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండమని చెప్పండి, అపమృత్యువు కలగదు.

ఈ స్తోత్రం ఎటువంటి ఉపదేశమూ పొందకుండా కూడా చేసుకోవచ్చు. స్త్రీలు కూడా నిత్యమూ చేసుకోవచ్చు. వారికి ఇబ్బంది దినములలో చిత్రపటాన్ని చూస్తూ ఉన్నా చాలు.

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః

శాంతిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |
తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ||

ధ్యానమ్
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ||

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ||

చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ||

ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే |
వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ||

అంగుష్థతర్జనీయోగముద్రా వ్యాజేనయోగినామ్ |
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||






Post a Comment

0 Comments